Bigg Boss 7 Telugu: అందరినీ మోసం చేసే గుణం నీది, ఇదే నీ నిజస్వరూపం - అమర్‌పై ప్రశాంత్ ఫైర్
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో చాలావరకు జరిగిన నామినేషన్స్‌లో పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్‌ల మధ్య జరిగిన గొడవలే హైలెట్‌గా నిలిచాయి. ఇక చివరి నామినేషన్స్‌లో కూడా అదే రిపీట్ అయ్యింది.
Telugu Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7లో ఆఖరి నామినేషన్స్ చాలా వాడివేడిగా జరిగాయని ప్రోమోలు చూస్తేనే అర్థమవుతోంది. నామినేట్ చేయాలనుకునేవారికి, నామినేట్ అయినవారికి మధ్య తీవ్రమైన గొడవలే జరిగినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా పాత విషయాలను గుర్తుచేసుకొని మరీ గొడవను మొదలుపెట్టారు కొందరు హౌజ్‌మేట్స్. అమర్, ప్రశాంత్‌ల మధ్య మళ్లీ రెగ్యులర్ నామినేషన్ ఫైట్ జరిగింది. కానీ ఈసారి యావర్, అర్జున్‌లకు కూడా ఫినాలే అస్త్రా టాస్క్‌కు సంబంధించిన విషయంలో వాగ్వాదం జరిగినట్టు ప్రోమో చూస్తే తెలుస్తోంది.
అమర్, ప్రశాంత్ ఫైట్..
ముందుగా ఈ ప్రోమోలో అమర్‌దీప్.. ప్రశాంత్‌ను ‘రా’ అన్నాడు. అక్కడ గొడవ మొదలయ్యింది. ‘‘రా అనొద్దు’’ అని సీరియస్‌గా చెప్పాడు ప్రశాంత్. అయినా వినకుండా అలాగే అంటూ ఉన్నాడు అమర్. ‘‘నా తమ్ముడిని రా అనే అంటాను’’ అని అమర్.. మాట వినలేదు. వద్దు అని ప్రశాంత్ కూడా సీరియస్ అయ్యాడు. ‘‘నీ ఇష్టం పలికితే పలుకు లేకపోతే లేదు. పో’’ అని గట్టిగా అరిచాడు అమర్. ఇక నామినేషన్స్ విషయంలో ‘‘పల్లవి ప్రశాంత్.. అమర్ కోసం మాటిచ్చాడు’’ అని అమర్ కారణం చెప్తుండగానే.. పల్లవి ప్రశాంత్ మధ్యలో జోక్యం చేసుకున్నాడు. దీంతో మాట్లాడనివ్వు అని సీరియస్ అయ్యాడు అమర్. ‘‘నా మీద ముందు నుండి నెగిటివే పెట్టుకున్నావు’’ అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు ప్రశాంత్. ‘‘ఇది నీ నిజస్వరూపం. అందరినీ మోసం చేసే గుణం నీది’’ అని ఆరోపించాడు. ‘‘టాపిక్ డైవర్ట్ చేసి అనవసరంగా తవ్వద్దు’’ అన్నాడు అమర్. తాను అలాగే చేస్తానని రివర్స్ అయ్యాడు ప్రశాంత్. అన్నీ అబద్ధాలే అంటూ ప్రశాంత్‌పై ఆరోపణలు మొదలుపెట్టాడు అమర్. అబద్ధాలు నీవే అంటూ కౌంటర్ ఇచ్చాడు ప్రశాంత్. ‘‘నచ్చినవాళ్లని మోసం చేసేది నీ గుణం. మోసపోయింది నువ్వు కాదు.. నేను’’ అని అరిచాడు. దానికి అమర్‌కు కోపం వచ్చి ‘‘నన్ను బయటికి పంపించేయండి. వాడికి కప్ ఇచ్చేయండి. మీరందరూ హ్యాపీగా ఉండండి. వాడు హ్యాపీగా ఉంటాడు’’ అని అన్నాడు.
యావర్‌పై అర్జున్ సీరియస్..
ఆ తర్వాత వచ్చిన అర్జున్.. అమర్‌దీప్‌ను, యావర్‌ను నామినేట్ చేశాడు. ముందుగా అమర్ విషయంలో.. ‘‘నీకు వచ్చిన దగ్గర నుండి చెప్పి చెప్పి అలిసిపోయాం’’ అని తన ఫౌల్ గేమ్స్ గురించి గుర్తుచేశాడు అర్జున్. ఆ తర్వాత ‘‘నీ వరకు నువ్వు గేమ్ కరెక్ట్‌గానే ఆడుకున్నావు. కానీ నీ వల్ల ఆరోజు నష్టపోయింది నేను’’ అని ఖైదీలు టాస్కులో యావర్ చేసిన తప్పును చెప్తూ.. తనను నామినేట్ చేశాడు. అర్జున్ చెప్పిన ఈ కారణాన్ని తప్పుగా అర్థం చేసుకున్న యావర్.. ‘‘కావాలని చేశానా?’’ అంటూ రివర్స్ అయ్యాడు. ‘‘అంటే నువ్వు ఆడే గేమ్స్‌లో పక్కవాడు ఎలా పోయినా పర్వాలేదు నువ్వు ఆడాలి అదే నువ్వు చేసేది. నువ్వు చేసినప్పుడు మాకు బాధ ఉండదా’’ అని అర్జున్ సీరియస్ అయ్యాడు.
శోభా, ప్రియాంకలకు కూడా నామినేషన్స్..
వీరితో పాటు శివాజీ.. ప్రియాంకను, ప్రశాంత్.. శోభాను నామినేట్ చేసినట్టుగా కూడా ఈ ప్రోమోలో చూపించారు. ముందుగా శివాజీ.. ‘‘కృతజ్ఞత పేరుతో గౌతమ్‌కు పాయింట్లు ఇచ్చావు. ఫ్రెండ్‌షిప్ దగ్గరకు వచ్చినప్పుడు త్యాగం చేసే దమ్ము కావాలి’’ అంటూ ఫినాలే అస్త్రా టాస్కు సమయంలో జరిగిన విషయాన్ని చెప్పుకొచ్చాడు శివాజీ. ప్రియాంక కూడా తన పాయింట్లు వినిపిస్తుండగా.. శివాజీ మధ్యలోని జోక్యం చేసుకొని ‘‘నువ్వు ఓవర్ స్మార్ట్‌గా ఎక్కడైనా చేయ్. నా దగ్గర చేయలేవు’’ అని అన్నాడు. దీంతో వారిద్దరి మధ్య కూడా వాగ్వాదం జరిగింది. ఇక శోభాను ప్రశాంత్ నామినేట్ చేసినందుకు తనను మరోసారి సేఫ్ ప్లేయర్ అంటూ ఆరోపించింది.
Also Read: SPY vs SPA - నువ్వేమైనా ఒలింపిక్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చావా? శోభా నామినేషన్‌కు శివాజీ కౌంటర్