అన్వేషించండి

Bigg Boss Season 8 : రొమాంటిక్ యాంగిల్ బయట పెట్టిన మణికంఠ, భార్య హగ్ చేసుకోవాలంటే ఆ పని చేస్తాడట

Bigg Boss Season 8 : నిన్న మొన్నటిదాకా ఏడుస్తూ తన ఎమోషనల్ స్టోరీ గురించి చెప్పిందే చెప్పిన నాగమణికంఠ తనలోని మరో కొత్త యాంగిల్ ని బయట పెట్టాడు. అది కూడా రొమాంటిక్ యాంగిల్.

Bigg Boss Telugu Season 8 :అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అంటూ ఈసారి నాగార్జున ఏ ముహూర్తన సీజన్ ని స్టార్ట్ చేశారో తెలియదు కానీ హౌస్ లో ప్రతి చిన్న విషయానికి గొడవ జరుగుతుంది. కంటెస్టెంట్స్ అంతా కంటెంట్ ఇవ్వడానికి చేసే ప్రయత్నంలో కావాలని గొడవలు పడుతూ, షోను చూసే ప్రేక్షకులకు రోత పుట్టిస్తున్నారని చెప్పాలి. ఇక నిన్న మొన్నటిదాకా నాగమణికంఠ అయితే ఏడుస్తూ తన ఎమోషనల్ స్టోరీ గురించి చెప్పిందే చెప్పి విసుగు పుట్టించాడు. అయితే తాజాగా మణికంఠ తనలోని మరో కొత్త యాంగిల్ ని బయట పెట్టాడు. అది కూడా రొమాంటిక్ యాంగిల్. నా భార్య వచ్చినను హగ్ చేసుకోవాలంటే నేను ఈ పనే చేస్తాను అంటూ తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన రొమాంటిక్ సీక్రెట్ ను బయట పెట్టాడు. 

హౌస్ లో మొదటి వారమే అందరూ తనను టార్గెట్ చేయడంతో మణికంఠ తెగ ఏడ్చాడు. తన ఫాస్ట్ లైఫ్ గురించిన స్టోరీని చెప్పి ఆడియన్స్ మనసును పిండేసాడు. సింపతి కార్డ్ ప్లే చేసి బాగానే జనాలకు కనెక్ట్ అయ్యాడు. ఫలితంగా ఓటింగ్లో ఎక్కడో లాస్ట్ లో ఉండాల్సిన ఈ కంటెస్టెంట్ టాప్ లోకి దూసుకెళ్లాడు. ఇక బిగ్ బాస్ నువ్వు అనుకుంటున్నట్టుగా ఏమీ జరగదు అంటూ భరోసా ఇవ్వడంతో తనలోని ఎమోషనల్ యాంగిల్ ని, ఇప్పటిదాకా వాడిన సింపతి కార్డుని పక్కన పెట్టేసి కొత్త యాంగిల్ ని బయటకు తీసుకొచ్చాడు. హౌస్ మేట్స్ కూడా ఒక్కరోజులోనే ఇతనిలో వచ్చిన మార్పును చూసి షాక్ అయ్యారు. నబిల్ అయితే ఏకంగా భలే కలిసిపోతున్నాడు అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. అలాగే హౌస్ మేట్స్ లోని ఒకరిద్దరు తనలో చాలా మార్పు వచ్చింది అంటూ ఎపిసోడ్ 6లో మాట్లాడుకోవడం కనిపించింది. ఏదైతేనేం మణికంఠ ఏడవడం మానేసి హ్యాపీగా ఉంటున్నాడు అదే చాలు అనుకునే లోపు తనలోని రొమాంటిక్ యాంగిల్ ని బయటపెట్టి టాక్ ఆఫ్ ది షో అయ్యాడు. 

Read Also:   'టేస్టీ' తేజకు సినిమాలో మెయిన్ లీడ్ రోల్

ఇక విషయంలోకి వెళ్తే తాజా ఎపిసోడ్ లో ఆదిత్య బేబక్కకి తన దగ్గర ఉన్న పర్ఫ్యూమ్ స్మెల్ చూడమంటూ చేతిపై స్ప్రే చేశాడు. ఆమె వెంటనే స్మెల్ చూసి బాగుందంటూ కితాబు ఇచ్చింది. ఆ వెంటనే మణికంఠ తన భార్యను గుర్తు చేసుకుంటూ తన రొమాంటిక్ లైఫ్ కి సంబంధించిన సీక్రెట్ ని బయట పెట్టాడు. నా భార్య నన్ను హగ్ చేసుకోవాలంటే నేను ఇదే పర్ఫ్యూమ్ వాడతాను. తనకి కాఫీ అంటే చాలా ఇష్టం. అందుకే తను ఫ్లైట్ దిగినప్పుడు, తన దగ్గరకు వెళ్లినప్పుడల్లా ఆమె నన్ను హగ్ చేసుకోవాలి అనిపిస్తే ఈ పర్ఫ్యూమ్ వాడతాను. వెంటనే ఆమె స్మెల్ చూసి నాపై వాలిపోతుంది అని బేబక్కకు చెప్తూ భార్యను గుర్తు చేసుకున్నాడు. అలాగే మిస్ యు అంటూ భార్యకి మెసేజ్ కూడా పంపాడు. దీంతో బేబక్క మణికంఠను ఆటపటించింది. ఇక ప్రేక్షకులు కూడా మణికంఠలో ఇదే మార్పును కోరుకుంటున్నారు. కాబట్టి ఆయన ఇలాగే ఆటను కంటిన్యూ చేస్తే మరి కొంతకాలం హౌస్ లో ఎలాంటి టెన్షన్ లేకుండా కొనసాగే అవకాశం ఉంది. అలాగే ఇప్పటి నుంచి చాలామంది ఆయన బయట పెట్టిన రొమాంటిక్ సీక్రెట్ ను ఫాలో అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Free Gas Scheme: మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
CM Revanth Reddy: 'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
Telangana High Court: 15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
Embed widget