అన్వేషించండి
Advertisement
Oke Oka Jeevitham: టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో శర్వా.. టీజర్ కొత్తగా ఉందే..
శర్వానంద్ నటిస్తోన్న 'ఒకే ఒక జీవితం' సినిమా టీజర్ ను హీరో సూర్య విడుదల చేశారు.
యంగ్ హీరో శర్వానంద్ కెరీర్లో 30వ సినిమాగా రూపొందుతోన్న చిత్రం 'ఒకే ఒక జీవితం'. ఈ సినిమాతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాశారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను హీరో సూర్య విడుదల చేశారు.
టీజర్ ను బట్టి ఇదొక సైంటిఫిక్ డ్రామా అని తెలుస్తోంది. టైమ్ మెషీన్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించారు. 'ఇప్పుడు నేను చెప్పబోయే విషయానికి మీరు ఆశ్చర్యపోవచ్చు.. అసలు నమ్మకపోవచ్చు కూడా.. కానీ మీరు ఇది నమ్మే తీరాలి..' అంటూ నాజర్ చెప్పే డైలాగ్స్ తో టీజర్ మొదలైంది. ముగ్గురు స్నేహితులైన శర్వానంద్, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ ఫ్యూచర్ నుంచి ప్రెజంట్ లోకి రావడం కథపై ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. సినిమాలో తల్లీకొడుకుల సెంటిమెంట్ కూడా బాగానే ఉన్నట్లు ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ కి మరో హైలైట్.
జేక్స్ బిజోయ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. డియర్ కామ్రేడ్ సినిమాకు పని చేసిన సినిమాటోగ్రఫర్ అండ్ ఎడిటర్ సుజీత్ సారంగ్, శ్రీజిత్ సారంగ్‌లు ఈ సినిమాకి పని చేస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Here’re the Teasers of #OkeOkaJeevitham #Kanam
— Suriya Sivakumar (@Suriya_offl) December 29, 2021
OOJTeaser - https://t.co/VNHcX00iHz
KanamTeaser - https://t.co/aI4omOkIuZ @ImSharwanand @riturv @amalaakkineni1 @twittshrees @prabhu_sr @DreamWarriorpic #ఒకేఒకజీవితం #கணம்
Also Read:కోవిడ్ బారిన పడ్డ టాలీవుడ్ హీరో..
Also Read:'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్ పై రాజమౌళి క్లారిటీ..
Also Read:'ఆర్ఆర్ఆర్' నిర్మాత కష్టాలు.. బయ్యర్ల డిమాండ్స్ కి తలొంచుతారా..?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion