Nindu Manasulu Serial Today February 27th: నిండు మనసులు: ప్రేరణ స్థానంలో ఐశ్వర్య.. సిద్ధూ షాక్! కాఫీతో మొదలైన కొత్త యుద్ధం!
Nindu Manasulu Serial Today Episode February 27th ప్రేరణ స్థానంలో ఐశ్వర్య కేఫ్‌కి వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode ప్రేరణ కేఫ్‌కి వెళ్లకుండా ఐశ్వర్యని పంపిస్తుంది. సిద్ధూ ప్రేరణ కోసం వస్తే ఐశ్వర్య కేఫ్‌కి వస్తా అంటుంది. సిద్ధూ ప్రేరణకు చెప్తే ప్రేరణ సిద్ధూతో మాట్లాడకుండా ఐశ్వర్యకు వెళ్లమని అంటుంది. ఐశ్వర్య కేఫ్ పనులు చూసుకుంటూ సంగీత సాధన చేస్తానని అంటుంది. సిద్ధూ షాక్ అయి మనం బిజినెస్ పార్టనర్స్ కదా నాతో చెప్పకుండా ఏంటి అంటుంది. ఒకసారి చెప్తే అర్థం కావడం లేదా ఐషూ అని ప్రేరణ అంటే మిమల్నే అంటుంది పద అని ఐషూ అంటుంది.
సిద్ధూ ఐశ్వర్యని తీసుకొని కేఫ్‌కి వెళ్తాడు. నువ్వేంటి వచ్చావ్ అని కుమార్ అంటే.. ఇప్పుడు ఈ ఐశ్వర్య పని చేయడానికి రాలేదు.. పని చేయించడానికి ఈ కేఫ్‌ని ముందుకి నడిపించడానికి వచ్చిందని అంటుంది. ప్రేరణ గారు ఎందుకు రాలేదు అని కుమార్ అంటే ప్రేరణ గారు చదువుకోవాలి అంటే అందుకే ఐశ్వర్య గారు దగ్గరుండి చూసుకుంటారు అని సిద్ధూ అంటాడు. నేను చేసే కాఫీకి అందరూ షాక్ అయిపోతారు.. అని అంటుంది. ప్రేరణ చదువుకుంటూ సిద్ధూ గురించి ఆలోచిస్తుంది. సిద్ధూ కూడా ప్రేరణ గురించి ఆలోచించి ప్రేరణకు ఫోన్ చేస్తాడు. ప్రేరణ లిఫ్ట్ చేయదు.. మళ్లీ మళ్లీ చేయడంతో కాల్ లిఫ్ట్ చేస్తుంది. నీ మనసులో ఏం ఉంది అని సిద్ధూ అడిగితే నా మనసులో ఏం లేదు అని అంటుంది.
ఐశ్వర్యని ఎందుకు పంపావ్ అంటే తనే నా ప్లేస్‌ని రీ ప్లేస్ చేస్తుందని అంటుంది. నువ్వు ఇక్కడికి వస్తే మాట పడతావ్ అని నన్ను దూరం పెట్టావ్,, మరి ఐశ్వర్య ఇక్కడ ఉంటే తనని అనడం మానేస్తారు అనుకుంటున్నావా., అని అడుగుతాడు. నేను అంతా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా అని అంటుంది. సిద్ధూ ఎంత చెప్పినా ప్రేరణ ఎప్పటిలా ఉండటానికి ఒప్పుకోదు. కుమార్ కాఫీ చేయడానికి వెళ్తే నేను చూసుకుంటా అని ఐశ్వర్య కుమార్‌ని పంపేసి రాగాలు తీస్తూ అన్నీ పడేసి పెంట పెంట చేస్తుంది. నువ్వు ఎలా రావో నేనూ చూస్తూ ప్రేరణ అని సిద్ధూ అనుకుంటాడు.
ఇందిర భర్తకి సూప్ తాగిస్తుంటే ఈశ్వరి గణ చూసి రగిలిపోతారు. వైజాగ్‌లోనే వీళ్లని చంపేసుంటే ఈ ప్రాబ్లమ్ ఉండేది కాదు.. ఎవరైనా చూస్తే పరిస్థితి ఏంటి అని అంటుంది. ఇంతలో ఇందిర వచ్చి ఆయనకు ఫ్రూట్స్ తినిపించారా.. అని అడుగుతుంది. నా భర్త గురించి నీకు ఎందుకు అని అడిగితే ఆయన నాకు కూడా భర్త అని ఇందిర అంటుంది. ఫ్రూట్స్ తీసుకొస్తుంది. ఇంతలో సుధాకర్ వస్తాడు. మందులు కూడా అయిపోయావి.. అవి చూసుకోరా.. రేయ్ తమ్ముడు అదేంటో చూడరా అంటుంది. తమ్ముడా అని గణ షాక్ అయిపోతాడు.
ప్రేరణ బాధగా ఉంటే రంజిత్ వెళ్తాడు. కేఫ్‌కి వెళ్లావా అని అంటే ఐశ్వర్య వెళ్తుందని చెప్తుంది. ఐశ్వర్యకి ఏం తెలుసు అని పంపిచావ్ అంటాడు. కేఫ్లో ఓ కస్టమర్ వచ్చి కాఫీ అడిగితే కుమార్ కాఫీ చేయమని ఐశ్వర్యకి చెప్తాడు. ఐశ్వర్య కాఫీ చేసి తీసుకెళ్లి ఇస్తుంది. కస్టమర్ కాఫీ టేస్ట్ చూసి అలా ఉండిపోతాడు. ఏంటి ఈ కాఫీ అని పారిపోతాడు. సిద్ధూ, కుమార్ బిత్తరపోతారు. కస్టమర్ ఐశ్వర్య చేసిన కాఫీ బాలేదు అని చెప్పిన వీడియో సిద్ధూ ప్రేరణకు పంపిస్తాడు. ప్రేరణ ఫీలవుతుంది. రంజిత్ ప్రేరణకు కేఫ్‌కి వెళ్లమని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.























