X

Biggboss5: కొనసాగుతున్న కెప్టెన్సీ టాస్క్ రచ్చ... వెనక్కి తగ్గిన జెస్సీ, ఎవరెవరు పోటీ పడతారో?

బిగ్ బాస్ బుధవారం ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమో విడుదలైంది. ప్రోమో సాదాసీదాగానే సాగింది.

FOLLOW US: 

ఎపిసోడ్ చూడటానికి ముందు కచ్చితంగా బిగ్ బాస్ ప్రియులు ప్రోమో చూసేందుకు చాలా ఇష్టపడతారు. ఆ రోజు ఎపిసోడ్ ఎలా ఉండబోతోందో ప్రోమో చెప్పేస్తుంది. బుధవారం ఎపిసోడ్ ప్రోమో ను విడుదల చేశారు. అందులో ఇంకా కెప్టెన్సీ టాస్క్ రచ్చ కొనసాగుతున్నట్టే కనిపిస్తోంది. ఎవరు పోటీ చేయాలనే అంశంపైనే చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా జెస్సీ కెప్టెన్సీ పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు అర్థమవుతోంది. ప్రోమోలో ఏముందంటే...

ప్రియాంక, యానీ మాస్టర్ మధ్య పోటీ సాగింది. ఇద్దరు రంగుల టాస్క్ ఆడారు. బోర్డుపై ఎవరి రంగు ఎక్కువగా కనిపిస్తే వారే కెప్టెన్సీ పోటీదారునిగా మారతారు. ఇందులో ప్రియాంక నీలం రంగు, యానీ మాస్టర్ ఎరుపు రంగు పులుముతూ కనిపించారు. ఆ రంగులో జారి పడ్డారు. వీరిద్దరిలో ఎవరు గెలిచారో ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. తరువాత హౌస్ మేట్స్ అంతా కలిసి కెప్టెన్సీ పోటీదారుల గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు. అందులో జెస్సీ ‘ఇంతకుముందు కెప్టెన్ గా చేసిన వారు ఆగండన్నారు, గతంలో కెప్టెన్ అయిన వాళ్లు కూడా వదిలేయాల్సిన అవసరం లేదు, నేనెప్పుడో మూడో వారం అయ్యా, నేనెందుకు వదిలేయాలి’ అని ప్రశ్నించాడు. ఈలోగా మానస్ ‘ఒక అబ్బాయి లేదా ఒక అమ్మాయి’ డ్రాప్ అవ్వాలి అన్నాడు. ఆ తరువాత జెస్సీ ‘నేను డ్రాప్ అవుతున్నా, నాకు వరస్ట్ ఇచ్చినా, ఏమిచ్చినా ఫరక్ పడదు’ అంటూ వెనక్కి తగ్గాడు. మధ్యలో సిరిపై షన్ను అరుస్తూ కనిపించాడు. మొత్తమ్మీద నేటి ఎపిసోడ్ లో కెప్టెన్సీ కంటెండెర్లు ఎవరన్న దానిపైనే సాగేట్టు కనిపిస్తోంది. నిన్నటి ఎపిసోడ్ లో టాస్క్ లు గెలిచి షణ్ముక్, సిరి, శ్రీరామ్... కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపికయ్యారు. వీరు కాకుండా ఇంకెవరు పోటీపడతారో బుధవారం ఎపిసోడ్ లో తెలుస్తుంది. Also read: మెగా సినిమా షూటింగ్ కు ముహూర్తం పెట్టేశారు

Also read: ఇన్‌స్టా, ఫేస్‌బుక్ ఖాతాలు తొలగించాక... ఏకంగా 31 కిలోలు తగ్గిందట ఈ అమ్మడు

Also read: ఒత్తయిన జుట్టు కావాలా... ఈ మూడూ తినండి చాలు

Also read: రోజూ తాగుతున్నారా? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ

Also read: కోవిడ్ తరువాత పెరుగుతున్న కోపం... ఇలా తగ్గించుకోండి

Also read:  డయాబెటిస్ రోగులు కూడా హ్యాపీగా తినొచ్చు... తింటే ఎన్ని లాభాలో

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: బిగ్ బాస్ 5 Biggboss 5 Promo Housemates Starmaa Biggboss

సంబంధిత కథనాలు

Bigg Boss 5 Telugu: టాప్ లో సన్నీ.. లాస్ట్ లో సిరి.. నామినేషన్ లో ఐదుగురు..

Bigg Boss 5 Telugu: టాప్ లో సన్నీ.. లాస్ట్ లో సిరి.. నామినేషన్ లో ఐదుగురు..

Pushpa Trailer: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు.. 

Pushpa Trailer: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు.. 

The wrong swipe: మొబైల్ ఫోన్‌తో వైద్యులు తీసిన సినిమా... ప్రశంసలు అందుకుంటోంది

The wrong swipe: మొబైల్ ఫోన్‌తో వైద్యులు తీసిన సినిమా... ప్రశంసలు అందుకుంటోంది

Prabhas: 'సలార్' సినిమా రీషూటింగ్.. ఇంటర్వెల్ ఎపిసోడ్ పై స్పెషల్ ఫోకస్.. 

Prabhas: 'సలార్' సినిమా రీషూటింగ్.. ఇంటర్వెల్ ఎపిసోడ్ పై స్పెషల్ ఫోకస్.. 

BiggBoss5: పింకీకి బిగ్‌షాక్... మానస్‌ను తన పిల్లాడిలా చూసుకునేదాన్నంటూ ఏడుపు

BiggBoss5: పింకీకి బిగ్‌షాక్... మానస్‌ను తన పిల్లాడిలా చూసుకునేదాన్నంటూ ఏడుపు
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Telangana Health Department: తెలంగాణలో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసులు లేవు

Telangana Health Department: తెలంగాణలో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసులు లేవు

December 6 Cricketers Birthday: ఈ ఒక్క రోజే టీమ్‌ఇండియాలో ఐదుగురు క్రికెటర్ల బర్త్‌డే.. ఎవరో తెలుసా?

December 6 Cricketers Birthday: ఈ ఒక్క రోజే టీమ్‌ఇండియాలో ఐదుగురు క్రికెటర్ల బర్త్‌డే.. ఎవరో తెలుసా?

Clearest Sun Photo: మండే అగ్ని గోళంలా కనిపిస్తాడు... సూర్యుడి అత్యంత స్పష్టమైన ఇమేజ్ తీసిన ఖగోళ ఫొటో గ్రాఫర్

Clearest Sun Photo: మండే అగ్ని గోళంలా కనిపిస్తాడు... సూర్యుడి అత్యంత స్పష్టమైన ఇమేజ్ తీసిన ఖగోళ ఫొటో గ్రాఫర్

Men's Health: ‘ఏక్ మినీ కథ’.. పాపం, ఎంతో ఖర్చుపెట్టి ‘అది’ పెంచుకున్నాడు, కానీ.. ఓ యువకుడి చేదు అనుభవం

Men's Health: ‘ఏక్ మినీ కథ’.. పాపం, ఎంతో ఖర్చుపెట్టి ‘అది’ పెంచుకున్నాడు, కానీ.. ఓ యువకుడి చేదు అనుభవం