అన్వేషించండి

Diwali 2023 Telugu Movies : తెలుగు ప్రేక్షకులకు డబ్బింగ్ దీపావళి - టాలీవుడ్ స్టార్ సినిమా ఒక్కటీ లేదుగా!

దీపావళి పండక్కి విడుదల అవుతున్న సినిమాల లిస్టు చూస్తే తెలుగు స్టార్ నటించిన సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. 

Diwali 2023 Telugu Movies : దీపావళి పండక్కి థియేటర్లలో సినిమా చూడాలని తెలుగు ప్రేక్షకులు అనుకుంటే ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా మాత్రమే ఉంది. స్టార్ హీరోలు నటించిన సినిమా అయితే అసలు లేనే లేదు. దీపావళికి మాత్రమే కాదు... ఇంతకు ముందు వినాయక చవితికి కూడా ఇదే పరిస్థితి. ఆ పండక్కి 'స్కంద'ను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే... సెప్టెంబర్  28 నుంచి 'సలార్' వాయిదా పడటంతో రామ్ పోతినేని, బోయపాటి శ్రీను వెనక్కి వెళ్ళింది. దాంతో 'మార్క్ ఆంటోనీ' ఒక్కటే విడుదల అయ్యింది. 

ఇప్పుడు దీపావళికి కూడా సేమ్ సిట్యువేషన్. తెలుగులో తమిళ సినిమాలు జోరు, హుషారు కనబడుతోంది. అసలు... ఇప్పుడు వస్తున్న సినిమాలు ఏవి? అనేది ఒక్కసారి చూస్తే... 

'జపాన్' వర్సెస్ 'జిగర్ తండ డబుల్ ఎక్స్'
దీపావళి సందర్భంగా విడుదల అవుతున్న మేజర్ సినిమాల్లో 'జపాన్' (Japan Movie Karthi), 'జిగర్ తండ డబుల్ ఎక్స్' (Jigarthanda DoubleX) ముఖ్యమైనవి. ఈ రెండూ తమిళ డబ్బింగ్ సినిమాలే. ఒక్క ప్లస్ పాయింట్ ఏంటంటే... రెండు సినిమాల్లో హీరోలు తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు.

దీపావళికి మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్, శ్రీ లీల జంటగా నటించిన 'ఆదికేశవ'ను విడుదల చేయాలని ప్లాన్ చేసినా... వరల్డ్ కప్ సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ జరిగే సమయంలో ప్రేక్షకులు రారని నవంబర్ 24కు వాయిదా వేశారు. ఆ తర్వాత మరో సినిమా నవంబర్ 10కి రాలేదు.

తెలుగు ప్రేక్షకులకు కార్తీ చాలా గౌరవం ఇస్తారు. తన సినిమాలకు తెలుగులో తానే సొంతంగా డబ్బింగ్ చెబుతారు. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడో ఆయనను తమవాడిగా చూడటం మొదలు పెట్టారు. పైగా, 'జపాన్' ట్రైలర్ సరదాగా ఉండటంతో ఇక్కడ కూడా అంచనాలు ఉన్నాయి. ఇక... 'జిగర్ తండ డబుల్ ఎక్స్' విషయానికి వస్తే రాఘవా లారెన్స్ నృత్య దర్శకుడిగా, దర్శకుడిగా, హీరోగా తెలుగులో సినిమాలు చేశారు. విజయాలు అందుకున్నారు. అందుకని, ఆయనకు అభిమానులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ సినిమాకు వెళతారు. ఈ రెండు సినిమాలు 10న విడుదల అవుతున్నాయి. 

Also Read 'గేమ్ ఛేంజర్'కు భారీ డీల్ - విడుదలకు ముందు కోట్లు కొల్లగొట్టిన సాంగ్స్!

తమిళం నుంచి తెలుగుకు వస్తున్న మరో సినిమా 'దీపావళి'. తెలుగులో ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్ దీనిని నిర్మించడం విశేషం. ఆయనకు తమిళంలో తొలి చిత్రమిది. అవార్డులు, ప్రశంసలు పొందిన 'కిడ'కు తెలుగు అనువాదం 'దీపావళి'. సినిమా పేరులో పండగ ఉంది. సినిమా నేపథ్యం కూడా దీపావళి పండగ. డబ్బులు లేని పరిస్థితిలో మనవడికి కొత్త దుస్తులు కొని ఇవ్వడం కోసం తాత మేక అమ్మబోతే ఏం జరిగిందనేది కథ. ఇది 11న విడుదల అవుతోంది. 

తెలుగులోనూ సల్మాన్ ఖాన్ 'టైగర్ 3'
దీపావళికి విడుదల అవుతున్న మరో పెద్ద సినిమా 'టైగర్ 3' (Tiger 3 Salman Khan). తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో సల్మాన్ ఖాన్ అంటే క్రేజ్ ఉంది. కత్రినా కైఫ్ టవల్ ఫైట్ స్టిల్ వైరల్ అవుతోంది. యాక్షన్ మూవీ కావడంతో మాస్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చేలా ఉంది. ఈ సినిమా ఆదివారం థియేటర్లలోకి వస్తుండటం విశేషం. 

Also Read ఎంత పని చేశావ్ సమంత - అంతా ఆమె స్విమ్ సూట్ గురించే టాపిక్!

హాలీవుడ్ మూవీ 'ది మార్వెల్స్' (The Marvels) కూడా 10న విడుదల అవుతోంది. దీపావళికి థియేటర్లలో విడుదల అవుతున్న ఒకే ఒక్క తెలుగు సినిమా 'అలా నిన్ను చేరి'. 'హుషారు', 'ప్లే బ్యాక్', 'మెరిసే మెరిసే' సినిమాల ఫేమ్ దినేష్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా శుక్రవారం విడుదల అవుతోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget