Lakshimi Raave Maa Intiki Serial Today February 26th:ఫస్ట్‌నైట్‌కి ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మ్యాడీ..శ్రీలక్ష్మీ వెళ్లి పిలిచినా రానని తెగేసి చెప్పిన మధుసూదన్
Lakshimi Raave Maa Intiki Serial Today Episode: ఫస్ట్‌నైట్‌కి ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మ్యాడీ..శ్రీలక్ష్మీ వెళ్లి పిలిచినా రానని తెగేసి చెప్పిన మధుసూదన్

Lakshimi Raave Maa Intiki Serial Today Episode: 16రోజులపండుగ తర్వాత నీకు, శ్రీలక్ష్మీకి ఫస్ట్‌నైట్‌కి ఏర్పాట్లు చేస్తున్నారని మ్యాడీకి ప్రియంవద చెబుతుంది. అతడికి కోపం వచ్చేలా రెచ్చగొడుతుంది.దీంతో మ్యాడీ వాళ్ల అమ్మపై గట్టిగా అరుస్తాడు. ఏదోఒకటి చేసి దాన్ని ఆపుదామని వాళ్ల అమ్మఅనగా....వాడికి ఇష్టం లేని పెళ్లి జరుగుతుంటే ఆపగలిగారా లేక సింధూకు ఇష్టం లేని పెళ్లి జరిగితే ఆపగలిగారా మరి దీన్ని ఎలా ఆపుతారని ప్రియంవద మరింత రెచ్చగొడుతుంది. దీంతో మ్యాడీ కోపంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతాడు. తాను అసలు ఇంటికే రానని చెప్పి వెళ్లిపోతాడు. వాళ్ల అమ్మ వెంటపడి పిలిచినా ఆగకుండా బయకటకు వెళ్లిపోతాడు. దీంతో హైమావతి ప్రియంవదపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వాడినిఎందుకు అలా రెచ్చగొట్టి ఇంట్లో నుంచి బయటకు వెళ్లేలా చేశావని మండిపడుతుంది. మామయ్యగారు వస్తే ఇప్పుడు ఏం చెప్పాలని అంటుంది. దీనంతటికి నువ్వు కారణమని...నీవల్లే వాడు బయటకు వెళ్లిపోయాడు కాబట్టి నువ్వే తీసుకుని రావాలని శ్రీలక్ష్మీని వాళ్ల అత్తయ్య ఆదేశిస్తుంది. సాయంత్రం కల్లా వాడు ఇంట్లో ఉండాలని లేకపోతే నువ్వు కూడా ఉండొద్దని చెప్పడంతో శ్రీలక్ష్మీ మ్యాడీని వెతుక్కుంటూ వెళ్లిపోతుంది.
త్రిష ఇస్తున్న పార్టీకి మ్యాడీ వెళతాడు. మ్యాడీని చూడగానే త్రిషతోపాటు వాళ్ల ప్రెండ్స్ అందరూ చాలా ఆనందపడిపోతారు. నువ్వు వస్తావని అసలు అనుకోలేదని అంటారు.వాళ్లందరూ కలిసి మందు తాగుతుంటే అప్పుడే అక్కడికి శ్రీలక్ష్మీ వస్తుంది. లక్ష్మీని చూడగానే త్రిషకు కోపం వస్తుంది. మేం ఇక్కడ ఉన్నామని నీకు ఎవరు చెప్పారని అడగ్గా....నీతోపాటు నాకు కూడా కాలేజీలో ప్రెండ్స్ ఉన్నారని...వాళ్లే చెప్పారని చెబతుంది. మ్యాడీని ఇంటికి రమ్మని బ్రతిమాలుతుంది.తాను ఆ ఇంటికి రానంటే రానని చెబుతాడు. మీరు రాకుంటే నేను కూడా ఇక్కడి నుంచి వెళ్లనని శ్రీలక్ష్మీ మొండికేసి కూర్చుంటుంది.అప్పుడే పోలీసులు అక్కడికి వచ్చి ఇక్కడ న్యూసెన్స్ జరుగుతోందని ఫిర్యాదు వచ్చిందని ఎవరు ఇక్కడ గొడవ చేస్తున్నారని ప్రశ్నిస్తాడు. తాను ఏ గొడవ చేయడంలేదని...మా మ్యాడీని ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చానని శ్రీలక్ష్మీ చెబుతుంది. అయితే ఇక్కడ గొడవ చేసేది నువ్వేనా అని ఆమెను స్టేషన్‌కు తీసుకెళ్లడానికి ఎస్‌ఐ ప్రయత్నిస్తాడు. అసులు పోలీసులకు ఎవరు ఫిర్యాదు చేశారని మ్యాడీ అడగ్గా....నేనే మెసేజ్ పెట్టానని త్రిష చెబుతుంది. వెంటనే మ్యాడీ పోలీసుల దగ్గరకు వెళ్లి ఆ అమ్మాయి ఎలాంటి గొడవ చేయలేదని...పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి కావడంతో ఎలా నడుచుకోవాలో తెలియలేదని చెప్పి వారిని పంపిస్తాడు. తాను ఇంటికి రానని చెప్పడంతో శ్రీలక్ష్మీ వెళ్లిపోతుంది.
మ్యాడీని బయటకు ఎందుకు పంపిచారని వాళ్ల నాన్న ఇంట్లో అందరిపై అరుస్తాడు. లక్ష్మీ వెళ్లిందని తీసుకుని వస్తుందని హైమావతి చెబుతుంది.ఇంతలో శ్రీలక్ష్మీ ఒక్కతే తిరిగి రావడంతో మ్యాడీ ఎక్కడని అడిగితే....రానని చెప్పాడని చెబుతుంది. ఇప్పుడు మామయ్యగారికి ఏం చెప్పాలని అంటే నిజం చెప్పేద్దామని శ్రీలక్ష్మీ అంటుంది. అంతలోనే సూర్యనారాయణ వచ్చి మ్యాడీ ఎక్కడని అడగ్గా...ప్రెండ్ బర్త్‌డే పార్టీ ఉంటే వెళ్లాడని ప్రియంవద అబద్దం చెబుతుంది. రేపు అందరూ ఉదయమే రెడీగా ఉండాలని చెప్పి సూర్యనారాయణ వెళ్లిపోతాడు.























