Tollywood: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. మళ్లీ యాభై శాతం ఆక్యుపెన్సీ తప్పదా..?
ఒమిక్రాన్ వైరస్ ప్రభావం మాత్రం కచ్చితంగా టాలీవుడ్ పై పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
కరోనా కారణంగా టాలీవుడ్ ఎంతగా ఎఫెక్ట్ అయిందో తెలిసిందే. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టాలీవుడ్ పై ఒమిక్రాన్ రూపంలో మరో పిడుగు పడుతుందేమోననే భయం ఇండస్ట్రీ జనాల్లో మొదలైంది. ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి కొందరు ప్రయాణికులు ఇండియాకు వచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్ కు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఎలాంటి కేసులు నమోదు కాలేదు కానీ.. దీని ప్రభావం మాత్రం కచ్చితంగా టాలీవుడ్ పై పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇప్పటికే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడం బాగా తగ్గించేశారు. ఓటీటీల హవా పెరగడంతో థియేటర్లో కొత్త సినిమా రిలీజైనా.. ఓటీటీలో చూసుకుందాంలే అన్నట్లుగా ఉండిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయని తెలిస్తే మాత్రం జనాలు థియేటర్లకు రారు. శానిటైజర్, సోషల్ డిస్టెన్స్ అని ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఈ వైరస్ ప్రభావం కచ్చితంగా థియేట్రికల్ బిజినెస్ పై పడుతుందని అంటున్నారు.
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లందరూ డిసెంబర్ నుంచి తమ సినిమాల రిలీజ్ లు పెట్టుకున్నారు. 'అఖండ' సినిమాతో మొదలుపెడితే 'ఆర్ఆర్ఆర్', 'భీమ్లానాయక్', 'రాధేశ్యామ్' ఇలా వరుసగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద క్యూ కట్టబోతున్నాయి. ఇలాంటి సమయంలో వైరస్ విజృంభిస్తే.. ఇంక అంతే సంగతులు. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటే మాత్రం సంక్రాంతి సినిమాలన్నీ వాయిదా పడడం ఖాయం.
ఒకవేళ నడిస్తే మాత్రం మళ్లీ యాభై శాతం ఆక్యుపెన్సీతోనే నడిపించుకోవాల్సి ఉంటుంది. కచ్చితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తాయి. అందులో థియేటర్లు కూడా ఉండడం ఖాయం. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. నార్త్ లో ఆంక్షలు విధించినా.. తెలుగు సినిమాలకు నష్టాలు తప్పవు. ఎందుకంటే నెక్స్ట్ రాబోయేవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కదా..!
Also Read: దివి నుంచి భువికి దిగొచ్చిన దేవకన్యలా...
Also Read: అక్కడ ప్రభాస్ పాద పూజ... ఇక్కడ పూజతో కౌగిలింత!
Also Read: ముందే చెప్పానుగా... గెలవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాం, కపిల్ దేవ్‌గా అదరగొట్టిన రణ్‌వీర్, 83 ట్రైలర్ విడుదల
Also Read: బాలకృష్ణ ముందు డైలాగులు చెప్పడానికి భయపడ్డా! కానీ...
Also Read: అవకాశాలు రాక... నృత్య ప్రదర్శనలకు డబ్బు ల్లేక... సినిమాల్లోకి! ఇదీ శివ శంకర్ మాస్టర్ జర్నీ!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి