అన్వేషించండి

Bigg Boss Telugu 8 Day 2 Promo 2: యష్మీ వర్సెస్ సోనియా... 'బిగ్ బాస్'లో రెండో రోజే హీరోయిన్స్ మధ్య గొడవ, ఎవ్వరూ తగ్గట్లేదుగా

Yashmi Gowda Vs Sonia Akula: 'బిగ్ బాస్ 8' మొదలై ఇంకా 48 గంటలు కూడా కాలేదు. కానీ, అప్పుడే కంటెస్టెంట్స్ మధ్య గొడవలు మొదలు అయ్యాయి. హీరోయిన్లు సోనియా ఆకుల, యష్మీ గౌడ మధ్య పెద్ద గొడవ జరిగినట్టు ఉంది.

బిగ్ బాస్ ఇంటిలో ఎవరెవరు ఒక్కటి అవుతారు? స్నేహితులుగా ఉంటారు? ఎవరెవరు గొడవలు పడతారు? అని చూసే ఆడియన్స్ ఎక్కువ. నిజం చెప్పాలంటే... ఆ గొడవలే ఈ షో చూసేలా చేస్తున్నారు. తెలుగులో 'బిగ్ బాస్' సీజన్ 8 మొదలై ఇంకా 48 గంటలు కూడా కాలేదు. కానీ, అప్పుడే గొడవలు మొదలు అయ్యాయి. హీరోయిన్లు యష్మీ గౌడ, సోనియా ఆకుల మధ్య మాటల యుద్ధం తీరస్థాయికి చేరుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... 

బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ బాషా, యష్మీ గౌడ, నబీల్ ఆఫ్రిది... ఈ నలుగురికి చీఫ్ స్థానాన్ని భర్తీ చేయాలనే కల ఉందని, ఆ నలుగురిలో ఒక్కరు మూడో చీఫ్ కింద ఎంపిక అవుతారని బిగ్ బాస్ స్పష్టం చేశాడు. ఆ చీఫ్ ఎంపిక కోసం జరిగిన చర్చలో యష్మీ గౌడ, సోనియా ఆకుల మధ్య డిస్కషన్ గొడవకు దారి తీసింది. 

నన్ను ఎందుకు లాగుతున్నావ్? - సోనియాకు యష్మీ ప్రశ్న
''ఈ రెండు రోజుల్లో బాధ్యతలు నువ్వు చూసుకున్నా... యష్మీ గౌడ కొన్ని చోట్ల తన వాయిస్ వినిపించింది'' అని నిఖిల్ మలియక్కల్‌తో సోనియా ఆకుల చెప్పింది. ఏ విషయం మీద ఆవిడ చెబుతుంది? ఏ విషయంలో యష్మీ తన వాయిస్ బలంగా వినిపించింది? అనేది పక్కన పెడితే... సోనియా తన పేరు చెప్పడం యష్మీ గౌడకు అసలు నచ్చలేదు. ''ప్రతిసారీ నన్ను ఎందుకు లాగుతున్నావ్? నా గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు?'' అని యష్మీ గౌడ గట్టిగా అడిగింది.

Also Readకృష్ణకు పోటీగా 'బిగ్ బాస్ 8'లోకి వచ్చిన ముకుంద... మిస్ మైసూర్ to షో... యష్మీ గౌడ లైఫ్‌లో ఎవ్వరికీ తెలియని విషయాలు

యష్మీ గౌడ బాధ్యతారాహిత్యంగా ఉంటుందని, అందుకే ఆవిడను రూల్డ్ అవుట్ చేస్తున్నాని సోనియా ఆకుల వివరించింది. బాధ్యతారాహిత్యం వంటి పెద్ద పదాలు వాడొద్దని యష్మీ గౌడ ఫైర్ అయ్యింది. ఈలోపు నిఖిల్ కలుగజేసుకున్నాడు. ''యష్మీ... లెట్ మీ టాక్, లెట్ మీ టాక్'' అంటూ కూల్ చేసే ప్రయత్నం చేసినా అతని వాయిస్ కూడా గట్టిగా వినిపించింది.


రెండు కొప్పుల మధ్య పడదు అంటే ఇదేనా?
ఓ చూరి కింద రెండు కత్తులు, ఓ గడపలో రెండు కొప్పులు ఉండవని సామెత. ఈ గొడవ చూస్తుంటే... ఆ విధంగా ఉంది. 'బిగ్ బాస్ 8'లో మేల్ కంటెస్టెంట్స్ మధ్య కూడా గొడవ ఉంది. మొదటి రోజు అనిల్ రావిపూడి ఇంటిలో అడుగు పెట్టిన తర్వాత ప్రాంక్ అయినా సరే తనను నామినేట్ చేయడం పట్ల నాగ మణికంఠ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే... అతడు కోప్పడాలని అనుకున్నా నిఖిల్ కాస్త కామ్ చేశాడు. మౌనంగా ఉన్నాడు. కానీ, అమ్మాయిల విషయం వచ్చేసరికి అటువంటి గొడవలు కాస్త గట్టిగా జరుగుతున్నాయి. లేటెస్ట్ ప్రోమోలో నిఖిల్, నబీల్ ఆఫ్రిది మధ్య గొడవ జరిగినా తారాస్థాయిలో మాటల యుద్ధం జరగలేదు.

Also Read'బిగ్ బాస్ 8'లోకి కృష్ణ ముకుంద మురారి హీరోయిన్ ప్రేరణ... హైదరాబాద్‌లో పెరిగిన తమిళమ్మాయ్ బ్యాగ్రౌండ్ ఇదే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget