Game Changer : 'గేమ్ ఛేంజర్'కు భారీ డీల్ - విడుదలకు ముందు కోట్లు కొల్లగొట్టిన సాంగ్స్!
Game Changer Audio Rights : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న 'గేమ్ ఛేంజర్' సినిమా ఆడియో రైట్స్ భారీ రేటుకు అమ్ముడు అయ్యాయని తెలిసింది.
Game Changer Songs : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'గేమ్ ఛేంజర్'. సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఫస్ట్ టైమ్ ఓ తెలుగు హీరోతో చేస్తున్న చిత్రమిది. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ సంస్థలో 50వ చిత్రమిది. ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు, ఆయన సోదరుడు శిరీష్ నిర్మిస్తున్నారు. దీపావళికి ఫస్ట్ సాంగ్ 'జరగండి... జరగండి' విడుదల చేస్తున్నారు. సినిమాలో ఒక్క సాంగ్ ఇంకా విడుదల కాలేదు. కానీ, కోట్లు కొల్లగొట్టింది. అది ఎలా అంటారా? ఆడియో రైట్స్ ద్వారా!
'గేమ్ ఛేంజర్' ఆడియో @ 33 కోట్లు!
'గేమ్ ఛేంజర్' మ్యూజిక్ హక్కుల్ని ప్రముఖ ఆడియో కంపెనీ సరేగమప సొంతం చేసుకుంది. అందుకోసం 33 కోట్ల రూపాయలు ఇవ్వడానికి అంగీకరించిందని తెలిసింది. ఒక్క పాట కూడా విడుదల కాకుండా ఇంత అమౌంట్ రావడం అంటే పెద్ద విషయమే. పాన్ ఇండియా సినిమాల్లో హయ్యస్ట్ అమౌంట్ ఈ సినిమాకు వచ్చిందని ఫిల్మ్ నగర్ వర్గాల ఖబర్. 'గేమ్ ఛేంజర్' తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఆ సినిమా రైట్స్ సోనీ మ్యూజిక్ సొంతం చేసుకుందని తెలిసింది. ఆ సినిమా హక్కుల కోసం ఊహించని అమౌంట్ కోట్ చేశారట.
శంకర్ సినిమాల్లో పాటలు ఎప్పుడూ సంథింగ్ స్పెషల్ అన్నట్లు ఉంటాయి. ఆ మాటకు వస్తే... సౌత్ ఇండియన్ సినిమాల్లోని పాటల్లో భారీతనం శంకర్ తీసే సినిమాలతో మొదలైందని చెప్పవచ్చు. మరోవైపు రామ్ చరణ్ అంటే హిందీ ప్రేక్షకుల్లో కూడా క్రేజ్ ఉంది. అందుకని, 33 కోట్లకు డీల్ కుదిరిందని ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి సమాచారం అందింది.
Also Read : ఎంత పని చేశావ్ సమంత - అంతా ఆమె స్విమ్ సూట్ గురించే టాపిక్!
మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన సంగీత దర్శకుడు తమన్ (music director thaman) మీద కూడా నమ్మకం ఉండటం వల్ల ఆడియో రైట్స్ ద్వారా 33 కోట్లు వచ్చాయని చెప్పవచ్చు. విమర్శలు వచ్చిన ప్రతిసారీ గోడకు కొట్టిన బంతిలా పైకి లేచారు. 'అల వైకుంఠపురములో' పాటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ప్రతిభ ఎంత ఉందనేది ప్రతి ఒక్కరికీ తెలిసేలా విజయాలు సాధించారు. తమన్ టాలెంట్ తెలిసిన దర్శకుడు శంకర్... ఆయనతో మంచి పాటలు చేయించుకుని ఉంటారు.
Also Read : విష్ణు మంచు 'కన్నప్ప'కు... 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' మధ్య కనెక్షన్ ఏంటి?
'గేమ్ ఛేంజర్' సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అడ్వాణీ కథానాయికగా నటించారు. 'వినయ విధేయ రామ' తర్వాత వాళ్ళిద్దరూ జంటగా నటిస్తున్న సినిమా ఇది. తెలుగమ్మాయి అంజలి మరో కథానాయిక. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశంలో చరణ్ భార్యగా ఆమె కనిపిస్తారని తెలిసింది. సముద్రఖని, ఎస్.జె సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర తదితరులు ఇతర ప్రధాన తారాగణం.
'గేమ్ ఛేంజర్' చిత్రానికి నృత్యాలు : ప్రభుదేవా, గణేష్ ఆచార్య, ప్రేమ్ రక్షిత్, బాస్కక్ష మార్టియా, జానీ & శాండీ, సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్ & కాసర్ల శ్యామ్, రచయితలు : ఎస్.యు. వెంకటేశన్, ఫర్హద్ సామ్‌జీ & వివేక్, స్టోరీ లైన్ : కార్తీక్ సుబ్బరాజ్, మాటలు : సాయిమాధవ్ బుర్రా, సహ నిర్మాత : హర్షిత్, ఛాయాగ్రహణం : ఎస్. తిరుణావుక్కరసు, సంగీతం : తమన్, నిర్మాతలు: దిల్ రాజు & శిరీష్, దర్శకత్వం : శంకర్.