అన్వేషించండి

Bigg Boss Season 8: అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!

Bigg Boss Telugu 8 First Week Elimination | అంతా అనుకున్నదే జరిగిందని, బిగ్ బాస్ సీజన్ 8 తొలి వారం ఆ వీక్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారని ప్రేక్షకులు అనుకుంటున్నారు.

Bigg Boss Telugu Season 8 First Week Elimination: బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 1న మొదలై, రోజుకో గొడవతో జనాలకు రోత పుట్టిస్తోంది. కానీ ఎంత వారం మొత్తం సాగే ఎపిసోడ్ లలో ఎంత బోర్ కొట్టినా బుల్లితెర ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూసే వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసింది. అలాగే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనే విషయం కూడా బయటకు వచ్చింది. అదే నిజమైతే ముందుగా అనుకున్నట్టుగానే ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయినట్టే. 

ఈ వీక్ ఆ కంటెస్టెంట్ అవుట్ 

మొదటివారం బిగ్ బాస్ హౌజ్ లో సీరియల్ బ్యాచ్ హడావుడి ఎక్కువగా కనిపించింది. ముగ్గురిని చీఫ్ గా నియమించి, వాళ్లకు సైన్యం అంటూ గేమ్ మొదలుపెట్టారు బిగ్ బాస్. అలాగే చీఫ్ లైన యష్మి, నిఖిల్, నైనిక లకు ఇమ్యూనిటీని ఇచ్చి, ఫస్ట్ వీక్ ఎవరిని నామినేట్ చేయాలనే అధికారాన్ని కూడా వాళ్ళకే అప్పజెప్పారు. నామినేషన్ ప్రక్రియతో దాదాపు మూడు రోజులు హౌజ్ లో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. అందరూ కలిసి బేబక్క, మణికంఠలను టార్గెట్ చేశారు. ఆ తరువాత టాస్కులు ఆడుతున్న క్రమంలో జరిగిన గొడవలకు లెక్కేలేదు. మొత్తానికి ఎలిమినేషన్ టైం వచ్చేసింది. ఈసారి నామినేషన్ ప్రక్రియ సోమ వారం మొదలుకొని బుధవారం వరకు కొనసాగింది. ఆ తర్వాత ఓటింగ్ లైన్స్ ఓపెన్ కాగా శుక్రవారం అర్ధరాత్రి తో క్లోజ్ అయ్యాయి.

అయితే మొదటివారం నామినేషన్లలో పృథ్వి శెట్టి, మణికంఠ, శేఖర్ భాష, విష్ణు ప్రియ, సోనియా, బెజవాడ బేబక్క పేర్లు ఉన్నాయి. వీరందరిలోనూ మణికంఠ చాలా వీక్ అనుకునే లోపే సింపతి కార్డు ప్లే చేసి ఓటింగ్స్ పరంగా అతను టాప్ లోకి దూసుకెళ్లాడు. ఇక అందరూ అనుకున్నట్టుగా బెజవాడ బేబక్క, శేఖర్ భాష, సోనియా ఓటింగ్ అతి తక్కువగా ఉన్న చివరి ముగ్గురు కంటెస్టెంట్ల లిస్టులో చేరిపోయారు. క్లియర్ గా మొదటి నుంచి బెజవాడ బేబక్క హౌజ్ నుంచి ఈ వీక్ బయటకి వెళ్తుందనేది అందరికీ ముందే అర్థమైంది. తాజా సమాచారం ప్రకారం అందరూ అనుకున్నట్టుగానే ఈ వీక్ నాగార్జున ఆమెను బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు పంపించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తి పూర్తయింది. కానీ ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఎలిమినేషన్ ప్రక్రియను రేపు జరిపే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆదివారం రాత్రి బేబక్క హౌస్ నుంచి బయటకు వెళ్లొచ్చు. 

Read Also: రొమాంటిక్ యాంగిల్ బయట పెట్టిన మణికంఠ, భార్య హగ్ చేసుకోవాలంటే ఆ పని చేస్తాడట

ఆ సెంటిమెంట్ నిజమైంది 

ఇదిలా ఉండగా బిగ్ బాస్ గత సీజన్లను పోల్చి చూసుకుంటే బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిన ఏజ్డ్ కంటెస్టెంట్ లనే మొదటివారం బయటకు పంపుతున్నారు. వాళ్లను ఓవైపు కంటెస్టెంట్స్ టార్గెట్ చేస్తుంటే, మరోవైపు ఫస్ట్ వీక్ కావడంతో ప్రేక్షకులు కూడా పెద్దగా కాపాడే ప్రయత్నం చేయట్లేదు. అంతేకాకుండా వయసును దృష్టిలో పెట్టుకొని హౌస్ మేట్స్ అందరి కోసం వంట చేయడానికి వంటింట్లో గరిట తిప్పిన కంటెస్టెంట్ కచ్చితంగా ఎలిమినేట్ అవుతారు. ఇప్పుడు బేబక్క విషయంలో కూడా ఇదే సెంటిమెంట్ నిజమైంది.

Also Read: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మపుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదేనటి కస్తూరి అరెస్ట్‌, 14 రోజుల రిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Kantara Chapter 1 Release Date: గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Embed widget