Gautham Krishna: శుభశ్రీని కలిసిన ‘బిగ్ బాస్’ గౌతమ్ - పెళ్లిపై క్లారిటీ!
బిగ్ బాస్ సీజన్ 7లో కొన్నాళ్లు లవ్ బర్డ్స్‌లా ఆకట్టుకున్న క్యూట్ జోడీ గౌతమ్, శుభశ్రీ.. ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయారు. తాజాగా వారు బయట ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.
మామూలుగా బిగ్ బాస్ రియాలిటీ షోలోని ప్రతీ సీజన్‌లో ఎవరో ఒక రీల్ కపుల్.. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటారు. ప్రతీసారి ఏదో ఒక కపుల్.. బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చి కనెక్ట్ అయినట్టుగా చూపిస్తారు. కానీ బిగ్ బాస్ సీజన్ 7లో మాత్రం పూర్తిస్థాయిలో అలాంటి కనెక్షన్స్ ఏమీ లేవు. కానీ వచ్చిన మొదటిరోజే శుభశ్రీ అందంగా ఉంటుంది అంటూ ఐస్ చేయడం మొదలుపెట్టాడు గౌతమ్. అప్పటినుంచి వీరిద్దరూ కొన్నిరోజుల పాటు చాలా క్లోజ్‌గా ఉన్నారు. ఆ తర్వాత యావర్ మధ్యలోకి రావడం.. శుభశ్రీ, గౌతమ్‌ల మధ్య మనస్పర్థలు పెరగడంతో దూరమయ్యారు. ప్రస్తుతం వీరిద్దరూ బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిపోవడంతో బయట కలిసిన వీడియో వైరల్ అవుతోంది. అందులో శుభశ్రీతో పలు ఆసక్తికర విషయాలు చర్చించాడు గౌతమ్.
శుభశ్రీ ఎలిమినేషన్‌కు తనే కారణం..
బిగ్ బాస్ సీజన్ 7లో ఒక లెటర్ టాస్క్ జరిగింది. ఆ టాస్కులో గౌతమ్ కోసం ఇష్టం లేకపోయినా.. తన ఇంటి నుంచి వచ్చిన లెటర్‌ను త్యాగం చేసింది శుభశ్రీ. ఇక ఆ లెటర్ త్యాగం చేసినందుకే నామినేషన్స్‌లో నిలబడాల్సి వచ్చింది. ఆ వారమే తక్కువ ఓట్లతో ఎలిమినేట్ అయిపోయింది. దీంతో పరోక్షంగా శుభశ్రీ ఎలిమినేట్ అవ్వడానికి తానే కారణమని గౌతమ్ ఫీల్ అయ్యాడు. గౌతమ్ మాత్రమే కాకుండా శుభశ్రీ కూడా అలాగే ఫీల్ అయ్యింది. అందుకే బయటికి వెళ్లగానే ముందుగా శుభశ్రీని కలుస్తానని బిగ్ బాస్ బజ్‌లో చెప్పాడు గౌతమ్. చివరికి శుభశ్రీని కలిశాడు. ఆమె యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. ఈ సందర్భంగా ‘బిగ్ బాస్ బజ్’లో తనను సెల్ఫిష్ అని ఎందుకు అనాల్సి వచ్చిందో శుభశ్రీ దగ్గర క్లారిటీ తీసుకున్నాడు డాక్టర్ బాబు.
పెళ్లిపై క్లారిటీ..
బిగ్ బాస్ బజ్‌లో తనను శుభశ్రీ సెల్ఫిష్ అనడం గురించి గుర్తుచేశాడు గౌతమ్. ‘‘సుబ్బు ఒకత్తే నీ గురించి నెగిటివ్‌గా చెప్పింది. మిగతావాళ్లంతా పాజిటివ్‌గా చెప్పారని నాకు బజ్‌లో చెప్పారు. సెల్ఫిష్ అన్నావని గీతూ చెప్పింది. లెటర్ టాస్క్ తర్వాత ఆ వారమే ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోవడం, మళ్లీ నీకు తప్పుగా అర్థమవుతుందేమో అని నేను అప్పుడు ఏం మాట్లాడలేదు. బయటికి వచ్చిన తర్వాత చెప్దాం అనుకున్నా కానీ నువ్వు అంత కోపంలో వెళ్తున్నావని నేను అనుకోలేదు. ఇంకొన్ని వారాలు నువ్వు ఉండుంటే అక్కడే క్లియర్ అయిపోయేది’’ అని తనకు అనిపించింది చెప్పుకొచ్చాడు గౌతమ్. ‘‘అదేమీ నెగిటివ్ విషయం కాదు. వరుసగా ప్రశ్నలు అడుగుతున్నప్పుడు గౌతమ్ సెల్ఫిష్ అని అనుకుంటున్నావా అని అడిగింది. అప్పుడు నేను బ్యాడ్‌గా ఫీల్ అవుతున్నా కాబట్టి అప్పుడు అలా అనిపించింది’’ అని క్లారిటీ ఇచ్చింది శుభశ్రీ. అయితే అప్పుడు బ్యాడ్‌గా ఫీల్ అయినందుకు సారీ అన్నాడు గౌతమ్. ఇక బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లి చాలామంది లేడీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు గౌతమ్. అందుకే తన పెళ్లి గురించి ప్రత్యేకంగా అడిగింది శుభశ్రీ. ‘‘చాలా మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చేశాయి కాబట్టి నాకు కొంచెం టైమ్ కావాలి’’ అని రివీల్ చేశాడు. బిగ్ బాస్ హౌజ్‌లోకి జీరోలాగా వెళ్లి.. ఫ్యాన్స్‌ను సంపాదించుకొని వచ్చానని సంతోషంగా ఉందని గౌతమ్ అన్నాడు.
Also Read: అదే మా ఇంట్లో ఆడవాళ్లైతే గొంతు మీద కాలేసి తొక్కేవాడిని - శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు