Japan Movie OTT Release : 'జపాన్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఎవరివో తెలుసా? - ఏ ఓటీటీలో సినిమా వస్తుందంటే?
Japan Movie OTT Streaming Partner : కార్తీ 25వ సినిమా 'జపాన్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఏ ఓటీటీ సంస్థ సొంతం చేసుకుందో తెలుసా?
Karthi 25th movie Japan OTT rights acquired by Netflix : తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన తమిళ కథానాయకుడు కార్తీ. 'ఆవారా' సినిమాతో ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో ఫాలోయింగ్ ఏర్పడింది. అప్పటి నుంచి తన ప్రతి సినిమాను తెలుగులో అనువదిస్తూ... తన పాత్రకు తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెబుతూ... ప్రేక్షకులకు దగ్గర అయ్యారు. నాగార్జునతో కలిసి 'ఊపిరి'లో కూడా నటించారు. ఇప్పుడీ హీరో 25వ సినిమా మైలురాయి చేరుకున్నారు.
కార్తీ 25వ సినిమా 'జపాన్'
కథానాయకుడిగా కార్తీ 25వ సినిమా 'జపాన్'. తెలుగు, తమిళ భాషల్లో నవంబర్ 10న దీపావళి కానుకగా విడుదలైంది. తమిళనాడులో కంటే తెలుగులో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ లభించడం విశేషం. మొదటి రోజు థియేటర్ల దగ్గర జనాలు అయితే కనిపించారు. కానీ, విమర్శకుల నుంచి ఈ సినిమాకు మంచి స్పందన రాలేదు. డిజప్పాయింట్ చేసిందని చాలా మంది పేర్కొన్నారు.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీకి 'జపాన్'
Japan movie to stream on Netflix : 'జపాన్' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ భాషలతో పాటు ఇతర భాషల్లో అనువదించే అవకాశాలు ఉన్నాయని వినికిడి.
Also Read : జపాన్ రివ్యూ : వాటీజ్ థిస్ కార్తీ - స్లాంగ్ బావుంది సార్, మరి సినిమా?
'జపాన్' సినిమాలో కార్తీకి జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్ నటించారు. ఇతర ప్రధాన పాత్రల్లో తెలుగు హాస్య నటుడు సునీల్, తమిళ దర్శకులు కెఎస్ రవికుమార్, విజయ్ మిల్టన్ తదితరులు నటించారు. కార్తీ కజిన్స్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ అధినేతలు ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
Also Read : ‘జిగర్తాండా డబుల్ ఎక్స్’ రివ్యూ: రాఘవ లారెన్స్, ఎస్‌జే సూర్య ఎలా చేశారు? కార్తీక్ సుబ్బరాజ్ ఎలా తీశారు?
'జపాన్' సినిమా కథ ఏంటి?
హైదరాబాద్ సిటీలోని రాయల్ జ్యువెలరీలో రూ. 200 కోట్ల విలువైన నగలను ఎవరో దొంగతనం చేస్తారు. ఆ షాపు యజమాని హోమ్ మంత్రికి సన్నిహితుడు. ఆ షాప్ బిల్డింగ్ హోమ్ మంత్రిది. గోల్డెన్ స్టార్ జపాన్ ముని (కార్తీ) దొంగతనం చేశాడని పోలీసులు అనుమానిస్తారు. శ్రీధర్ (సునీల్) నేతృత్వంలో ఓ బృందం, భవాని (విజయ్ మిల్టన్) నేతృత్వంలో మరో బృందం అతడి కోసం అన్వేషణ మొదలు పెడతాయి. దోచుకున్న నగలు, డబ్బుతో సినిమాలు తీయడం జపాన్ హాబీ. ఇక... హీరోయిన్ సంజు (అనూ ఇమ్మాన్యుయేల్) అంటే అతడికి ప్రేమ. ఆమెను కలవడం కోసం జపాన్ వెళ్ళినప్పుడు... పోలీసులు రౌండప్ చేస్తారు. అప్పుడు రాబరీ గురించి జపాన్ తెలుసుకుంటాడు. తాను ఆ దొంగతనం చేయలేదని చెబుతాడు. జపాన్ చేయకపోతే ఆ దొంగతనం చేసింది ఎవరు? ఈ కేసును పోలీసులు ఎలా పరిష్కరించారు? జపాన్ అంటే శ్రీధర్ ఎందుకు భయపడుతున్నాడు? పోలీసులకు చెందిన సీక్రెట్స్ జపాన్ దగ్గర ఏం ఉన్నాయి? చివరకు, ఏమైంది? అనేది మిగతా సినిమా.