అన్వేషించండి

Jigarthanda DoubleX Review: ‘జిగర్తాండా డబుల్ ఎక్స్’ రివ్యూ: రాఘవ లారెన్స్, ఎస్‌జే సూర్య ఎలా చేశారు? కార్తీక్ సుబ్బరాజ్ ఎలా తీశారు?

Jigarthanda DoubleX Movie: రాఘవ లారెన్స్, ఎస్‌జే సూర్యల ‘జిగర్తాండా డబుల్ఎక్స్’ ఎలా ఉంది?

సినిమా రివ్యూ: జిగర్తాండా డబుల్ఎక్స్ 
రేటింగ్: 2.5/5
నటీనటులు: రాఘవ లారెన్స్, ఎస్‌జే సూర్య, నిమిషా సజయన్, నవీన్ చంద్ర, షైన్ టామ్ చాకో తదితరులు 
ఛాయాగ్రహణం: తిరు
సంగీతం: సంతోష్ నారాయణన్
నిర్మాతలు: కార్తికేయన్ సంతానం, ఎస్.కదిరేశన్, అలంకార్ పాండియన్
తెలుగులో పంపిణీ : సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సంస్థ
దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజు
విడుదల తేదీ: నవంబర్ 10, 2023

Jigarthanda DoubleX Movie Review: ‘పిజ్జా’, ‘పేట’, ‘జిగర్తాండా’ లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన మార్కును క్రియేట్ చేసుకున్న దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj). ఆయన దర్శకత్వంలో ఒక సినిమా వస్తుందంటే మంచి అంచనాలు ఉంటాయి. రాఘవ లారెన్స్ (Raghava Lawrence), ఎస్‌జే సూర్య (SJ Suryah) లాంటి విలక్షణ నటులతో ‘జిగర్తాండా’ సీక్వెల్ అనౌన్స్ చేయగానే సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ‘జిగర్తాండా డబుల్ఎక్స్ (Jigarthanda DoubleX)’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది?

కథ: ఎస్సై కావాలనుకుని తన భయం కారణంగా హత్య నేరంలో ఇరుక్కుని జైలు శిక్ష అనుభవిస్తూ ఉంటాడు కృప (ఎస్‌జే సూర్య). రాజకీయ నాయకుల అండతో కర్నూలు మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న అలియస్ సీజర్ (రాఘవ లారెన్స్). రాజకీయాల్లో ఉన్న సినిమా హీరో జయకృష్ణ (షైన్ టామ్ చాకో). తను నటించిన సినిమాకు కాకుండా పోటీగా విడుదల అయిన సినిమాకు ఎక్కువ థియేటర్లు దక్కేలా చేసినందుకు తన పార్టీలోనే ఉన్న మరో నాయకుడిపై జయకృష్ణ కక్ష కడతాడు. అతనికి అండగా ఉన్న నలుగురు రౌడీలను చంపాలని డీఎస్పీగా పని చేస్తున్న తమ్ముడిని (నవీన్ చంద్ర) రంగంలోకి దించుతాడు. ఎస్సై పోస్టింగ్ అందుకుని వివిధ కారణాల వల్ల జైలు శిక్ష అనుభవిస్తున్న నలుగురిని సెలక్ట్ చేస్తాడు హీరో తమ్ముడు. ఒక్కొక్కరు ఒక్కో రౌడీని చంపాలని టార్గెట్ పెడతాడు. అందులో కృపకు అలియాస్ సీజర్ పేరు వస్తుంది. దీంతో రే దాసన్ అనే దర్శకుడి పేరుతో సీజర్ పంచన చేరతాడు కృప. తన రంగును ఒక హీరో అవమానించడంతో ఎలాగైనా హీరో అవ్వాలని మంచి దర్శకుడి కోసం సీజర్ వెతుకుతూ ఉంటాడు. వీరిద్దరూ సీజర్ బయోపిక్‌ను తనతోనే తీయాలని ఫిక్స్ అవుతారు. తర్వాత ఏం జరిగింది? కథ అడవుల్లో నివసించే ఆదివాసీల దగ్గరకు ఎలా వెళ్లింది? వీరిద్దరూ తీసిన సినిమా చివరికి విడుదల అయందా? ఇదంతా తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

విశ్లేషణ: సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ చూసి ఒక గ్యాంగ్‌స్టర్ జోనర్ సినిమా అనే ఫీల్‌ను కలిగించాయి. సినిమా ఫస్టాఫ్ కూడా అలానే సాగుతుంది. ముఖ్యంగా రాఘవ లారెన్స్ ఇంట్రడక్షన్ ఫైట్‌ను చాలా భారీగా తెరకెక్కించారు. తన క్యారెక్టర్‌కు భారీ బిల్డప్ ఇచ్చారు. అన్ని పాత్రల పరిచయం, వాటన్నిటినీ ఒక్క చోటికి ఇదంతా చాలా ఆసక్తికరంగా సాగుతుంది. రాఘవ లారెన్స్, ఎస్‌జే సూర్య మొదటి సారి కలిసే సన్నివేశంలో ఎస్‌జే సూర్య నటన ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు ప్రధాన హైలెట్ ఇంటర్వెల్. ఆ సీన్ పిక్చరైజేషన్‌తో పాటు అక్కడ వచ్చే ట్విస్ట్ కూడా ఆకట్టుకుంటుంది. ఫస్టాఫ్ వరకు సినిమా చాలా బాగుంది. ఎంగేజింగ్‌గా సాగుతూ ఆకట్టుకుంటుంది.

అసలు సమస్య సెకండాఫ్ నుంచి మొదలవుతుంది. ఇక్కడ కూడా సీజర్ అడవికి వెళ్లడం, అక్కడ ఉండే విలన్‌తో తలపడటం ఇంతవరకు బాగానే ఉంటుంది. ఎక్కడైతే స్టోరీ అడవిలో ఉండే జనం, వారి సమస్యల వైపు మళ్లుతుందో గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోతుంది. సినిమా అనే బలమైన మాధ్యమం ద్వారా ఒక సమస్యను చెప్తే అది ఎక్కువ మందికి రీచ్ అవుతుందన్న సంగతి నిజమే. కానీ సినిమా ప్రధాన లక్ష్యం ఆడియన్స్‌ను ఆకట్టుకోవడం. ఆడియన్స్‌ను ఎంగేజ్ చేస్తూ సమస్యను ఎంత బలంగా చెప్పినా పర్లేదు. కానీ డాక్యుమెంటరీలా చూపిస్తే కనెక్ట్ అవ్వడం కష్టం.

ఎంతమంది వచ్చినా ఒంటరిగా ఎదుర్కునే సీజర్ క్యారెక్టరైజేషన్ అప్ సైడ్ డౌన్ అయిపోవడం పెద్ద మైనస్. క్లైమ్యాక్స్‌లో ఫేస్ ఆఫ్ సీన్‌తో దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేశారు కానీ అప్పటికి ప్రేక్షకులు డిస్‌కనెక్ట్ అయపోతారు. సినిమాలో వయొలెన్స్, రక్తపాతం కూడా కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ‘జిగర్తాండా’ మొదటి భాగంతో కంపేర్ చేస్తే సినిమా ఆత్మ విషయంలో కూడా చాలా మార్పులు జరిగాయి. మొదటి భాగం పూర్తిగా సినిమా తీయడం అనే కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుంది. కానీ ఇందులో ఆదివాసీల సమస్యలను చూపించారు.

సినిమా ప్రధాన ప్లస్ పాయింట్ సంతోష్ నారాయణన్ సంగీతం. ఒక నేటివ్ సినిమాకు వెస్టర్న్ మ్యూజిక్‌తో డిఫరెంట్ మూడ్ ఇచ్చాడు. ఇంగ్లీష్ ట్రాక్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా వర్కవుట్ అయ్యాయి. తిరు సినిమాటోగ్రఫీ కూడా సూపర్. సెట్ వర్క్‌కు ఈ సినిమాకు మరో స్తంభం లాంటిది. 1975 మూడ్‌ను పర్ఫెక్ట్‌గా స్క్రీన్‌పై చూపెట్టారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.

Also Read దీపావళికి తెలుగు ప్రేక్షకులకు డబ్బింగ్ సినిమాలే దిక్కు... టాలీవుడ్ స్టార్ సినిమా ఒక్కటీ లేదుగా!

ఇక నటీనటుల విషయానికి వస్తే... రాఘవ లారెన్స్ ఇప్పటివరకు చేసిన పెర్పార్మెన్స్‌ల్లో ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో అద్భుతంగా నటించారు. ఎస్‌‌జే సూర్య ఎప్పటిలానే మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కానీ తన మార్కు కామెడీ ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం కష్టం. లారెన్స్ భార్య పాత్రలో నటించిన నిమిషా సజయన్ సినిమాలో సర్‌ప్రైజ్ ప్యాకేజ్. చాలా బాగా నటించారు. షైన్ టామ్ చాకో, నవీన్ చంద్ర నెగిటివ్ పాత్రల్లో బాగా నటించారు.

ఓవరాల్‌గా చెప్పాలంటే... ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త డౌన్ అయినట్లు అనిపిస్తుంది. ‘జగమే తంత్రం’ సినిమా మీకు నచ్చితే దీన్ని థియేటర్‌లో చూడవచ్చు.

