అన్వేషించండి

Amardeep Prize Money: అయ్యో, అమర్ దీప్ - అందుకే ట్రోఫీ దూరమైందా? రన్నరప్‌కు వచ్చింది ఎంత?

Bigg Boss Telugu 7 Winner, Runnerup ‘బిగ్ బాస్’లో అమర్ దీప్ రన్నరప్ స్థానంతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. అయితే, కొద్దిపాటి తేడాతో టైటిల్ కోల్పోయినట్లు నాగార్జున వెల్లడించారు.

Bigg Boss 7 Telugu: ‘బిగ్ బాస్’ హిస్టరీలో SPY - SPA బ్యాచ్ ఎప్పటికీ నిలిచిపోతుంది. శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్ (SPY), శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్‌లు (SPA) గ్రూపులుగా విడిపోయి ఆటను రక్తికట్టించారు. అయితే, టాప్ 5 వరకు కేవలం SPY బ్యాచ్ మాత్రమే నిలిచింది. SPA బ్యాచ్ నుంచి టాప్‌ 5లో అమర్ దీప్, ప్రియాంకలు మాత్రమే నిలిచారు. ప్రియాంక, యావర్, శివాజీలు వెళ్లిపోవడంతో చివరిలో స్పా నుంచి అమర్ దీప్, స్పై నుంచి పల్లవి ప్రశాంత్ నిలిచారు. చివరికి పల్లవి ప్రశాంత్ విన్నర్‌గా నిలిచి ‘స్పై’ టీమ్‌ను గెలిపించాడు. అయితే, అమర్ దీప్ అంతవరకు వెళ్లాడంటే నిజంగానే గ్రేట్. ఎందుకంటే.. అమర్ దీప్‌కు మొదట్లో ఓట్లు చాలా తక్కువగా ఉండేవి. ఎప్పుడైతే అతడిలోని రియల్ మనిషికి బయటకు వచ్చాడో అప్పటి నుంచే ప్రజలకు నచ్చడం మొదలుపెట్టాడు. 

మొదట్లో అమర్ దీప్‌కు SPY బ్యాచ్‌తో అస్సలు పడేది కాదు. హౌస్‌లో అంతా తనకు ఫేవర్‌గా ఉండాలని, సహకరించాలని కోరుకొనేవాడు. ఆట చివరికి వచ్చేసరికి అది తీవ్రమైంది. ఒక్కోసారి ఉన్మాదిలా ఏడ్చేవాడు. కానీ, అతడిలో అమాయకత్వాన్ని అర్థం చేసుకున్న అభిమానులు ఓట్లేసి టాప్ 5 వరకు తీసుకొచ్చారు. మొత్తానికి అమర్ టాప్-2 వరకు చేరాడు. అయితే, టైటిల్ గెలుకోలేకపోవడం బ్యాడ్ లక్. అంతేకాదు.. రన్నరప్‌గా నిలిచినందుకు కూడా అమర్ దీప్‌కు ఏమీ లభించలేదు. ఒట్టి చేతులతోనే స్టేజ్ వీడాల్సి వచ్చింది. ఇందులో లాభపడింది. కేవలం యావర్ మాత్రమే. రూ.15 లక్షలతో దర్జాగా ఇంటికెళ్లాడు. ఏదైతేనే అమర్ దీప్.. ప్రైజ్ మనీ గెలవకపోయినా మనసులు గెలుచుకున్నాడు.

టాప్ 2 వరకు రావడానికి కలిసొచ్చిన విషయాలు ఇవే:

⦿ అమర్ ఆరవ వారం నుంచి తన ఆట ఏంటో చూపించడం మొదలుపెట్టాడు. టాస్కుల్లో ఎక్కువగా పాల్గొన్నాడు. 
⦿ ఎంటర్‌టైన్మెంట్, ఫన్ విషయంలో మిగతా కంటెస్టెంట్స్‌తో పోలిస్తే అమర్ కాస్త ఎక్కువగానే కష్టపడ్డాడు. ఆడియన్స్‌ను నవ్వించే ప్రయత్నం చేశాడు.
⦿ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే విషయంలో తనపై అందరూ జోకులు వేసినా.. పంచులు వేసినా.. పట్టించుకొనేవాడు కాదు.
⦿ సరదాగా కొట్టినా కూడా అమర్ పెద్దగా పట్టించుకోడు. అదే తనలో ఉన్న పెద్ద ప్లస్ అని ప్రేక్షకులు భావించారు. 
⦿ ఫౌల్ గేమ్స్ ఆడినా.. చీటింగ్ చేసినా.. అందులో ప్రేక్షకులకు ఎంటర్‌టైన్మెంట్ లభించింది. 
⦿ అది నెగిటివ్ కంటెంట్ అని శివాజీ భావించినా కూడా.. అదే చూసి ప్రేక్షకులు నవ్వుకున్న సందర్బాలు కూడా ఉన్నాయి. 
⦿ అలిగినా, గొడవపడినా.. ఫ్రెండ్స్‌ను మాత్రం ఎప్పుడూ విడిచిపెట్టలేదు అమర్. 
⦿ టాస్కులతో కెప్టెన్ అవ్వలేకపోయినా.. తన అమాయకత్వంతో కెప్టెన్సీని సంపాదించుకున్నాడు.

కలిసిరాని విషయాలు ఇవే:

⦿ బిగ్ బాస్‌లో హౌజ్‌మేట్స్ గురించి వారి వెనుక ఎక్కువగా మాట్లాడిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది అమర్‌దీపే. 
⦿ తన ఫ్రెండ్స్‌తో సహా దాదాపు అందరు కంటెస్టెంట్స్ గురించి అమర్ బ్యాక్‌బిచ్చింగ్ చేశాడు. 
⦿ మొదటి అయిదు వారాల వరకు ప్రేక్షకులకు ఎక్కువగా కనిపించకుండా అమర్ సేఫ్ గేమ్ ఆడాడని చాలామంది భావించారు. 
⦿ టాస్కులు ఆడడం మొదలుపెట్టిన తర్వాత తను చాలా స్వార్థపరుడు అయ్యాడని ప్రేక్షకులు మాత్రమే కాదు.. తోటి కంటెస్టెంట్స్ కూడా ఫీల్ అయ్యారు.
⦿ తను ఆడిన ప్రతీ టాస్కులో తానే గెలవాలి అనుకోవడం, ఫ్రెండ్స్ సపోర్ట్ చేయకపోతే వారిని మాటలతో మానసికంగా హింసించడం చేసేవాడు అమర్.
⦿ గెలవలేని పరిస్థితి ఉన్నప్పుడు ఏడ్చి సాధించుకోవడాన్ని స్ట్రాటజీగా ఉపయోగించాడు. సందర్భం ఉన్నా లేకపోయినా ఏడ్చి తన పాయింట్‌ను నిరూపించుకోవాలని ప్రయత్నించాడు. 
⦿ దీంతో తన అమాయకత్వం వల్ల ఫైనల్స్ వరకు వచ్చినా విన్నర్ కాలేకపోయాడు. సీరియల్ బ్యాచ్ అనే ముద్ర కూడా కొన్ని ఓట్లను దూరం చేసింది. 

Also Read: రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కథేంటి? బిగ్ బాస్ వరకు ఎలా వచ్చాడు?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Winter Driving Tips: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Winter Driving Tips: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
Radhika Sarathkumar: ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
Jio 5G Upgrade Voucher: సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
PM Modi US Tour: జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
Lagacharla Incident: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
Embed widget