అన్వేషించండి
Advertisement
Akhanda: 'మాట్లాడుకోవడాల్లేవ్'.. బోయపాటి నిర్ణయం అందుకేనా..?
ఇటీవల జరిగిన 'అఖండ' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో బోయపాటి తన స్పీచ్ తో ఆకట్టుకున్నాడు. కానీ సెపరేట్ గా మీడియాతో మాత్రం మాట్లాడనని నిర్ణయించుకున్నాడట.
టాలీవుడ్ మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ గా బోయపాటికి మంచి పేరుంది. ఆయన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు 'అఖండ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సాధారణంగా ఒక సినిమా విడుదలకు ముందుకు ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేస్తారు. ప్రీరిలీజ్ ఈవెంట్ అని, హీరోహీరోయిన్ల ఇంటర్వ్యూలు, డైరెక్టర్ తో చిట్ చాట్ ఇలా చాలానే ఉంటాయి. 'అఖండ' విషయంలో కూడా ఇవన్నీ ఫాలో అవుతున్నారు. కానీ బోయపాటి మాత్రం మీడియా ముందుకు రానని చెబుతున్నాడట.
ఇటీవల జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో బోయపాటి తన స్పీచ్ తో ఆకట్టుకున్నాడు. కానీ సెపరేట్ గా మీడియాతో మాత్రం మాట్లాడనని నిర్ణయించుకున్నా డట. సినిమా మార్నింగ్ షో పడిన తరువాత మధ్యాహ్నం సమయంలో మీడియాతో మాట్లాడాలని ఫిక్స్ అయ్యారట. బోయపాటి ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం 'వినయ విధేయ రామ' సినిమా అని తెలుస్తోంది. ఆ సినిమా గురించి బోయపాటి చాలా గొప్పగా మాట్లాడారు. కానీ సినిమా రిజల్ట్ అందుకు భిన్నంగా వచ్చింది. దీంతో నెటిజన్లు ఆయన్ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు.
ఆ తరువాత బోయపాటి మరో సినిమా చేయడానికి ఇంతకాలం పట్టింది. అందుకేనేమో.. 'అఖండ' విషయంలో నోరు జారాలని అనుకోవడం లేదు. సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు మళ్లీ సినిమా గురించి గొప్పలు చెప్పుకుంటే మొదటికే మోసం వస్తుందని సైలెంట్ గా ఉండిపోయారు. సినిమాకి హిట్ టాక్ వచ్చిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలని అనుకుంటున్నారట.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రగ్యాజైశ్వాల్ నటిస్తోంది. ఈ సినిమాకు ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Also Read: దివి నుంచి భువికి దిగొచ్చిన దేవకన్యలా...
Also Read: అక్కడ ప్రభాస్ పాద పూజ... ఇక్కడ పూజతో కౌగిలింత!
Also Read: ముందే చెప్పానుగా... గెలవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాం, కపిల్ దేవ్‌గా అదరగొట్టిన రణ్‌వీర్, 83 ట్రైలర్ విడుదల
Also Read: బాలకృష్ణ ముందు డైలాగులు చెప్పడానికి భయపడ్డా! కానీ...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
తెలంగాణ
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Dr. Rahul ChaudharyPresident of Administration in NDIIT
Opinion