అన్వేషించండి

Avatar Fire And Ash Box Office Day 1: ఇండియాలో రికార్డుల దిశగా 'అవతార్ 3' కలెక్షన్లు... మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందంటే?

Avatar 3 First Day Collection India: ఇండియాలో 'అవతార్: ఫైర్ అండ్ యాష్' బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేసేలా కనబడుతోంది. రణవీర్ సింగ్ 'ధురంధర్'ను బీట్ చేస్తోందని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు.

'టైటానిక్' వంటి కల్ట్ క్లాసిక్ సినిమాను తీసి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న జేమ్స్ కామెరూన్ తీసిన తాజా సినిమా 'అవతార్ ఫైర్ అండ్ యాష్'. ఈ రోజు విడుదలైంది. యాదృచ్చికం ఏమిటంటే... 28 ఏళ్ల క్రితం ఇదే రోజున, అంటే డిసెంబర్ 19న లియోనార్డో డికాప్రియో 'టైటానిక్' విడుదలైంది. ఇప్పుడు 'అవతార్' ఫ్రాంచైజీలోని మూడవ చిత్రం విడుదలైంది.

డిసెంబర్‌లో విడుదలైన ఇండియన్ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. హిందీలో రణవీర్ సింగ్ 'ధురందర్', తెలుగులో నందమూరి బాలకృష్ణ 'అఖండ 2 తాండవం' వంటి బ్లాక్‌ బస్టర్ సినిమాలు ఉన్నా... హాలీవుడ్ సినిమా 'అవతార్ 3' మొదటి రోజే చరిత్ర సృష్టిస్తున్నట్లు కనిపిస్తోంది.

'అవతార్ ఫైర్ అండ్ యాష్' బాక్స్ ఆఫీస్ కలెక్షన్

బాలీవుడ్ ట్రేడ్ పోర్టల్ కొయిమోయి అంచనాల ప్రకారం... ఈ సినిమా ఓపెనింగ్ డే 20 - 22 కోట్ల రూపాయల కలెక్షన్ సాధించవచ్చు. కొద్దిసేపట్లో ఇది నిజానికి ఎంత దగ్గరగా ఉందో స్పష్టమవుతుంది. శుక్రవారం (ఓపెనింగ్ రోజు) మధ్యాహ్నం 3:10 గంటల వరకు 6.62 కోట్ల రూపాయల కలెక్షన్ సాధించింది. సెక్నిల్క్‌లో అందుబాటులో ఉన్న ఈ డేటా ఇది. ఇంకా ఖరారు కాలేదు. రాత్రికి మారుతుంది.

Also ReadAvatar Fire And Ash Telugu Review - 'అవతార్ 3' రివ్యూ: ఇండియన్ ఫ్యామిలీ ఎమోషన్స్ & వరల్డ్ క్లాస్ విజువల్స్... జేమ్స్ కామెరూన్ ఎలా తీశారంటే?

ఇండియాలో ఈ ఏడాది హయ్యస్ట్‌ ఓపెనింగ్...
హాలీవుడ్ సినిమాల్లో 'అవతార్ 3' రికార్డుల మోత!

'అవతార్ 3' సినిమా విడుదలై కొన్ని గంటలు మాత్రమే అయ్యింది. అయితే, ఈ సంవత్సరం ఇండియాలో అతి పెద్ద ఓపెనింగ్ డే కలెక్షన్స్‌ రికార్డును సృష్టించడానికి రెడీ అవుతోవది. ఈ ఏడాది (2025లో) భారతదేశంలో విడుదలైన టాప్ 10హాలీవుడ్ సినిమాల ఓపెనింగ్ డే కలెక్షన్‌లను అధిగమించనుంది.

ఈ జాబితాలో మొదట టామ్ క్రూజ్ నటించిన 'మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకనింగ్' ఉంది, ఇది సెక్నిల్క్ ప్రకారం 11 కోట్ల రూపాయల కలెక్షన్ సాధించింది, ఇది ఇప్పుడు బద్దలు కానుంది.

View this post on Instagram
 
A post shared by James Cameron (@jamescameronofficial)

'అవతార్ ఫైర్ అండ్ యాష్' గురించి...

జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో 2009లో వచ్చిన 'అవతార్'కు సంబంధించిన ఇటీవల విడుదలైన మూడవ భాగానికి ఏబీపీ దేశం తన రివ్యూలో 3 స్టార్స్ ఇస్తూ, అద్భుతమైన విజువల్స్ ఉన్న సినిమా అని పేర్కొంది. రివ్యూలో సినిమా నిడివి ఎక్కువ అని పేర్కొన్నారు.

lso Read'అవతార్ 2' సినిమా వెంకటేష్ 'నారప్ప'లా ఉందని ఎందుకు చెప్పారంటే?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Trump: గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
Advertisement

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Trump: గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
Bangladesh Protest:బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
Chiranjeevi : మెగాస్టార్ న్యూ స్టైలిష్ వింటేజ్ లుక్ - చిరు అభిమానులకు ఫుల్ కిక్
మెగాస్టార్ న్యూ స్టైలిష్ వింటేజ్ లుక్ - చిరు అభిమానులకు ఫుల్ కిక్
Bangladesh Protest : బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి దారుణ హత్య! సజీవ దహనం చేసిన అల్లరి మూకలు!
బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి దారుణ హత్య! సజీవ దహనం చేసిన అల్లరి మూకలు!
Balakrishna : 'వారణాసి'లో బాలయ్య - కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో 'అఖండ 2' టీం... ఫోటోలు వైరల్
'వారణాసి'లో బాలయ్య - కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో 'అఖండ 2' టీం... ఫోటోలు వైరల్
Embed widget