Brahmamudi Kavya: బిగ్ బాస్ మణికంఠకు బ్రహ్మముడి కావ్య సారీ... ట్రోల్ అయ్యాక తీరిగ్గా క్షమాపణలా?
Bigg Boss Naga Manikanta Trolled Video: బిగ్ బాస్ 8లో మణికంఠ విగ్ తీయడం వైరలైంది. 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం'లో దానిపై 'బ్రహ్మముడి' కావ్య కామెడీ చేయడం ట్రోల్ కాగా ఇప్పుడు సారీ చెప్పింది.
![Brahmamudi Kavya: బిగ్ బాస్ మణికంఠకు బ్రహ్మముడి కావ్య సారీ... ట్రోల్ అయ్యాక తీరిగ్గా క్షమాపణలా? Brahmamudi kavya aka Deepika Rangaraju apologies to Bigg Boss 8 Telugu Naga Manikanta Brahmamudi Kavya: బిగ్ బాస్ మణికంఠకు బ్రహ్మముడి కావ్య సారీ... ట్రోల్ అయ్యాక తీరిగ్గా క్షమాపణలా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/12/e042a549f02f0e7b6239c37ae6d049c61726107082385313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Brahmamudi Kavya trolled Bigg Boss 8 Telugu Naga Manikanta and later apologized: సారీ చెప్పిన సరే బ్రహ్మముడి కావ్యను నాగమణికంఠ అభిమానులు క్షమించేలా లేరు. కామెడీ కోసమైనా సరే ఆవిడ చేసినది తప్పు అని ట్రోల్ చేయడం ఆపడం లేదు. సోషల్ మీడియాలో సారీ చెప్పిన వీడియో కింద కామెంట్ సెక్షన్ ఆఫ్ చేశారంటే కావ్య అలియాస్ దీపిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే...
హాయ్ థిస్ ఈజ్ దీపిక... అంటూ సీరియల్ నటి దీపికా రంగరాజు సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేశారు. అసలు పేరు కంటే తెలుగులో ఆవిడకి పాపులారిటీ తీసుకొచ్చిన సీరియల్ 'బ్రహ్మముడి'లో ఆవిడ పాత్ర పేరు కావ్య అని చెబితే ఎక్కువ మంది గుర్తు పడతారు. అందులో ఆమె నటనకు అభిమానులు ఉన్నారు. అయితే ఇప్పుడు ఆమె కొంతమందిలో వ్యతిరేకత మూట కట్టుకున్నారు. అందుకు కారణం బిగ్ బాస్ షో. అందులో పార్టిసిపేట్ చేస్తున్న మరొక సీరియల్ ఆర్టిస్ట్ నాగ మణికంఠను హేళన చేసేలా ఆవిడ ప్రవర్తించడం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో నాగ మణికంఠ ఓ కంటెస్టెంట్. తన కన్న తండ్రి చిన్నప్పుడు చనిపోవడంతో తల్లి మరొక పెళ్లి చేసుకుందని, తన తల్లి కూడా చనిపోయిన తర్వాత సవతి తండ్రి ఇంటి నుంచి బయటకు వచ్చేశానని, కట్టుకున్న భార్య కన్న కూతురికి ఏడాదిగా దూరంగా ఉంటున్నానని బిగ్ బాస్ ఇంటిలో అడుగు పెట్టేముందు మణికంఠ చెప్పాడు. తాను డిప్రెషన్ లో ఉన్నట్టు కూడా వివరించాడు. ఫస్ట్ వీక్ నామినేషన్ లిస్టులో తన పేరు ఉండడంతో బోరును విలపించడంతో పాటు విగ్గు తీసి పక్కన పడేశాడు. ఆ వీడియో వైరల్ అయింది. నాగమణికంట జుట్టు ఒరిజినల్ కాదా అంటూ కొందరు ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. మరికొందరు అతడికి సపోర్ట్ చేశారు. అయితే ట్రోల్ చేసిన వ్యక్తుల జాబితాలో స్టార్ మా సూపర్ హిట్ సీరియల్ బ్రహ్మముడి హీరోయిన్ దీపిక నాగరాజు కూడా ఉండడం విశేషం.
Also Read: బెంచ్ లైఫ్ రివ్యూ: Sony LIV ఓటీటీలో నిహారిక నిర్మించిన వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
ఆదివారం విత్ స్టార్ మా పరివారం పేరుతో స్టార్ మా చానల్ ప్రతి వారం సీరియల్ ఆర్టిస్టులను తీసుకువచ్చి ఒక ప్రోగ్రాం చేస్తుంది. ఆ ప్రోగ్రాం మైల్ స్టోన్ ఎపిసోడ్ 100కు బ్రహ్మముడి నటీనటులను తీసుకు వచ్చింది. అక్కడ బిగ్ బాస్ షోలో ఈ అమ్మాయి బదులు నువ్వు ఉంటే మస్తు కంటెంట్ ఇచ్చే దానివి అని యాంకర్ శ్రీముఖి అడిగితే... తన విగ్గు తీసి పక్కన పడేసింది దీపిక రంగరాజు. ఈ వీడియో వైరల్ అయింది.
ఏ అమ్మాయి బదులు నువ్వు వెళితే బాగుంటుందని అనిపిస్తుందని శ్రీముఖి అడిగితే నాగ మణికంఠను దీపిక ట్రోల్ చేయడం ఎందుకు అని సోషల్ మీడియాలో పలువురు విమర్శించారు. సొంత ఛానల్, స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న రియాలిటీ షోలో ఆర్టిస్టులను అదే ఛానల్ టీవీ ఆర్టిస్టుల చేత ట్రోల్ చేయించడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ఛానల్ మీద కూడా కొంతమంది విరుచుకుపడ్డారు. తాను చేసిన తప్పును గ్రహించిన దీపికా రంగరాజు... నాగ మణికంఠకు సారీ చెబుతూ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు.
కరోనా తర్వాత ఆరోగ్య సమస్యల కారణంగా తన జుట్టు కూడా పలుచబడిందని, తాను విగ్గు వాడుతున్న విషయాన్ని వివరిస్తూ యూట్యూబ్ కోసం ఒక వీడియో కూడా చేశానని, నాగమణికంఠను తాను ట్రోల్ చేయడం లేదని ఆవిడ పేర్కొన్నారు. అయితే దీపికది కవర్ డ్రైవ్ అని, తప్పు చేసిన విషయం తెలిసి తీరిగ్గా క్షమాపణలు చెప్పారని మణికంఠ అభిమానులు చెబుతున్నారు.
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)