Bigg Boss 6 Telugu Episode 41: ఇంటి కెప్టెన్ అయిన సూర్య, అతడిని బావ అని పిలిచిన ఇనయా
Bigg Boss 6 Telugu: కెప్టెన్సీ టాస్కులో చివరికి ఇంటి కెప్టెన్ అయ్యాడు.
Bigg Boss 6 Telugu: నిన్నటి ఎపిసోడ్లో కెప్టెన్సీ కంటెండర్ల టాస్కు ఇచ్చారు. అందులో ఎనిమిది బంతులు పెట్టారు. ఎవరి దక్కించుకుని వారి పేరున్న బాస్కెట్లో వేసుకుంటారో వారే కెప్టెన్సీ కంటెండర్ అవుతారు అని పెట్టారు. అలా శ్రీసత్య, రేవంత్, వాసంతి, ఆదిరెడ్డి, రాజ్, అర్జున్, రోహిత్, సూర్య కెప్టెన్సీ కంటెండర్లుగా మారారు. అయితే చివరి బంతి కోసం చాలా మంది కొట్టుకున్నారు. రోహిత్ ఆ బంతిని సుదీపకు అందించడంతో రోహిత్ బాస్కెట్లో వేసింది. దీనిపై నేటి ఎపిసోడ్లో ఫైమా హర్ట్ అయినట్టు కనిపించింది. ఇది ఫెయిర్ గేమ్ అవ్వదు అని వాదించింది.
ఈరోజు కెప్టెన్ టాస్క్ ఇచ్చారు. ఇందులో ఫైమా సంచాలక్ ఇచ్చారు. ఇందులో ఎనిమిది పూలకుండీలు పెట్టారు. ఎనిమిది కెప్టెన్సీ కంటెండర్లు ఆ పూలకుండీలను తీసుకుని లాన్‌లో పెట్టిన ప్రదేశంలోకి పరిగెట్టాలి. అయితే తమ పేరున్న కుండీలను మాత్రం తీయకూడదు. ఎవరైతే చివరగా లాన్లోకి ప్రదేశంలోకి వెళతారో... వారు, ఆ కుండీపై పేరున్న వారి మధ్య ఒకరిని ఇంటి సభ్యులు సేవ్ చేస్తారు. అలా మొదటి రౌండ్లో తన పేరున్న కుండీని తానే తెచ్చుకుని రాజ్ డిస్‌క్వాలిఫై అయ్యాడు. తరువాత వాసంతి, ఆదిరెడ్డి కుండీని పట్టుకుంది. కానీ అందరికన్నా చివరిగా లాన్లోని ప్రదేశంలోకి వెళ్లింది. దీంతో వాసంతి, ఆదిరెడ్డిలో ఒకరిని ఎంచుకునే అవకాశం ఇంటి సభ్యులకు వచ్చింది. ఎక్కువమంది ఆదిరెడ్డిని కెప్టెన్ గా చూడాలనుకుంటున్నట్టు చెప్పారు. దీంతో వాసంతి ఎలిమినేట్ అయ్యింది.
తరువాత శ్రీసత్య, రేవంత్ మధ్య వచ్చింది. అందరూ శ్రీసత్యకు ఓటేశారు. దీంతో రేవంత్ ఆట నుంచి ఎలిమినేట్ అయ్యాడు. అర్జున్, రోహిత్ మధ్య వచ్చినప్పుడు ఎక్కువ మంది రోహిత్ కు ఓటేశారు. దీంతో అర్జున్ ఎలిమినేట్ అయ్యాడు. రోహిత్- శ్రీసత్యల్లో రోహిత్‌కు ఓటేశారు ఎక్కువమంది. దీంతో శ్రీసత్య ఎలిమినేట్ అయ్యింది.
శ్రీసత్య గొడవ
బాలాదిత్య తనకు కాకుండా రోహిత్ కు ఓటేయడంతో శ్రీ సత్య హర్ట్ అయ్యింది. తాను ఎవరినీ అర్థం చేసుకోలేనని ఎలా అంటావ్ అని బాలాదిత్యతో వాదించింది. మధ్యలో గీతూ కూడా దూరింది. బాలాదిత్య మేం మాట్లాడుకుంటే నువ్వెందుకు మధ్యలో అని అడిగాడు. దానికి నా ఒపీనియన్ చెబుతున్నా అని వాదించింది గీతూ.
ఆదిరెడ్డి తన పూలకుండీని తాను తెచ్చుకుని డిస్ క్వాలిఫై అయ్యాడు. చివరికి రోహిత్, సూర్య మిగిలారు. వీరిద్దరిలో ఒకరిని ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇంటి సభ్యులకు. ఎక్కువ మంది సూర్యకు ఓటేసారు. దీంతో ఆయన సూర్య ఇంటి కెప్టెన్ అయ్యాడు. చివరి ఓటు ఇనయా వేయాల్సి వచ్చినప్పుడు మాత్రం ‘నా ఓటు బ్రో కా? బావ కా?’ అంది. దీంతో అందరూ నవ్వారు. సూర్యకు లవర్ ఉంది అని తెలిసి కూడా ఇనయా అలా మాట్లాడం ఆమెకు పడే ఓట్లపై ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే ఆట ఆపేసి సూర్య పక్కనే కూర్చోవడం నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తూనే ఉంది.
మెరీనా కర్వాచౌత్
కర్వాచౌత్ పండుగ సందర్భంగా మెరీనా ఇంట్లోనే ఆ పండుగను నిర్వహించుకుంది. రాత్రి చంద్రుడిని చూసి ఉపవాసం ఆపింది. ఈ సందర్భంగా బిగ్ బాస్ పాట వేశాడు. దానికి అమ్మాయిలంతా డ్యాన్సులు వేశారు.
Also read: సెల్ఫ్ నామినేట్ అయిన రోహిత్, భార్య కోసం కన్నీటి పర్యంతమైన రేవంత్