Pushpa: ‘పుష్ప’ విజయం చాలా ఆనందాన్నిస్తోంది... అల్లు అర్జున్‌ను పొగిడేసిన బాలీవుడ్ హీరో
పుష్ప సినిమా విడుదల అల్లు అర్జున్ ఫ్యాన్స్‌లో ఆనందాన్ని నింపింది.
పుష్ప సినిమా విడుదలయ్యాక మిశ్రమ రెస్పాన్స్ వచ్చింది. అభిమానులంతా సూపర్ అంటుంటే, సాధారణ ప్రజలు ఫర్వాలేదు అనుకుంటున్నారు. హిట్టయిందా లేదా అన్నది తరువాత విషయం, బాక్సాఫీసు దగ్గర కలెక్షన్లే ముఖ్యం. పుష్ప ఇప్పటికే భారీగా వసూళ్లు రాబట్టినట్టు వార్తలు వస్తున్నాయి. అదెంత వరకు నిజమో తెలియదు కానీ, పుష్ప మాత్రం బన్నీలోని నేల మాస్ క్యారెక్టర్ ని బయటకు తీసింది. ఈసినిమాపై ఇప్పటికే చాలా మంది స్టార్లు స్పందించారు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా స్పందించారు. పుష్ప కేవలం తెలుగులోనే కాదు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నిర్మితమైంది. హిందీలో పుష్ప విడుదలైంది.
అక్షయ్ కుమార్ తన ట్విట్టర్ ఖాతాలో ‘కంగ్రాట్యులేషన్స్ అల్లు అర్జున్ మీ పుష్ప సినిమాకు దేశ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా ఇండస్ట్రీకి మరో పెద్ద విజయం ఇది. ఈ సినిమా చూసేందుకు ప్లాన్ చేస్తున్నా’ అని ట్వీట్ చేశారు. దీనికి అల్లు అర్జున్ కూడా స్పందించి రీట్వీట్ చేశారు. ‘థ్యాంక్యూ వెరీమచ్ అక్షయ్ గారు, మీ శుభాకాంక్షలు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీకు కూడా కంగ్రాట్యులేషన్స్. ప్రజలు తిరిగి థియేటర్లకు రావడం మొదలుపెట్టారు. భారత సినీ పరిశ్రమ మళ్లీ వెలుగులీనుతోంది’ అని రాసుకొచ్చారు.
Thank you very much Akshay ji. Nice of you to send your warm wishes . Congratulations to you too . Glad people are coming back to theatres & Indian Film industry started shining again 🙏🏼
— Allu Arjun (@alluarjun) December 21, 2021
="ltr">Congratulations @alluarjun on the massive response you have received from all over India for #PushpaTheRise, another big win for our industry…planning to watch it real soon. @GTelefilms pic.twitter.com/7GAL78rPha— Akshay Kumar (@akshaykumar) December 21, 2021
Also Read: 'ఆర్ఆర్ఆర్' ప్రీరిలీజ్ ఈవెంట్.. గెస్ట్ లుగా చిరంజీవి, బాలకృష్ణ..?
Also Read: ట్రేడ్... మీడియాకు చురకలు అంటించిన సిద్ధార్థ్!
Also Read: శంకర్-చరణ్ సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. అదే ఫార్ములా..
Also Read: అదీ ప్రభాస్ రేంజ్... 'రాధే శ్యామ్' ప్రీ రిలీజ్‌కు యంగ్ హీరో & హాట్ బ్యూటీ రష్మీ యాంకరింగ్!