అన్వేషించండి

Yashmi Gowda - Bigg Boss 8 Telugu: కృష్ణకు పోటీగా 'బిగ్ బాస్ 8'లోకి వచ్చిన ముకుంద... మిస్ మైసూర్ to షో... యష్మీ గౌడ లైఫ్‌లో ఎవ్వరికీ తెలియని విషయాలు

Yashmi Gowda Details: తెలుగు టీవీలో స్టార్‌గా ఎదిగిన కన్నడ భామ యష్మీ గౌడ. ఇప్పుడు ఈవిడ తెలుగు చక్కగా మాట్లాడుతుంది. ఇప్పుడు 'బిగ్ బాస్ 8'లోకి వెళ్లారు. తెలుగు సీరియల్స్‌కు ముందు ఆమె హిస్టరీ తెలుసా?

తెలుగు టీవీ తెలుగు టీవీ సీరియల్స్ చేస్తున్న హీరోయిన్లలో ఎక్కువ మంది కన్నడ అమ్మాయిలే. యష్మీ గౌడ కూడా ఆ జాబితాలో అమ్మాయే. అవును... సూపర్ హిట్ తెలుగు సీరియళ్లలో నటించిన ఈ అమ్మాయిది బెంగళూరు. ఇప్పుడు 'బిగ్ బాస్' ఎనిమిదో సీజన్‌లో అడుగు పెట్టింది. ఈ అమ్మాయి హిస్టరీ ఏమిటి? ఆమె ఏం చేసిందనేది తెలుసా?

తండ్రికి సొంత ఫ్యాక్టరీ ఉంది! మంచిగా చదువుకుంది! కానీ...
Yashmi Gowda Biography: సీరియల్స్ ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయమైన యష్మీ గౌడ జన్మించినది కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో! ఆమె తండ్రి పేరు రమేశ్‌. ఆయనకు సొంత ఫ్యాక్టరీ ఉంది. యష్మీ తల్లి పేరు విజయలక్ష్మి గృహిణి. ఆవిడ హోమ్ మేకర్. ఇంట్లో ఎవరికీ టీవీ లేదా సినిమా నేపథ్యం లేవు. మరి, యష్మీ టీవీ ఇండస్ట్రీలోకి ఎలా అడుగు వచ్చారు? అంటే... 

యష్మీ గౌడ... మిస్‌ ఫొటోజెనిక్‌ & మిస్‌ మైసూర్‌!
యష్మీ గౌడకు చిన్నతనం నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఇష్టం. స్కూల్ డేస్ నుంచి ఆవిడకు స్కిట్స్, డ్యాన్స్ వంటివి చేయడం ఆమెకు అలవాటు. అంతే కాదు... నటి కావాలని బాల్యం నుంచి బలంగా కోరుకున్నారు. బెంగళూరులోని 'దయానంద్‌ సాగర్‌ ఇనిస్టిట్యూట్‌'లో సివిల్‌ ఇంజనీరింగ్‌ చదివినప్పటికీ... కాలేజీ రోజుల నుంచి మోడలింగ్ స్టార్ట్ చేశారు. ఒక మోడలింగ్‌ షో కోసం ఆమె కాలేజీలో ఆడిషన్స్‌ నిర్వహించినప్పుడు యష్మీ గౌడ ఎంపికైంది. 

అంతే కాదు... అందాల పోటీల్లో 'మిస్‌ ఫొటోజెనిక్‌', అలాగే 'మిస్‌ మైసూర్‌' టైటిల్స్ నెగ్గారు. స్నేహితుల సలహాలో కన్నడ సీరియల్ ఆడియన్స్ జరుగుతున్నాయని వెళ్లి పాల్గొన్నారు. నటనలో ఎటువంటి శిక్షణ లేకుండా ఎంపిక అయ్యారు. తొలి ప్రయత్నంలో సీరియల్ అవకాశం రావడంతో నటనకు గుడ్ బై చెప్పేశారు.

'స్వాతి చినుకులు'లో వెనిలాగా తెలుగు టీవీకి
కన్నడ సీరియల్ చేస్తున్న సమయంలో తెలుగు నుంచి యష్మీ గౌడకు పిలుపు వెళ్లింది. 'స్వాతి చినుకులు' సీరియల్‌ చేసే అవకాశం ఆమె తలుపు తట్టింది. అందులో ఆమెది వెనిలా పాత్రలో నటించారు. అలాగే, జీ తెలుగు' సీరియల్ 'నాగ భైరవి'లో భైరవిగా... 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్‌లో ముకుందగా యష్మీ గౌడ నటించారు.

Also Read: 'బిగ్ బాస్ 8'లో హైదరాబాద్‌లో పెరిగిన తమిళమ్మాయ్... కృష్ణ ముకుంద మురారి భామ ప్రేరణ బ్యాగ్రౌండ్ ఇదే


ఒకప్పుడు తెలుగు ఒక్క ముక్క మాట్లాడలేదు! కానీ...
టీవీ షోలు లేదంటే ఇంటర్వ్యూలలో యష్మీ గౌడను చూశారా? తెలుగు గలగలా మాట్లాడుతున్నారు. కానీ, ఒకప్పుడు ఆమెకు ఒక్క ముక్క తెలుగు రాదు. ఇక్కడ టీవీ సీరియల్ చేసే అవకాశం వచ్చిన తర్వాత ఆమె తెలుగు నేర్చుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్ తన సొంత ఊరు అయ్యిందని చెప్పారు. సొంతూరు బెంగళూరు కంటే ఎక్కువ భాగ్య నగరంలో ఉంటున్నానని తెలిపారు. ఛార్మినార్ ఏరియాలో షాపింగ్‌ చేయడం, హైదరాబాద్‌ బిర్యానీ అంటే తనకు చాలా ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో ఆవిడ చెప్పుకొచ్చారు.

Also Readఆర్జీవీ 'దిశా ఎన్కౌంటర్' హీరోయిన్, కరీంనగర్ రైతు బిడ్డ... 'బిగ్ బాస్ 8' కంటెస్టెంట్ సోనియా ఆకుల బ్యాగ్రౌండ్ తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Embed widget