అన్వేషించండి

Chinni Serial Today February 27th: చిన్ని సీరియల్: చిన్ని ఆట షురూ చేసిందా! మ్యాడీ అమెరికా పారిపోతాడా! నాగవల్లి ఏం చేస్తుంది!

Chinni Serial Today Episode February 27th మ్యాడీ అమెరికా వెళ్లిపోవాలి అనుకోవడం నాగవల్లి ఆపడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధునే చిన్ని అని తెలియడంతో మ్యాడీ ఇంటి నుంచి గెంటేస్తాడు. మధు ఏడుస్తుందేమో అని స్వరూప, సుబ్బు వచ్చి మధు అని పిలిస్తే మధు కాదు చిన్ని..  చిన్నిగా పుట్టాను.. మధుగా మీ దగ్గరకు వచ్చిను.. మధుగానే అత్తారింటికి వెళ్లాను.. కానీ చిన్నిగా అవమానంతో అత్తారింటి నుంచి వచ్చాను.. అందుకే ఇక నుంచి చిన్నిగా ఉంటాను.. చిన్నిగానే నేను చేయాల్సిన పనులు చేస్తా.. జరిగిన దానికి బాధ పడుతూ ఉంటాను అనుకున్నారా,, చిన్నిగా నేను బాధ పడను,, మిమల్ని బాధ పెట్టను.. చిన్నిగానే నాన్న ఎక్కడున్నాడో తెలుసుకుంటా.. అమ్మ ఏ తప్పు చేయలేదు అని నిరూపిస్తా.. చిన్ని గానే మ్యాడీకి దగ్గరవుతా.. చిన్నిగానే అత్తారింటికి వెళ్తా అంటుంది. 

స్వరూప కూతురితో నువ్వు చిన్నిగా అనుకున్నది కచ్చితంగా సాధిస్తావ్ అమ్మా.. అని అంటుంది. మీ నాన్న గురించి తెలిస్తే కానీ మీ అమ్మ నిర్దోషి అని నిరూపించగలవు.. ఈ విషయం మ్యాడీకి చెప్తేనే కాస్త కూల్ అవుతాడు అని సుబ్బు అంటాడు. మ్యాడీకి చెప్తే నా మీద ఇంకా కోపం పెంచుకుంటాడు.. సాక్ష్యాధారాలతోనే మా అమ్మ నిర్దోషి అని నిరూపిస్తా అంటుంది. తర్వాత చిన్ని ఆఫ్ టికెట్‌కి కలుస్తుంది. చక్కగా కాపురం చేసుకుంటావని అనుకుంటే ఇలా జరుగుతుందని అనుకోలేదు అమ్మా,, బాధ గుండెల్లో దాచుకొని నవ్వుతూ ఎలా ఉంటున్నావ్ అంటే ఎలా అయినా నేను అనుకున్నది చేస్తా.. ఇప్పటి వరకు నువ్వు నీ ప్రయత్నాలు చేశావ్,, నేను నా ప్రయత్నాలు చేశాను ఇప్పుడు ఇద్దరం కలిసి చేద్దాం అని వీలైనంత త్వరగా నా కాపురం నిలబెట్టుకోవాలి అని చిన్ని అంటుంది. 

బాలరాజుని దేవా వాళ్లు రోజుకో ప్లేస్ మార్చుతున్నారు అది కనిపెట్టాలని అంటాడు. చిన్ని, ఆఫ్ టికెట్ మాట్లాడుతూ ఉంటే నాగవల్లి చూసి భర్త గెంటేస్తే ఏ ఆడపిల్ల అయినా ఓ మూల కూర్చొని ఏడుస్తుంది. కానీ నువ్వు మాత్రం నీ కాపురం నిలబెట్టుకోవడానికి బాగా ప్రయత్నిస్తున్నావ్ అని అర్థమైంది.. కానీ ఆ దేవుడు కూడా నీ కాపురం నిలబెట్టలేదు.. నువ్వు పెట్టుకుంది నాగవల్లితో అని అనుకుంటుంది. చిన్ని, ఆఫ్‌ టికెట్‌లు బాలరాజు ఫొటో పట్టుకొని మొత్తం తిరుగుతూ వెతుకుతూ ఉంటారు. ఎంతమందిని అడిగినా ఫలితం ఉండదు. మరోవైపు మ్యాడీ అమెరికా వెళ్లాలి అని టికెట్ బుక్ చేసుకుంటాడు. నాగవల్లికి ఒకతను టికెట్ తీసుకొచ్చి ఇస్తాడు.  

నాగవల్లి మ్యాడీని పిలిచి అమెరికా వెళ్లడం ఏంటి అని అడుగుతుంది. చిన్ని వల్ల ఇక్కడ ఉండలేక అమెరికా వెళ్లిపోతున్నా అంటే దాని కోసం నువ్వు వెళ్లిపోవడం ఏంటి అని నాగవల్లి అంటుంది. నాగవల్లి ఎంత చెప్పినా వినడు. దాంతో నాగవల్లి సరే నువ్వు అమెరికా వెళ్లిపో అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. చిన్నికి భయపడి అమెరికా పారిపోతున్నావ్ అని అనుకుంటారు. పారిపో అంటుంది. ఆ చిన్నికి భయపడి నేను పారిపోవడం లేదు అని మ్యాడీ అంటాడు. మినిస్టర్ కొడుకు పారిపోయాడు అని న్యూస్ వస్తుందని చెప్పి మ్యాడీతో చెప్తుంది. దాంతో మ్యాడీ టికెట్ చింపేస్తాడు. తర్వాత నాగవల్లి దేవాకి విషయం చెప్తుంది.

ఇక చిన్ని, ఆఫ్ టికెట్ మాట్లాడిన విషయం కూడా చెప్తుంది. బాలరాజు ఆచూకీ ఎప్పటికీ తెలీకూడదు అని అంటుంది. అంతా నేను చూసుకుంటా అని దేవా అంటాడు. దేవా తన మనుషులకు కాల్ చేసి ఈ రోజు రాత్రికే చిన్నిని చంపేయాలి అని చెప్తాడు. రౌడీలు రాత్రి దారిలో చిన్ని కోసం కాపాలా కాస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today June 4th: ప్రేరణను ఇంటి నుంచి పంపడానికి విజయానంద్ వేసిన ఎత్తు ఏంటి..? సిద్ధూ ఇచ్చిన వార్నింగ్ ఏంటి..?
నిండుమనసులు: ప్రేరణను ఇంటి నుంచి పంపడానికి విజయానంద్ వేసిన ఎత్తు ఏంటి..? సిద్ధూ ఇచ్చిన వార్నింగ్ ఏంటి..?
Illu Illalu Pillalu Serial Today June 4th: ధీరజ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు....స్టేషన్‌లో పెట్టి కొట్టడంతో ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకున్న ప్రేమ
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు....స్టేషన్‌లో పెట్టి కొట్టడంతో ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకున్న ప్రేమ
Podarillu Serial Today June 4th:చక్రిని కిడ్నాప్‌ చేయించింది తండ్రి,అన్న అని తెలుసుకున్న మహా...ప్రతాప్‌కు మాధవ్‌ స్ట్రాంగ్ వార్నింగ్‌
పొదరిల్లు:చక్రిని కిడ్నాప్‌ చేయించింది తండ్రి,అన్న అని తెలుసుకున్న మహా...ప్రతాప్‌కు మాధవ్‌ స్ట్రాంగ్ వార్నింగ్‌
Ghanta Mounica: గోదావరి సీరియల్ అలకనంద.. సోషల్ మీడియా టు సీరియల్స్..
గోదావరి సీరియల్ అలకనంద.. సోషల్ మీడియా టు సీరియల్స్..

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
Opposition Crisis Deep Dive Analysis: ప్రాంతీయ పక్షాల కోటలకు బీటలు! ప్రశ్నార్థకంగా పార్టీల మనుగడ! అధికారంలో లేకపోతే అంతే సంగతులా?
ప్రాంతీయ పక్షాల కోటలకు బీటలు! ప్రశ్నార్థకంగా పార్టీల మనుగడ! అధికారంలో లేకపోతే అంతే సంగతులా?
Chiranjeevi On Peddi: చరణ్ తండ్రిగానే కాదు, నటుడిగానూ గర్విస్తున్నా - పెద్ది విజయంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్
చరణ్ తండ్రిగానే కాదు, నటుడిగానూ గర్విస్తున్నా - పెద్ది విజయంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్
Kerala Menstrual Leave for Schoolgirls:కేరళ విద్యార్థులకు మెన్‌స్ట్రువల్ హాలిడేస్ ! దేశవ్యాప్తంగా చర్చినీయాంశమైన మోడల్‌!
కేరళ విద్యార్థులకు మెన్‌స్ట్రువల్ హాలిడేస్ ! దేశవ్యాప్తంగా చర్చినీయాంశమైన మోడల్‌!
AP DSC 2025 Irregularities: మెగా డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఆరోపణలు! కమిటీ వేసిన వైఎస్‌ జగన్! సీబీఐ విచారణకు డిమాండ్!
మెగా డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఆరోపణలు! కమిటీ వేసిన వైఎస్‌ జగన్! సీబీఐ విచారణకు డిమాండ్!
Peddi Vs Pushpa: పెద్ది వర్సెస్ పుష్ప... ఒక్క పాయింట్‌ మీద సినిమాలు తీసిన సుక్కు & బుచ్చి
పెద్ది వర్సెస్ పుష్ప... ఒక్క పాయింట్‌ మీద సినిమాలు తీసిన సుక్కు & బుచ్చి
TDP Janasena BJP Seat Sharing Formula: ఏపీ స్థానిక ఎన్నికల ఆలస్యం వెనుక బాబు మాస్టర్ ప్లాన్ - కూటమిలో చిచ్చు పెట్టకుండా నియోజకవర్గ స్థాయి ‘సమన్వయ’ ఫార్ములా!
ఏపీ స్థానిక ఎన్నికల ఆలస్యం వెనుక బాబు మాస్టర్ ప్లాన్ - కూటమిలో చిచ్చు పెట్టకుండా నియోజకవర్గ స్థాయి ‘సమన్వయ’ ఫార్ములా!
West Bengal TMC Political Crisis 2026: బెంగాల్ రాజకీయాల్లో మహారాష్ట్ర సీన్ - టీఎంసీలో ఓ షిండే రెడీ - మమతా బెనర్జీకి 50 మంది ఎమ్మెల్యేలు షాకిస్తారా?
బెంగాల్ రాజకీయాల్లో మహారాష్ట్ర సీన్ - టీఎంసీలో ఓ షిండే రెడీ - మమతా బెనర్జీకి 50 మంది ఎమ్మెల్యేలు షాకిస్తారా?
Embed widget