Arjun Kapoor: ప్రముఖ నటుడికి కరోనా పాజిటివ్.. ఇంటికి సీల్ వేసిన అధికారులు..
హీరో అర్జున్ కపూర్ కి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. అర్జున్ కపూర్ తో పాటు అతడి సోదరి అన్షులా కపూర్ కి కూడా కరోనా సోకింది.
మహారాష్ట్రలో రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ కూడా దాని ప్రభావం చూపిస్తోంది. రీసెంట్ గా బాలీవుడ్ కి చెందిన చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. కరీనా కపూర్ లాంటి స్టార్ హీరోయిన్ కోవిడ్ బారిన పడి.. ట్రీట్మెంట్ తీసుకొని కోలుకుంది. తాజాగా హీరో అర్జున్ కపూర్ కి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. అర్జున్ కపూర్ తో పాటు అతడి సోదరి అన్షులా కపూర్ కి కూడా కరోనా సోకింది.
దీంతో వీరిద్దరూ హోమ్ ఐసొలేషన్ లో ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో తమను కలిసి వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని వారు కోరారు. అర్జున్ కపూర్ గర్ల్ ఫ్రెండ్ మలైకా అరోరా కోవిడ్ పరీక్షలు చేయించుకోగా.. ఆమెకి నెగెటివ్ వచ్చింది. ఇటీవల వారిద్దరూ డిన్నర్ కు వెళ్లారు. దీంతో ఆమెకి కూడా కరోనా వస్తుందేమోనని అనుకున్నారు కానీ నెగెటివ్ అని తేలింది.
అలానే రియా కపూర్, తన భర్త కరణ్ బులానీకి కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని రియా కపూర్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా వెల్లడించింది. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ.. తను తన భర్త కరోనా బారిన పడ్డామని.. ఇప్పుడు ఐసోలేషన్ లో ఉంటున్నట్లు.. డాక్టర్స్ ఇచ్చిన మెడికేషన్ తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
అర్జున్ కపూర్ ఇంట్లో ఏకంగా నలుగురికి కరోనా రావండతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అప్రమత్తమైంది. ముంబైలోని అర్జున్ కపూర్ నివాసానికి వెంటనే సీల్ వేసింది. ఇంటి పరిసరాలను శానిటైజ్ చేసింది. ఇదిలా ఉండగా.. 2020లో కూడా అర్జున్ కపూర్ కి కరోనా సోకింది. ఇప్పుడు రెండోసారి కూడా పాజిటివ్ రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Also Read:టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో శర్వా.. టీజర్ కొత్తగా ఉందే..
Also Read:'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్ పై రాజమౌళి క్లారిటీ..