Brahmanandam: రెబల్ స్టార్ కృష్ణం రాజుకి బ్రహ్మానందం స్వీట్ సర్‌ప్రైజ్
రెబల్ స్టార్ కృష్ణం రాజుకు ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఊహించని బహుమతి చూసి సంతోషం వ్యక్తం చేసిన కృష్ణం రాజు ఆ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు..
శనివారం ఉదయం కృష్ణంరాజు ఇంటికి వెళ్లిన బ్రహ్మానందం ఆయనతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత తాను గీసిన శిరిడి సాయిబాబా చిత్రపటాన్ని బహుమతిగా అందించారు. ఈ స్పెషల్ సర్‌ప్రైజ్ పట్ల కృష్ణంరాజు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా ఫొటోలు షేర్ చేశారు. ‘‘మన కామెడీ జీనియస్.. ఆర్ట్‌లోనూ జీనియస్సే. అద్భుతమైన టాలెంట్ కలిగిన మంచి వ్యక్తి మన బ్రహ్మానందం. థ్యాంక్యూ ఫర్ ది స్పెషల్ సర్‌ప్రైజ్’’అని ట్వీట్ చేశారు.
The comedy genius is an art genius as well. Such a beautiful person with wonderful talent. Thank you for this sweet surprise. God Bless you #Brahmanandam. pic.twitter.com/MPnWkwpeAY
— U.V.Krishnam Raju (@UVKrishnamRaju) October 30, 2021
బ్రహ్మానందం బొమ్మ గీసి ఇవ్వడం ఇదే మొదలు కాదు.. గతంలోనూ పలువురి హీరోలకు తాను స్వయంగా గీసిన చిత్రపటాలు బహూకరించారు. వెంకటేశ్వర స్వామి పెయింటింగ్ వేసి చిరంజీవి, రానా, అల్లు అర్జున్ కి అందించారు. ఖాళీ సమయం దొరికితే చాలు పెయింటింగ్ పై కాన్సన్ ట్రేట్ చేస్తుంటారు బ్రహ్మానందం.
బహ్మానందం తండ్రి చిత్రకారుడు, శిల్పి. ఆయన అన్నయ్యల్లో కూడా చాలామంది చిత్రకారులు ఉన్నారట. వారి ప్రభావంతోనే చిత్రలేఖనంపై ఆసక్తి ఏర్పడిందంటారాయన. ఆరో తరగతి చదివే రోజుల నుంచీ బొమ్మలు వేయడం ప్రారంభించిన బ్రహ్మీ ... జోసఫ్ అనే డ్రాయింగ్ మాస్టారు ప్రోత్సహించారని చెప్పారు. బ్రహ్మానందం వేసిన మొదటి బొమ్మ మహాత్మాగాంధీ. స్కూల్లో, కాలేజీలో డ్రాయింగ్ పోటీలు ఎప్పుడు జరిగినా ఫస్ట్ ప్రైజ్ తనదే. అప్పట్లో చిత్రలేఖనానికి అంతగా ప్రాముఖ్యత లేదనే ఉద్దేశంతో బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించుకోవాలనేది లక్ష్యంగా ఉండేదని... అయితే చిత్రలేఖనాన్ని తాను పట్టించుకోపోయినా చిత్రలేఖనం మాత్రం తనతో సహజీవనం చేసిందంటారు బ్రహ్మానందం. మొత్తానికి బ్రహ్మానందం బ్లడ్ లోనే ఉందన్నమాట బొమ్మలు గీయడం.
Also Read: మారుతి మార్క్ ట్రైలర్ 'మంచిరోజులు వచ్చాయి'
Also Read: సన్నీ-యానీకి గట్టిగానే పడింది … ఫొటోలను చించిపడేసిన నాగార్జున, ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే...!
Also Read: పునీత్ రాజ్‌కుమార్‌కు బాలకృష్ణ నివాళి.. తలకొట్టుకుంటూ కన్నీరుమున్నీరు
Also Read: 'లవ్ యూ సో మచ్ అప్పు సర్'... అనుపమా ఆవేదన
Also Read:అందులో కాజల్ అగర్వాల్ సినిమా ఒక్కటీ లేదేంటి?
Also Read: బెయిల్‌పై విడుదలైన ఆర్యన్ ఖాన్ !
Also Read: తల్లితండ్రుల అంతిమ సంస్కారాలు జరిగిన ప్రదేశంలోనే...
Also Read: వరస్ట్ పెర్ఫార్మర్ గా సన్నీ.. జెస్సీపై మండిపడుతూ..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి