అన్వేషించండి

Esmayeel Shroff Death: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఇస్మాయిల్ ష్రాఫ్ మృతి, విషాదంలో బి టౌన్

బాలీవుడ్ సీనియర్ దర్శకుడు ఇస్మాయిల్ ష్రాఫ్ కన్నుమూశారు. ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యం తో బాధపడుతున్నారు.

బాలీవుడ్ సీనియర్ దర్శకుడు ఇస్మాయిల్ ష్రాఫ్ కన్నుమూశారు. ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యం తో బాధపడుతున్నారు. నెల రోజుల క్రితం ఆయనకు గుండెపోటు రావడంతో ముంబై లోని కోకిలాబేన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. గత నెల రోజులుగా అయనకు చికిత్స జరుగుతోంది. ఈ నేపథ్యంలో పరిస్థితి విషమించడంతో ఆయన బుధవారం ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇస్మాయిల్ ష్రాఫ్ మృతితో బాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.  ష్రాఫ్ మృతిపట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో పుట్టారు ష్రాఫ్. చదువు పూర్తయిన తర్వాత సినిమాపై ఉన్న ఆసక్తితో బాలీవుడ్ వెళ్లారు. అక్కడ బాలీవుడ్‌ దర్శకుడు భీమ్‌ సింగ్‌ దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా  కొంత కాలం పనిచేశారు ష్రాఫ్. తర్వాత ‘అగర్‌’ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ష్రాఫ్. ఆ తర్వాత అహిస్తా అహిస్తా, జిద్, అగర్, గాడ్ అండ్ గన్, పోలీస్ పబ్లిక్, మజ్దూర్, దిల్ ఆఖిర్ దిల్ హై, బులుండి, నిశ్చయ్, సూర్య, ఝూతా సచ్ వంటి అనేక బాలీవుడ్ సినిమాలు తీసారాయన. ఆయన దర్శకుడిగా పనిచేసిన చివరి చిత్రం 2004 లో విడుదలైన 'తోడా తుమ్ బద్లో తోడా హమ్'. ఈ సినిమా లో ఆర్య బబ్బర్ ఇంకా శ్రియ శరణ్ ప్రధాన పాత్రలు పోషించారు. 

ఇస్మాయిల్ ష్రాఫ్ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. నటుడు గోవిందా మాట్లాడుతూ.. ఇస్మాయిల్ ష్రాఫ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. తన సినిమా కెరీర్ ఇస్మాయిల్ తోనే మొదలైందని తన మొదటి సినిమా 'లవ్ 86' కు ఇస్మాయిల్ దర్శకుడని అన్నారు. గోవింద్ లాంటి వ్యక్తిని గోవిందాగా సినిమాకు పరిచయం చేసిన వ్యక్తి ఇస్మాయిల్ అని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

సీనియర్ నటి పద్మిని కొల్లాపూర్ ఇస్మాయిల్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనతో తనకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆయనతో 'తొడిసి బెవఫై', 'అహిస్తా అహిస్తా'  వంటి సినిమాలు చేసానని అన్నారు. ఎప్పుడూ నవ్వు ముఖంతో ఆయన ఉండేవారని, నటులతో చక్కగా కలిసిపోయేవారని అన్నారు. 'అహిస్తా అహిస్తా' సినిమా చేస్తున్న సమయంలో తాను తోటి నటులతో మాట్లాడుకునేవాళ్ళమని ఆ మాటలు అర్థం కాక ఇస్మాయిల్ మమ్మల్ని అడిగేవారని గుర్తు చేసుకున్నారు. ఎప్పుడూ నవ్వుతూ, సున్నితంగా ఉండే మనిషి ఇస్మాయిల్ అని పేర్కొన్నారు. అలాంటి దర్శకుడు ను కోల్పోవడం బాలీవుడ్ కి తీరని లోటని వ్యాఖ్యానించారు. 

Also Read : విజయ్ దేవరకొండ, తమిళంలో సూర్య & ఇంకా - సమంత 'యశోద'కు పాన్ ఇండియా హీరోల సపోర్ట్

సినీ నిర్మాత అశోక్ పండిట్ ఇస్మాయిల్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఇస్మాయిల్ మృతి వార్త బాధించిందని, ఎన్నో ఉత్తమ చిత్రాలకు దర్శకత్వం వహించిన మంచి డైరెక్టర్ ను కోల్పోవడం పరిశ్రమకు తీరని నష్టం అని ట్వీట్ చేశారు. మరోవైపు ఇస్మాయిల్ మృతి పట్ల బాలీవుడ్ శోక సంద్రం లో మునిగిపోయింది. బాలీవుడ్ ప్రముఖులంతా ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget