అన్వేషించండి

Bigg Boss Season 7: కెప్టెన్సీ రేసులో మిగిలిన ఆ ఇద్దరూ, అతడిది సేఫ్ గేమ్ అంటూ కన్నీళ్లు పెట్టుకున్న శోభా శెట్టి

Bigg Boss Season 7: బిగ్ బాస్ సీజన్ 7లో రెండో కెప్టెన్ ఎవరో తెలుసుకోవడానికి పోటీ మొదలయ్యింది. కెప్టెన్సీ కంటెండర్లుగా ఎనిమిది మంది ఎంపికయ్యారు. చివరిగా ఆ ఇద్దరు మిగిలారు

బిగ్ బాస్ సీజన్ 7లో ముందుగా కంటెస్టెంట్స్ అంతా పవర్ అస్త్రాలను సాధించుకోవడం కోసం పోటీపడ్డారు. అలా నలుగురు పవర్ అస్త్రాలను సాధించిన తర్వాత దానికి సంబంధించిన టాస్కులకు ఎండ్ కార్డ్ పడింది. అది అయిపోగానే వెంటనే కెప్టెన్సీ టాస్కులు మొదలయ్యాయి. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 7లో మొదటి కెప్టెన్‌గా పల్లవి ప్రశాంత్ గెలిచాడు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్‌కు రెండో కెప్టెన్ ఎవరో తెలుసుకునే టైమ్ వచ్చేసింది. రెండో కెప్టెన్ ఎవరు అనే విషయాన్ని కంటెస్టెంట్సే తేల్చుకోవాలి అని బిగ్ బాస్ ఆదేశించారు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.

ఎనిమిది మంది కెప్టెన్సీ కంటెండర్లు..
ఈసారి కెప్టెన్సీ టాస్క్ కోసం బిగ్ బాస్ హౌజ్‌లోకి కొత్తగా ఎంటర్ అయిన అయిదుగురు కంటెస్టెంట్స్ కూడా పోటీపడ్డారు. పాత కంటెస్టెంట్స్ అంతా ఒక టీమ్, కొత్త కంటెస్టెంట్స్ అంతా ఒక టీమ్‌గా విడిపోయి మరీ కెప్టెన్సీ కోసం టాస్కుల్లో పోటాపోటీగా ఆడారు. అయితే ఈ రెండు టీమ్స్ మధ్య ఏడు టాస్కులు జరగగా.. అందులో ఎక్కువ టాస్కులు ఆటగాళ్లే గెలిచారు. దీంతో ఆటగాళ్లు టీమ్‌లో అమర్‌దీప్, శోభా శెట్టి, తేజ, ప్రియాంక, పల్లవి ప్రశాంత్, సందీప్, ప్రిన్స్ యావర్, శివాజీ.. కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. ఆ తర్వాత వీరిలో కెప్టెన్ ఎవరు అవ్వాలి అనే నిర్ణయాన్ని వారికే వదిలేశారు.

అవకాశం కోల్పోయిన ప్రియాంక..
కెప్టెన్సీ కంటెండర్లు అయిన ఎనిమిది మంది బెలూన్లు కట్టుకొని నిలబడాలి. తాము ఎవరైతే కెప్టెన్ అవ్వకూడదని అనుకుంటున్నారో వారి బెలూన్‌ను పగలగొట్టాలి. ఈ టాస్క్‌లో కెప్టెన్ ఎవరు అవ్వాలని అనుకుంటున్నారో నిర్ణయించుకునే అవకాశం పోటుగాళ్లకు కూడా లభిస్తున్నట్టు ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ఈ ప్రోమోలో ముందుగా సందీప్.. శివాజీ బెలూన్‌ను పగలగొట్టాడు. ఆట తక్కువ అనిపించింది అని చెప్తూ ప్రియాంకను కెప్టెన్సీ రేసు నుండి తప్పించాడు పల్లవి ప్రశాంత్. ఆట అంటే గేమ్స్ ఆడడం మాత్రమే కాదు అని ప్రియాంక వాదించినా లాభం లేకుండా పోయింది. ఆ తర్వాత మళ్లీ సందీప్‌కే కెప్టెన్సీ రేసు నుండి ఒక కంటెస్టెంట్‌ను తప్పించే అవకాశం వచ్చింది.