Also Read : విజయ్ దేవరకొండ సినిమా ఫ్లాప్ - అంత చెత్త రివ్యూ ఎప్పుడూ రాలేదట!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mudragada Padmanabha Reddy: మాజీ మంత్రి ముద్రగడ ఇంటిపై దాడి, ఇళ్లు కూల్చడానికి తాగుబోతు యత్నం
మాజీ మంత్రి ముద్రగడ ఇంటిపై దాడి, ఇళ్లు కూల్చడానికి తాగుబోతు యత్నం
Udit Narayan Kiss Controversy : 'ముద్దు' వివాదంపై స్పందించిన ఉదిత్ నారాయణ్.. 'నేను అస్సలు సిగ్గుపడను, అది కేవలం నా ఫ్యాన్స్ మీద నాకున్న లవ్ మాత్రమే'
'ముద్దు' వివాదంపై స్పందించిన ఉదిత్ నారాయణ్.. 'నేను అస్సలు సిగ్గుపడను, అది కేవలం నా ఫ్యాన్స్ మీద నాకున్న లవ్ మాత్రమే'
Budget 2025 : విదేశాల్లో పిల్లల్ని చదివించే వారికి బిగ్ రిలీఫ్ - టీసీఎస్ లిమిట్ రూ.10 లక్షలకు పెంపు
విదేశాల్లో పిల్లల్ని చదివించే వారికి బిగ్ రిలీఫ్ - టీసీఎస్ లిమిట్ రూ.10 లక్షలకు పెంపు
Union Budget 2025: బడ్జెట్ ఎఫెక్ట్, నిర్మలమ్మ ప్రకటనతో దిగిరానున్న బంగారం, ఆభరణాల ధరలు!
బడ్జెట్ ఎఫెక్ట్, నిర్మలమ్మ ప్రకటనతో దిగిరానున్న బంగారం, ఆభరణాల ధరలు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Union Budget 2025 Top 5 Points | బడ్జెట్ చూడలేదా పర్లేదు..ఈ వీడియో చూడు చాలు | ABP DesamUnion Budget 2025 Income Tax Nirmala Sitharaman 12Lakhs No Tax | ఉద్యోగులకు పెద్ద తాయిలం ప్రకటించిన కేంద్రం | ABPNagoba Jathara Youngsters Musical Instruments | డోలు, సన్నాయిలతో కుర్రాళ్ల సంగీత సేవ | ABP DesamPM Modi Hints on Income Tax Rebate | ఆదాయపు పన్ను మినహాయింపు గురించి మోదీ నిన్ననే చెప్పారు | ABP

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mudragada Padmanabha Reddy: మాజీ మంత్రి ముద్రగడ ఇంటిపై దాడి, ఇళ్లు కూల్చడానికి తాగుబోతు యత్నం
మాజీ మంత్రి ముద్రగడ ఇంటిపై దాడి, ఇళ్లు కూల్చడానికి తాగుబోతు యత్నం
Udit Narayan Kiss Controversy : 'ముద్దు' వివాదంపై స్పందించిన ఉదిత్ నారాయణ్.. 'నేను అస్సలు సిగ్గుపడను, అది కేవలం నా ఫ్యాన్స్ మీద నాకున్న లవ్ మాత్రమే'
'ముద్దు' వివాదంపై స్పందించిన ఉదిత్ నారాయణ్.. 'నేను అస్సలు సిగ్గుపడను, అది కేవలం నా ఫ్యాన్స్ మీద నాకున్న లవ్ మాత్రమే'
Budget 2025 : విదేశాల్లో పిల్లల్ని చదివించే వారికి బిగ్ రిలీఫ్ - టీసీఎస్ లిమిట్ రూ.10 లక్షలకు పెంపు
విదేశాల్లో పిల్లల్ని చదివించే వారికి బిగ్ రిలీఫ్ - టీసీఎస్ లిమిట్ రూ.10 లక్షలకు పెంపు
Union Budget 2025: బడ్జెట్ ఎఫెక్ట్, నిర్మలమ్మ ప్రకటనతో దిగిరానున్న బంగారం, ఆభరణాల ధరలు!
బడ్జెట్ ఎఫెక్ట్, నిర్మలమ్మ ప్రకటనతో దిగిరానున్న బంగారం, ఆభరణాల ధరలు!
Tirumala Stampede: తిరుమలలో తొక్కిసలాట జరిగిన స్థలాన్ని పరిశీలించిన విచారణ కమిటీ సభ్యులు
Tirumala Stampede: తిరుమలలో తొక్కిసలాట జరిగిన స్థలాన్ని పరిశీలించిన విచారణ కమిటీ సభ్యులు
Chiranjeevi: వీరాభిమానితో మెగాస్టార్ మరో సినిమా... అనిల్ రావిపూడి, ఓదెలకు మధ్యలోనా? తర్వాత?
వీరాభిమానితో మెగాస్టార్ మరో సినిమా... అనిల్ రావిపూడి, ఓదెలకు మధ్యలోనా? తర్వాత?
Crime News: రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు, కాల్వల్లోకి దూసుకెళ్లిన వాహనాలు.. 16 మంది మృతి
రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు, కాల్వల్లోకి దూసుకెళ్లిన వాహనాలు.. 16 మంది మృతి
Sircilla News: సొంతిల్లు లేక రాత్రంతా మృతదేహంతో అంబులెన్స్‌లోనే కుటుంబం.. వారి కన్నీళ్లకు స్పందించిన కలెక్టర్
సొంతిల్లు లేక రాత్రంతా మృతదేహంతో అంబులెన్స్‌లోనే కుటుంబం.. వారి కన్నీళ్లకు స్పందించిన కలెక్టర్
Embed widget