'Manchi Rojulochaie'Trailer: మారుతి మార్క్ ట్రైలర్ 'మంచిరోజులు వచ్చాయి'
'ప్రతిరోజూ పండుగే' సినిమా తర్వాత మారుతి రూపొందించిన మంచిరోజులు వచ్చాయి సినిమా కి సంబంధించి విడుదలైన రిలీజ్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది...
సంతోష్ శోభన్ - మెహరీన్ కౌర్ ఫిర్జాదా హీరోహీరోయిన్లుగా మారుతి రూపొందించిన మూవీ ''మంచి రోజులు వచ్చాయి''.ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ మంచి టాక్ సంపాదించుకున్నాయి. దీపావళి కానుకగా విడుదల కానున్న ఈ మూవీకి సంబంధించి మరో ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్.
సాఫ్ట్ వేర్ వాళ్లంటే సాఫ్ట్ గా ఉంటారనుకుంటున్నారా అంటూ మొదలై 'మావా బ్రో' అనే డైలాగ్ వరకూ ఓ రేంజ్ లో నవ్వులు పూయించింది ట్రైలర్. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అదుర్స్ అనిపించుకోగా తాజాగా వచ్చిన ' రిలీజ్ ట్రైలర్ అంతకు మించి అనిపిస్తోంది. కొలీగ్ తో ప్రేమలో ఉన్నట్టు తండ్రితో మెహ్రీన్ చెప్పడం..ఆమె ప్రవర్తనపై డౌట్ వచ్చి తండ్రి ఇన్వెస్టిగేట్ చేయడం సరదాగా సాగింది.
మొదటగా విడుదలైన ట్రైలర్
శుక్రవారం హైదరాబాద్ లో “మంచి రోజులు వచ్చాయి” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో ముఖ్య అతిథి గా యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ పాల్గొన్నాడు. ఈ వేడుకకు అల్లు అరవింద్ రావడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన మెహ్రీన్ ఆయన ఈవెంట్ కి వస్తే తన సినిమా సక్సెస్ అనే సెంటిమెంట్ ఉందంది. మరి 'మంచి రోజులు వచ్చాయి',' F3' ఈ రెండూ వరుస హిట్స్ వస్తే మెహ్రీన్ కి మంచిరోజులు వచ్చినట్టేగా. సంతోష్ శోభన్, మెహ్రీన్ సహా ఈ మూవీలో అజయ్ ఘోష్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్, సప్తగిరి, సుదర్శన్ ,వైవా హర్ష, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్ ,రజిత ఇతర పాత్రలు పోషించారు. యూవీ కాన్సెప్ట్స్-మాస్ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి అనూప్ సంగీత దర్శకుడు. ‘ఏక్ మినీ కథ’లాంటి సూపర్ హిట్ తర్వాత సంతోష్ శోభన్ నటిస్తున్న సినిమా, 'ప్రతి రోజూ పండగే' సక్సెస్ తర్వాత మారుతి దర్శకత్వంలో తెరకెక్కించినది కావడంతో ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ పై అంచనాలు బాగానే ఉన్నాయి. మరి హీరో-దర్శకుడు ఇద్దరూ హిట్టు కొనసాగిస్తారా అన్నది తెలియాలంటే దీపావళి వరకూ ఆగాల్సిందే.
Also Read: సన్నీ-యానీకి గట్టిగానే పడింది … ఫొటోలను చించిపడేసిన నాగార్జున, ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే...!
Also Read: పునీత్ రాజ్‌కుమార్‌కు బాలకృష్ణ నివాళి.. తలకొట్టుకుంటూ కన్నీరుమున్నీరు
Also Read: 'లవ్ యూ సో మచ్ అప్పు సర్'... అనుపమా ఆవేదన
Also Read:అందులో కాజల్ అగర్వాల్ సినిమా ఒక్కటీ లేదేంటి?
Also Read: బెయిల్‌పై విడుదలైన ఆర్యన్ ఖాన్ !
Also Read: తల్లితండ్రుల అంతిమ సంస్కారాలు జరిగిన ప్రదేశంలోనే...
Also Read: వరస్ట్ పెర్ఫార్మర్ గా సన్నీ.. జెస్సీపై మండిపడుతూ..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి