అన్వేషించండి
Advertisement
Balakrishna: బాలయ్యకు విలన్ గా యాక్షన్ కింగ్.. క్రేజీ కాంబో సెట్..
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో కనిపించిన అర్జున్ ఇప్పుడు బాలయ్య సినిమాలో విలన్ రోల్ చేయడానికి అంగీకరించినట్లు సమాచారం.
నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది 'అఖండ' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. బోయపాటి డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. అఘోరా గెటప్ లో బాలయ్య పెర్ఫార్మన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికీ కొన్ని ఏరియాలలో ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతోంది.
ఈ సినిమా ఇచ్చిన జోష్ తో బాలయ్య వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ముందుగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. వందేళ్ల కాలం నుంచి వేటపాలెంకు సంబంధించిన వార్తా పత్రికలన్నీ తిరగేసి ఈ సినిమా కథను సిద్ధం చేసుకున్నారు దర్శకుడు గోపీచంద్. కథ ప్రకారం.. ఈ సినిమాలో బాలయ్య పోలీస్ ఆఫీసర్‌గా, ఫ్యాక్షనిస్ట్ గా రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం.
ఈ సినిమా కోసం గోపీచంద్ మలినేని కొందరు పేరున్న ఆర్టిస్ట్ లను విలన్స్ గా తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కన్నడ నటుడు దునియా విజయ్ ను విలన్ పాత్ర కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది. తాజాగా మరో నటుడిని విలన్ రోల్ కోసం అడిగారట. అతడు మరెవరో కాదు.. యాక్షన్ కింగ్ అర్జున్. ఇప్పటికే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో కనిపించిన అర్జున్ ఇప్పుడు బాలయ్య సినిమాలో విలన్ రోల్ చేయడానికి అంగీకరించినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
బాలయ్య, అర్జున్ ల కెరీర్ ఒకేసారి మొదలైంది. వీరిద్దరూ భార్గవ ఆర్ట్స్ బ్యానర్ లోనే తొలి హిట్టుని అందుకున్నారు. 'మా పల్లెలో గోపాలుడు'తో అర్జున్ హిట్ అందుకుంటే.. 'మంగమ్మగారి మనవడు' సినిమాతో బాలయ్య సక్సెస్ అందుకున్నారు. తెలుగులో బాలకృష్ణ నటించిన 'నరసింహనాయుడు' సినిమాను అర్జున్ తమిళంలో రీమేక్ చేసిన హిట్ కొట్టారు. ఇప్పుడు వీరిద్దరూ గోపీచంద్ మలినేని సినిమాలో ఢీ కొట్టబోతున్నారని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి 'జై బాలయ్య' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. కొన్నిరోజుల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు.
Also Read:కోవిడ్ బారిన పడ్డ టాలీవుడ్ హీరో..
Also Read:'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్ పై రాజమౌళి క్లారిటీ..
Also Read:'ఆర్ఆర్ఆర్' నిర్మాత కష్టాలు.. బయ్యర్ల డిమాండ్స్ కి తలొంచుతారా..?
Also Read: 'ఇందువదన' ట్రైలర్.. ఇదొక హారర్ లవ్ స్టోరీ..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
సినిమా
క్రికెట్
బిజినెస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion