Kannappa Movie : విష్ణు మంచు 'కన్నప్ప'కు... 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' మధ్య కనెక్షన్ ఏంటి?
Vishnu Manchu Kannappa Movie Updates : డైనమిక్ స్టార్ విష్ణు మంచు టైటిల్ పాత్రలో రూపొందుతున్న 'కన్నప్ప' సినిమా చిత్రీకరణ ఇప్పుడు న్యూజిలాండ్‌లో జరుగుతోంది.
యువ కథానాయకుడు, డైనమిక్ స్టార్ విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' (Kannappa Movie). ఎ ట్రూ ఎపిక్ ఇండియన్ టేల్... అనేది ఉప శీర్షిక. మైథాలజీ నేపథ్యంలో విష్ణు మంచు నటిస్తున్న తొలి సినిమా ఇది. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించాలని ప్రీ ప్రొడక్షన్ నుంచి పకడ్బందీగా... ముందు నుంచి పక్కా ప్లానింగుతో సెట్స్ మీదకు వెళ్లారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ న్యూజిలాండ్ దేశంలో జరుగుతోంది.
'కన్నప్ప' షూటింగ్... 80% @ న్యూజిలాండ్!
'కన్నప్ప' సినిమాలో 80 శాతం సన్నివేశాలను న్యూజిలాండ్‌లోని అందమైన ప్రదేశాలలో జరుగుతుందని చిత్ర బృందం పేర్కొంది. ''న్యూజిలాండ్ దేశంలోని ప్రకృతి, ఆ వాతావరణం, అందమైన ప్రదేశాలను మా సినిమాలో చాలా అద్భుతంగా చూపించబోతున్నాం. మైథాలజీ నేపథ్యంలో సన్నివేశాలకు న్యూజిలాండ్ వాతావరణం సరిగ్గా సరిపోతుంది'' అని చెప్పారు.
'లార్డ్ ఆఫ్ ది రింగ్స్'కు కనెక్షన్ ఏంటి?
'కన్నప్ప' సినిమాకు... హాలీవుడ్ క్లాసిక్, ఎపిక్ ఫాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ ఫ్రాంచైజీ 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్'కు మధ్య ఓ కనెక్షన్ ఉంది. అది ఏమిటంటే... హాలీవుడ్ సినిమా షూటింగ్ జరిగిన ప్రదేశాలలో 'కన్నప్ప' చిత్రీకరణ చేస్తున్నారు.
''దేవుడు సృష్టిలో న్యూజిలాండ్ అందమైన పెయింటింగ్ లాంటిది. 'కన్నప్ప'కు న్యూజిలాండ్ పర్ఫెక్ట్ లొకేషన్. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, ఎమోషనల్ సన్నివేశాలను న్యూజిలాండ్ లొకేషన్లు ఇంకా ఎలివేట్ చేస్తాయి. అక్కడి ప్రకృతి అందాలను, అత్యాధునిక సినిమాటిక్ టెక్నాలజీ ఉపయోగించుకుని దృశ్య కావ్యంగా 'కన్నప్ప'ను రూపొందిస్తున్నాం. మా చిత్ర బృందం అంతా ఎంతో అంకిత భావంతో పని చేస్తోంది. అగ్రశ్రేణి ప్రతిభావంతులు, నటీనటులు, అత్యాధునిక సాంకేతికతతో భావి తరాలకు గుర్తిండిపోయేలా ఓ కళాఖండంగా 'కన్నప్ప'ను తెరకెక్కిస్తున్నాం'' అని విష్ణు మంచు అన్నారు.
Also Read : 'దమ్ మసాలా' ఒరిజినల్ సాంగ్ కాదా? హిందీ పాటను తమన్ ఎత్తేశాడా?
కన్నప్ప తన రెండు కళ్లను ఆ శివుడికి అర్పించేందుకు సిద్ధపడిన శ్రీకాళహస్తి ఆలయంలో ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార 'కన్నప్ప'లో శివ పార్వతుల పాత్రల్లో కనిపించనున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ సైతం ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. హిందీ చిత్రసీమలో అగ్ర హీరో హీరోయిన్లలో కొందరు కూడా 'కన్నప్ప'లో కీలక పాత్రల్లో కనిపిస్తారని సమాచారం.
Also Read : నా బాడీ వాడుకున్నారు, రష్మిక వీడియోతో నాకు సంబంధం లేదు - బ్రిటిష్ ఇండియన్ మోడల్ రియాక్షన్
అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై లెజెండరీ నటుడు, కలెక్షన్ కింగ్, విష్ణు తండ్రి మంచు మోహన్ బాబు (Mohan Babu) ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. స్టార్ ప్లస్ టీవీలో మహాభారత సిరీస్ తీసిన ముఖేష్ కుమార్ సింగ్ 'కన్నప్ప'కు దర్శకుడు. సుమారు రూ. 150 కోట్ల నిర్మాణ వ్యయంతో సినిమా రూపొందనుంది. లెజెండరీ రచయితలు పరుచూరి గోపాల కృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ కథకు హంగులు అద్దారు. ఈ చిత్రానికి మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందించనున్నారు.