6 వారాలుగా ఇమ్యూనిటీ..
రెండోసారి అవకాశం వచ్చినప్పుడు సందీప్.. పల్లవి ప్రశాంత్ బెలూన్‌ను పగలగొట్టాడు. దానికి తన కారణాన్ని చెప్పడానికి ట్రై చేశాడు కానీ ప్రశాంత్ మాత్రం వినిపించుకోకుండా తన బెలూన్‌ను పక్కన పడేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత శోభా శెట్టి వచ్చి సందీప్ బెలూన్‌ను పగలగొట్టింది. ‘‘6 వారాల నుండి మీకు ఇమ్యూనిటీ అనేది బాగానే కలిసొస్తుంది. ఇది మాత్రమే నా కారణం. అంతకు మించి ఏమీ లేదు’’ అని కారణం చెప్పింది శోభా. శోభా తర్వాత వచ్చిన ప్రిన్స్ యావర్.. శోభా బెలూన్‌నే పగలగొట్టాడు. తను వీక్ అంటూ యావర్ చెప్పిన కారణానికి శోభా.. వ్యంగ్యంగా చప్పట్లు కొట్టుకుంటూ వెళ్లి పక్కన కూర్చుంది.

అది నీ సేఫ్ గేమ్..
అలా ఆటగాళ్లు టీమ్ నుండి ఒక్కొక్కరుగా బయటికి వెళ్లిపోయిన తర్వాత కెప్టెన్సీ పోటీదారులుగా టేస్టీ తేజ, ప్రిన్స్ యావర్, అమర్‌దీప్ మిగిలారు. ఆ తర్వాత బెలూన్ పగలగొట్టే అవకాశాన్ని తేజకు ఇచ్చాడు అర్జున్ అంబటి. ‘‘ఇప్పటివరకు జరిగినవన్నీ దృష్టిలో పెట్టుకొని, నువ్వు కెప్టెన్సీ కంటెండర్ అవ్వడానికి దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటావో లేక జనాల దృష్టిలో హీరో అవ్వడానికి నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం’’ అని పిన్‌ను తేజకు అందించాడు అర్జున్. తేజ ఆ పిన్‌ను తీసుకొని అమర్‌దీప్ బెలూన్ పగలగొట్టి తనను కెప్టెన్సీ రేసు నుండి బయటికి పంపించేశాడు. తేజ తీసుకున్న నిర్ణయానికి ‘‘అది నీ సేఫ్ గేమ్’’ అంటూ అరిచింది శోభా. ఆపై కన్నీళ్లు పెట్టుకుంది. ఫైనల్‌గా తేజ, యావర్ కెప్టెన్సీ రేసులో చివరి వరకు మిగిలారు. ఇందులో యావర్ కెప్టెన్ అయినట్టు సమాచారం ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Also Read: నేను నమ్మిందే తీస్తా, దానికి ఎవరి పర్మిషన్ అవరసం లేదు - ‘ప్యాకేజి’ డైరెక్టర్ బిరుదుపై వర్మ రియాక్షన్!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ranganath meets Pawan Kalyan: ఏపీలోనూ హైడ్రా తరహా కార్యాచరణ - పవన్‌తో రంగనాథ్ భేటీ - రెండు గంటల పాటు చర్చ!
ఏపీలోనూ హైడ్రా తరహా కార్యాచరణ - పవన్‌తో రంగనాథ్ భేటీ - రెండు గంటల పాటు చర్చ !
58 candidates in Jubilee Hills: జూబ్లిహిల్స్ బరిలో 58 మంది అభ్యర్థులు -  నాలుగు లక్షల మంది ఓటర్లు - ఇక ప్రచార భేరీ !
జూబ్లిహిల్స్ బరిలో 58 మంది అభ్యర్థులు - నాలుగు లక్షల మంది ఓటర్లు - ఇక ప్రచార భేరీ !
Satara Doctor Crime News: ఆ SI నాపై అత్యాచారం చేశాడు.. చేతిపై సూసైడ్ నోట్ రాసుకుని చనిపోయిన డాక్టర్
ఆ SI నాపై అత్యాచారం చేశాడు.. చేతిపై సూసైడ్ నోట్ రాసుకుని చనిపోయిన డాక్టర్
Bihar Elections: బీహార్‌లో ఎన్డీఏ గెలిస్తే మళ్లీ నితీషే సీఎం -  ఎన్నికల ప్రచారంలో మోదీ హింటిచ్చేశారా?
బీహార్‌లో ఎన్డీఏ గెలిస్తే మళ్లీ నితీషే సీఎం - ఎన్నికల ప్రచారంలో మోదీ హింటిచ్చేశారా?
Advertisement

