News
News
X

Brahmastra: 'బ్రహ్మాస్త్ర' టీమ్ ప్లాన్ - మెగాస్టార్ కోసం స్పెషల్ షో!

ఇప్పుడు తెలుగులో సెలబ్రిటీల కోసం ప్రత్యేకంగా 'బ్రహ్మాస్త్ర' షో వేయాలని చూస్తున్నారు. 

FOLLOW US: 

బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా 'బ్రహ్మాస్త్ర'. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రణబీర్ కపూర్, అలియాభట్ జంటగా నటించారు. పాన్ ఇండియా లెవెల్ లో సినిమాను విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ సినిమాను 'బ్రహ్మాస్త్రం' పేరుతో విడుదల కానుంది. సెప్టెంబర్ 9న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. పెళ్లి తరువాత అలియా-రణబీర్ జంట నుంచి విడుదల కాబోయే సినిమా ఇదే.

'బ్రహ్మాస్త్ర'లో బిగ్ బి అమితాబ్ బచ్చన్, కింగ్ నాగార్జున అక్కినేని, మౌనీ రాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రీతం ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దక్షిణాది భాషల్లో దర్శక ధీరుడు రాజమౌళి సమర్పిస్తున్నారు. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసం బాగా ఖర్చు పెట్టారు. ప్రచారం కూడా ముమ్మరంగా చేస్తున్నారు. 

రాజమౌళి ఈ సినిమా టీమ్ లో ఓ భాగమైపోయారు. ఇప్పుడు ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం ఎన్టీఆర్ ని తీసుకొస్తున్నారు. ఇలా 'బ్రహ్మాస్త్ర' సినిమాకి విపరీతమైన హైప్ ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు తెలుగులో సెలబ్రిటీల కోసం ప్రత్యేకంగా ఓ షో వేయాలని చూస్తున్నారు. ఈ ప్రీమియర్ కి మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. 

ఓ రకంగా చిరు కూడా ఈ టీమ్ కి సహాయం చేస్తున్నారనే చెప్పాలి. 'బ్రహ్మాస్త్ర' తెలుగు ట్రైలర్ కి చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. సినిమాలో కూడా చిరంజీవి వాయిస్ వినిపించబోతుంది. అలా చిరంజీవి కూడా ఈ సినిమా టీమ్ లో ఓ భాగమయ్యారు. ఇప్పుడు తెలుగులో ఓ షో వేస్తే తమ ప్రచారానికి బాగా ఉపయోగపడుతుందని 'బ్రహ్మాస్త్ర' టీమ్ భావిస్తోంది. 

రీసెంట్ గా విడుదలైన 'లాల్ సింగ్ చడ్డా' సినిమా విషయంలో కూడా ఇలాంటి హడావిడే కనిపించింది. చిరంజీవి కోసం ఆమిర్ ఖాన్ అండ్ కో స్పెషల్ షో వేసింది. ఆ తరువాత చిరంజీవి ఆమిర్ ఖాన్ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరించడానికి ముందుకొచ్చారు. ఆ విధంగా సినిమాకు హైప్ తీసుకొచ్చారు. ప్రమోషన్స్ లో కూడా చిరు పాల్గొన్నారు. కానీ థియేటర్లలో విడుదలైన 'లాల్ సింగ్ చడ్డా' డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో ఈ సినిమాకి దారుణమైన ఓపెనింగ్స్ వచ్చాయి. మరిప్పుడు 'బ్రహ్మాస్త్ర' సినిమా రిజల్ట్ ఏమవుతుందో చూడాలి!

ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన నటించిన 'గాడ్ ఫాదర్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అక్టోబర్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. అలానే బాబీతో ఓ సినిమా మెహర్ రమేష్ తో 'భోళా శంకర్' సినిమాలు కమిట్ అయ్యారు చిరు. ఈ సినిమాలు కూడా కొంతవరకు షూటింగ్ జరుపుకున్నాయి. వీటితో పాటు వెంకీ కుడుములతో కూడా సినిమా ఉందని అనౌన్స్ చేశారు. 

Also Read : ‘ఆంటీ’ ట్రోల్స్‌పై అనసూయ ఆగ్రహం, రౌడీ బాయ్ అభిమానులకు స్ట్రాంగ్ వార్నింగ్

Also Read : విజయ్ దేవరకొండ కాదు, అనకొండ - రౌడీ బాయ్ ప్రవర్తనపై ముంబై థియేటర్ ఓనర్ ఫైర్

Published at : 28 Aug 2022 07:01 PM (IST) Tags: chiranjeevi Rajamouli Brahmastra Brahmastra special show

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: హౌస్ లో మోస్ట్ కన్నింగ్, మోస్ట్ మానిప్యులేటివ్ పర్సన్ అతడే - గీతూ కామెంట్స్, శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: హౌస్ లో మోస్ట్ కన్నింగ్, మోస్ట్ మానిప్యులేటివ్ పర్సన్ అతడే - గీతూ కామెంట్స్, శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Rashmika: మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌తో రిలేషన్ - రష్మిక మాటలు విన్నారా?

Rashmika: మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌తో రిలేషన్ - రష్మిక మాటలు విన్నారా?

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?

Ghost Hindi Release Date : హిందీలో రెండు రోజుల ఆలస్యంగా నాగార్జున 'ఘోస్ట్' - ఎందుకో వివరించిన నిర్మాత

Ghost Hindi Release Date : హిందీలో రెండు రోజుల ఆలస్యంగా నాగార్జున 'ఘోస్ట్' - ఎందుకో వివరించిన నిర్మాత

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ హౌస్ లో మంట పెట్టిన బీబీ ఛాట్ బండార్ - వరస్ట్ పానీపూరి ఎవరికి వచ్చింది?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ హౌస్ లో మంట పెట్టిన బీబీ ఛాట్ బండార్ - వరస్ట్ పానీపూరి ఎవరికి వచ్చింది?

టాప్ స్టోరీస్

Gandhi Jayanti 2022: శుక్రవారానికి గాంధీజీకి ఓ స్పెషల్ లింక్ ఉందట, ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడు ఆయనే

Gandhi Jayanti 2022: శుక్రవారానికి గాంధీజీకి ఓ స్పెషల్ లింక్ ఉందట, ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడు ఆయనే

VIjay CID : చింతకాయల విజయ్ ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

VIjay CID :  చింతకాయల విజయ్  ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్

KCR On Fire : వినతి పత్రాన్ని విసిరికొట్టారు - కేసీఆర్ ఉగ్రరూపాన్ని చూసిన వీఆర్ఏలు !

KCR On Fire : వినతి పత్రాన్ని విసిరికొట్టారు - కేసీఆర్ ఉగ్రరూపాన్ని చూసిన వీఆర్ఏలు !