అన్వేషించండి

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ఎలిమినేషన్ - డేంజర్ జోన్‌లో ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, శివాజీ ఎఫెక్ట్ గట్టిగా పడిందా?

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో ఇప్పటినుండి జరిగే ఎలిమినేషన్స్ కీలకంగా మారనున్నాయి. ఇక ఈవారం డేంజర్ జోన్‌లో ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నట్టు సమాచారం.

Bigg Boss 7 Telugu Voting Result : ఫైనల్స్ దగ్గర పడుతున్నకొద్దీ బిగ్ బాస్ సీజన్ 7 ఓటింగ్స్ విషయంలో ఊహించని మార్పులు జరుగుతున్నాయి. ఇంకా బిగ్ బాస్ 7 నుంచి కేవలం రెండు ఎలిమినేషన్స్ మాత్రమే జరుగుతాయి. ఆ తర్వాత మిగిలిన కంటెస్టెంట్స్ అంతా ట్రాఫీ కోసం రేసులో నిలబడతారు. అందుకే ఇప్పటినుంచి జరిగే ఎలిమినేషన్స్ కీలకంగా మారనున్నాయి. ఇక ఈవారం నామినేషన్స్‌లో గౌతమ్, శివాజీ, అర్జున్, పల్లవి ప్రశాంత్, యావర్, ప్రియాంక, శోభా.. ఇలా దాదాపు అందరు కంటెస్టెంట్స్ ఉన్నారు. దీంతో ఇందులో నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ప్రేక్షకుల్లో ఆసక్తి ఎక్కువయ్యింది.

లాస్ట్‌లో ఆ ఇద్దరూ..
గతవారం డబుల్ ఎలిమినేషన్ అనే పేరుతో రతిక, అశ్విని.. ఇలా ఇద్దరు లేడీ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటికి వెళ్లిపోయారు. కానీ ఈవారం మాత్రం కచ్చితంగా ఒక మేల్ కంటెస్టెంట్ వెళ్లిపోతాడని చాలామంది ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. అయితే ఓటింగ్ అంచనాల ప్రకారం.. శివాజీ మళ్లీ టాప్‌లో ఉన్నాడని సమాచారం. ఇక ఆటపరంగా చూస్తే పల్లవి ప్రశాంత్, యావర్ కూడా ఇప్పట్లో ఎలిమినేట్ అయ్యే అవకాశాలు లేవు. వీరు కాకుండా నామినేషన్స్‌లో ప్రియాంక, శోభా, అర్జున్, గౌతమ్ మిగిలారు. ఈ నలుగురిలో అర్జున్, గౌతమే ఓటింగ్ లిస్ట్‌లో లాస్ట్‌లో ఉన్నారని సమాచారం. 

డేంజర్ జోన్‌లో గౌతమ్..
గౌతమ్.. బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం నుంచి ఉన్నా.. అర్జున్ మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మధ్యలో వచ్చాడు. అయినా కూడా ప్రేక్షకుల్లో ఇద్దరి పట్ల సమానంగా అభిప్రాయాలు ఉన్నాయి. ముందు నుంచి గౌతమ్ ఆట అంతంత మాత్రంగానే ఉన్నా.. సీక్రెట్ రూమ్‌కు వెళ్లొచ్చినప్పటి నుంచి తన స్ట్రాటజీలే మారిపోయాయి. టాస్కుల విషయంలో కూడా చాలా పట్టుదలతో ఆడడం మొదలుపెట్టాడు. ఎక్కువశాతం ఏ గ్రూప్స్ జోలికి వెళ్లకుండా ఒంటరిగా ఆడే ప్రయత్నం చేస్తుంటాడు గౌతమ్. కానీ రెండు వారాల క్రితం జరిగిన కెప్టెన్సీ టాస్కులో ప్రియాంకను కెప్టెన్ చేయడం కోసం గౌతమ్ ఆడిన ఆట చాలామందికి నచ్చలేదు. దీంతో తనపై ప్రేక్షకుల్లో నెగిటివిటీ ఏర్పడింది. అంతే కాకుండా ఓటింగ్ లిస్ట్‌లో టాప్‌లో ఉన్న శివాజీతో గౌతమ్ ఎప్పుడూ గొడవలు పడుతూనే ఉంటాడు. దీంతో శివాజీ ఫ్యాన్స్ అంతా కలిసి ఓటింగ్ లెక్కలు మార్చి గౌతమ్‌ను ఎలిమినేట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.

అదే అర్జున్‌కు మైనస్..
అర్జున్ ఆట బాగుంటుంది అని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నా.. ఎందుకో ఓటింగ్ విషయంలో మాత్రం ఈ కంటెస్టెంట్ ఎప్పుడూ చివర్లోనే ఉంటాడు. గతవారం కూడా ఓటింగ్ పరంగా అర్జున్ డేంజర్ జోన్‌లోనే ఉన్నాడు. ఇక గతవారం కెప్టెన్సీ సమయంలో కూడా అమర్‌దీప్ పట్ల అర్జున్ ప్రవర్తన సరిగా లేదని చాలామంది ప్రేక్షకులు ఫీల్ అయ్యారు. దీంతో అర్జున్ హౌజ్‌లో ఉండడం కరెక్ట్ కాదు అనుకునేవారు కూడా ఉన్నారు. అలాగే కెప్టెన్సీ టాస్క్ సమయంలో శివాజీ తనకు సపోర్ట్ చేసినా కూడా అర్జున్ వెళ్లి తననే నామినేట్ చేయడం అర్జున్‌కే మైనస్‌గా మారింది. ఇక ఈవారం గౌతమ్, అర్జున్‌లలో ఎవరో ఒకరు బిగ్ బాస్ సీజన్ 7ను వదిలి వెళ్లిపోవడం పక్కా అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read: అమరావతి రైతుల కోసం పోరాడిన శివాజీ? ‘బిగ్ బాస్’ ఓట్ల కోసం కొత్త ప్రచారం - ఈ మెసేజ్ మీకు వచ్చిందా?

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Embed widget