వీడియోలు

Erragadda Public Talk Jubilee hills By poll : నవీన్ యాదవ్ vs మాగంటి సునీత జూబ్లీహిల్స్ ఎవరివైపు |ABP
Bison Movie review Telugu | మారిసెల్వరాజ్ - ధృవ్ విక్రమ్ బైసన్ తో అదరగొట్టారా.? | ABP Desam
Vizag Google Data Centre Controversy | వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ పై ప్రశ్నలకు సమాధానాలేవి..? | ABP
Aus vs Ind 2nd ODI Highlights | రెండు వికెట్ల తేడాతో భారత్ పై రెండో వన్డేలోనూ నెగ్గిన ఆసీస్ | ABP Desam
Netaji Subhash Chandra Bose | నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ చరిత్ర | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ranganath meets Pawan Kalyan: ఏపీలోనూ హైడ్రా తరహా కార్యాచరణ - పవన్‌తో రంగనాథ్ భేటీ - రెండు గంటల పాటు చర్చ!
ఏపీలోనూ హైడ్రా తరహా కార్యాచరణ - పవన్‌తో రంగనాథ్ భేటీ - రెండు గంటల పాటు చర్చ !
58 candidates in Jubilee Hills: జూబ్లిహిల్స్ బరిలో 58 మంది అభ్యర్థులు -  నాలుగు లక్షల మంది ఓటర్లు - ఇక ప్రచార భేరీ !
జూబ్లిహిల్స్ బరిలో 58 మంది అభ్యర్థులు - నాలుగు లక్షల మంది ఓటర్లు - ఇక ప్రచార భేరీ !
Satara Doctor Crime News: ఆ SI నాపై అత్యాచారం చేశాడు.. చేతిపై సూసైడ్ నోట్ రాసుకుని చనిపోయిన డాక్టర్
ఆ SI నాపై అత్యాచారం చేశాడు.. చేతిపై సూసైడ్ నోట్ రాసుకుని చనిపోయిన డాక్టర్
Bihar Elections: బీహార్‌లో ఎన్డీఏ గెలిస్తే మళ్లీ నితీషే సీఎం -  ఎన్నికల ప్రచారంలో మోదీ హింటిచ్చేశారా?
బీహార్‌లో ఎన్డీఏ గెలిస్తే మళ్లీ నితీషే సీఎం - ఎన్నికల ప్రచారంలో మోదీ హింటిచ్చేశారా?
Bihar Sigma Gang: పాతికేళ్లు కూడా నిండని కుర్రాళ్ల మాఫియా గ్యాంగ్ సిగ్మా - బీహార్‌ను వణికించింది..కానీ ఎన్‌కౌంటర్‌తో ముగిసింది !
పాతికేళ్లు కూడా నిండని కుర్రాళ్ల మాఫియా గ్యాంగ్ సిగ్మా - బీహార్‌ను వణికించింది..కానీ ఎన్‌కౌంటర్‌తో ముగిసింది !
Akhanda 2 Teaser: ఊహకు అందదు... బాలయ్య డైలాగుకు రీ సౌండ్ గ్యారెంటీ - 'అఖండ 2' లేటెస్ట్ టీజర్ చూశారా?
ఊహకు అందదు... బాలయ్య డైలాగుకు రీ సౌండ్ గ్యారెంటీ - 'అఖండ 2' లేటెస్ట్ టీజర్ చూశారా?
Bharat taxi: ఓలా, ఉబెర్ తరహాలో ప్రభుత్వ భారత్ టాక్సి యాప్ - డైవర్లకే 100శాతం ఆదాయం - ఇవిగో పూర్తి డీటైల్స్
ఓలా, ఉబెర్ తరహాలో ప్రభుత్వ భారత్ టాక్సి యాప్ - డైవర్లకే 100శాతం ఆదాయం - ఇవిగో పూర్తి డీటైల్స్
New Bank Rule:బ్యాంకు అకౌంట్‌కు నలుగురు నామినీలని ఎలా సెట్ చేయాలి? సులభమైన స్టెప్స్‌లో ప్రక్రియ పూర్తి చేయండి!
బ్యాంకు అకౌంట్‌కు నలుగురు నామినీలని ఎలా సెట్ చేయాలి? సులభమైన స్టెప్స్‌లో ప్రక్రియ పూర్తి చేయండి!
Embed widget