అన్వేషించండి

Bigg Boss Telugu 7 Promo: తండ్రిని ఎత్తుకొని తిప్పిన ప్రశాంత్ - శివాజీకి దండం పెట్టిన ప్రశాంత్ తండ్రి, గుండెలు బరువెక్కడం ఖాయం

బిగ్ బాస్ సీజన్ సెవెన్ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో పల్లవి ప్రశాంత్ తండ్రి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రోమో అంతా ఎమోషనల్ గా సాగింది.

Bigg Boss Season 7 Latest Promo : బిగ్ బాస్ సీజన్ 7 ఫ్యామిలీ వీక్ ఎంతో ఎమోషనల్ గా సాగుతోంది. ఫ్యామిలీ వీక్ లో ఒక్కొక్కరి కుటుంబ సభ్యులు హౌస్ లోకి వస్తూ ఉండడంతో సంతోషంతో పాటు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. హౌస్ లో ఉన్న వాళ్లే కాదు ఆడియన్స్ కూడా ఎంతో ఎమోషనల్ అవుతున్నారు. ఇప్పటికే శివాజీ, అర్జున్, అశ్విని, గౌతమ్, అమర్ దీప్, బోలె, శోభా శెట్టి, ప్రియాంక, యావర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లోకి రాగా తమ ఇంటి వాళ్లను చూడగానే కంటెస్టెంట్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఫ్యామిలీ మెంబర్స్ ని చూసి ఎంతగానో ఆనందించారు, కన్నీళ్లు పెట్టుకున్నారు, ఫుల్ ఎమోషనల్ అయిపోయారు.

ఇక బిగ్ బాస్ సీజన్ 7లో ఫ్యామిలీ వీక్ చివరి దశకు చేరుకుంది. హౌస్ మేట్స్ లో ప్రశాంత్, రతిక కుటుంబ సభ్యులు ఇంట్లోకి రావడమే మిగిలింది. నవంబర్ 10 ఎపిసోడ్లో భాగంగా పల్లవి ప్రశాంత్ తండ్రి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా అందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో అయితే చాలా ఎమోషనల్ గా సాగింది. ఒకసారి ప్రోమోని గమనిస్తే.. ముందుగా ప్రశాంత్ కోసం బిగ్ బాస్ బంతిపూలను పంపించారు. వాటిని చేతిలో పట్టుకున్న ప్రశాంత్.. "చాలా రోజులవుతుంది వీటిని చూసి.. నేనే పెట్టిన" అని ఎంతో ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత బాపు బంగారం అంటూ చేతుల్లో బంతిపూలతో హౌస్ లోకి అడుగుపెట్టారు ప్రశాంత్ తండ్రి.

తండ్రిని చూడగానే దుఃఖంతో కాళ్లపై పడి తీవ్ర కన్నీటి పర్యంతమయ్యాడు ప్రశాంత్. కొడుకుని కౌగిలించుకుని. "నిన్ను చూడక ఎన్ని దినాలు అయింది బిడ్డ" అంటూ ప్రశాంత్ తండ్రి చాలా ఎమోషనల్ అయిపోయాడు. మా బాపు బిగ్ బాస్ లోకి వచ్చాడంటూ తండ్రిని ఎత్తుకొని అరుస్తూ తెగ సంతోష పడిపోయాడు ప్రశాంత్. 'తగ్గేది లేదు బిడ్డ' అంటూ ప్రశాంత్ తండ్రి చెప్పడం ప్రోమోకే హైలైట్ గా మారింది. అనంతరం వాళ్ళిద్దరి దగ్గరికి శివాజీ రావడంతో ప్రశాంత్ తండ్రి.. "నా కొడుకుని కన్న కొడుకులా చూసుకున్నారు" అని శివాజీకి చెబుతూ దండం పెట్టాడు. ఆ తర్వాత ఒక్కొక్కరిని పలకరిస్తూ.. "అందరూ కలిసిమెలిసి ఉండండి, కొట్లాడకండి" అంటూ అమర్ దీప్ తో ఎంతో ఆప్యాయంగా చెప్పుకొచ్చారు.

"నేను చచ్చినా, బతికినా వీనితోనే" అంటూ తన కొడుకు గురించి ప్రశాంత్ తండ్రి ఎంతో గొప్పగా చెప్పుకున్నాడు. ఆ తర్వాత తన తండ్రికి ప్రశాంత్ అన్నం తినిపించాడు. "టాలెంట్ ఉపయోగించుకో. నేను ఏం చెప్పినా నువ్వు ఏడవకు. అమ్మ ఏడుస్తుంది. అమ్మకు బీపీ పెరుగుతుంది" అని ప్రశాంత్ తండ్రి తన కొడుకుతో చెబుతాడు. దాంతో ప్రశాంత్ ఏడవకుండా కళ్ళు తుడుచుకుంటాడు. ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరితో ప్రశాంత్ తండ్రి సరదాగా ఉండడం చూపించారు అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతుంది. మరి ఈ ప్రోమోకి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ చూడాలంటే రాత్రి వరకు వెయిట్ చూడాల్సిందే. లేకపోతే హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ ఉంటే లైవ్ స్ట్రీమింగ్ లో వీక్షించవచ్చు.

Also Read : 'జపాన్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఎవరివో తెలుసా? - ఏ ఓటీటీలో సినిమా వస్తుందంటే?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget