అన్వేషించండి
Nivetha Thomas: 'జై బాలయ్య' సాంగ్ కి నివేదా స్టెప్పులు.. ఎంత ఫన్నీగా ఉందో..
యంగ్ హీరోయిన్ నివేదా థామస్ 'జై బాలయ్య' సాంగ్ కి రీల్ చేసింది. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

'జై బాలయ్య' సాంగ్ కి నివేదా స్టెప్పులు..
నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ' ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రీసెంట్ గా ఈ సినిమా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ను జరుపుకుంది. బోయపాటి -బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బాలయ్య ఫ్యాన్స్ కి విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి. ఒక్క బాలయ్య ఫ్యాన్స్ మాత్రమే కాకుండా.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ సినిమాను ఆదరించారు.
ఓవర్సీస్ లో బాలయ్య సినిమాలకు పెద్దగా వసూళ్లు రావు కానీ ఈ సినిమా డాలర్ల వర్షం కురిపించింది. ఈ సినిమాలో చాలా పాటలకు రీల్స్ చేస్తున్నారు నెటిజన్లు. ముఖ్యంగా 'జై బాలయ్య' సాంగ్ చాలా ఫేమస్ అయింది. ఇందులో బాలయ్య వేసే స్టెప్స్ ఆకట్టుకుంటాయి. రీసెంట్ గా విడుదలైన 'అన్ స్టాపబుల్' ప్రోమోలో రవితేజ కూడా బాలయ్య స్టెప్స్ వేసి మెప్పించాడు.
తాజాగా యంగ్ హీరోయిన్ నివేదా థామస్ 'జై బాలయ్య' సాంగ్ కి రీల్ చేసింది. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. బాలయ్యను అనుకరిస్తూ ఆమె వేసిన డాన్స్ కాస్త ఫన్నీగా అనిపిస్తుంది. ఈ వీడియోపై సెలబ్రిటీలు సైతం స్పందిస్తున్నారు. ఈ ఏడాది 'వకీల్ సాబ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నివేదా 'మీట్ క్యూట్', 'శాకినీ డాకినీ' వంటి సినిమాల్లో నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
View this post on Instagram
Also Read:కోవిడ్ బారిన పడ్డ టాలీవుడ్ హీరో..
Also Read:'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్ పై రాజమౌళి క్లారిటీ..
Also Read:'ఆర్ఆర్ఆర్' నిర్మాత కష్టాలు.. బయ్యర్ల డిమాండ్స్ కి తలొంచుతారా..?
Also Read: 'ఇందువదన' ట్రైలర్.. ఇదొక హారర్ లవ్ స్టోరీ..
Also Read:2021 హయ్యెస్ట్ గ్రాసర్ 'పుష్ప'.. 'ఆర్ఆర్ఆర్' గనుక రాకపోతే.. నిర్మాత వ్యాఖ్యలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
Before You Go
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















