Bigg Boss Tasty Teja: 'టేస్టీ' తేజకు మెయిన్ లీడ్ రోల్... 'జబర్దస్త్', 'బిగ్ బాస్' నుంచి ఇప్పుడు సినిమాల్లోకి
6 Journey Telugu Movie: 'బిగ్ బాస్' నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్లకు సినిమాల్లో ఛాన్సులు తక్కువ అంటారు. కానీ, టేస్టీ తేజ '6 జర్నీ'లో మెయిన్ లీడ్ రోల్ చేశాడు. రీసెంట్‌గా మూవీ టీజర్ లాంచ్ చేశారు.
యూట్యూబ్‌లో టేస్టీ తేజ పాపులర్. అతను చేసే ఫుడ్ వ్లాగ్స్, సెలబ్రిటీలతో చేసే ఫుడ్ కాన్సెప్ట్ బేస్డ్ ఇంటర్వ్యూలకు ఫ్యాన్స్ ఉన్నారు. యూట్యూబ్ నుంచి మెల్లగా 'జబర్దస్త్' షోలో రోల్స్ చేసే ఛాన్స్ అందుకున్నాడు. అక్కడ నుంచి 'బిగ్ బాస్', ఈ మధ్య 'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' షోల్లో పార్టిసిపేట్ చేశాడు. ఇప్పుడు ఏకంగా ఓ సినిమాలో మెయిన్ లీడ్ రోల్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. '6 జర్నీ'లో 'టేస్టీ' తేజ ఓ మెయిన్ లీడ్. రీసెంట్‌గా ఆ సినిమా టీజర్ లాంచ్ చేశారు.
థియేటర్లలోకి త్వరలో 'టేస్టీ' తేజ '6 జర్నీ'
టేస్టీ తేజ ఓ మెయిన్ లీడ్ రోల్ చేసిన సినిమా '6 జర్నీ'. ఇందులో రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, పల్లవి, రమ్యా రెడ్డి ఇతర ప్రధాన తారాగణం. బషీర్ అలూరి దర్శకుడు. అరుణ కుమారి ఫిలింస్ పతాకంపై పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో పాల్యం రవి ప్రకాష్ రెడ్డి నిర్మించారు. సెన్సార్ కాపీ రెడీ అయ్యింది. త్వరలో చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. టీజర్ విడుదల చేసిన పటేల్ రమేష్ రెడ్డి దర్శక నిర్మాతలు సినిమాను తెరకెక్కించిన విధానం బావుందని, టీజర్‌తో పాటు విజువల్స్, నేపథ్య సంగీతం బావున్నాయని, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.
'బిగ్ బాస్' షో చేయడానికి ముందు వచ్చిన ఛాన్స్!
తాను 'బిగ్ బాస్' షోలో పార్టిసిపేట్ చేయడానికి ముందు '6 జర్నీ'లో నటించే ఛాన్స్ వచ్చిందని 'టేస్టీ' తేజ తెలిపారు. ఆయన మాట్లాడుతూ... ''నన్ను నమ్మి మంచి క్యారెక్టర్ చేసే అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్. 'బిగ్ బాస్' షోకి వెళ్లక ముందు, ఆ షో నుంచి వచ్చిన తర్వాత సినిమా చిత్రీకరణలో పాల్గొన్నాను. ఈ టీమ్ అంతా ఎంతో సహకరించారు. కొత్తవాళ్లతో చేసిన ఈ సినిమా విజయం సాధించాలి. రవి అన్న ఖర్చు గురించి ఆలోచించకుండా సినిమా తీశారు'' అని చెప్పారు.
Also Read: తమ్ముడికి తారక్ వెల్కమ్... బాబాయ్ బాలకృష్ణతో గొడవలు అంటూ వచ్చే పుకార్లకు చెక్!
టేస్టీ తేజ ఎనర్జీతో నటించాడు - దర్శకుడు బషీర్!
టేస్టీ తేజ ఎంతో ఎనర్జీతో నటించారని, ఎంటర్‌టైన్ చేయడంతో పాటు నటుడిగా ఆకట్టుకుంటారని దర్శకుడు బషీర్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''మా హీరో సమీర్ ఎంతో కష్టపడ్డాడు. నిర్మాతగా, నటుడిగా ముందుండి రవి ప్రకాష్ రెడ్డి సినిమాను నడిపించారు. సింహ గారు మంచి బాణీలు అందించారు. సురేందర్ రెడ్డి గారికి రుణపడి ఉంటాను. ఆయన వల్ల సినిమా ఇక్కడి వరకు వచ్చింది'' అని చెప్పారు. '6 జర్నీ'లో నటించడంతో పాటు నిర్మించడం సంతోషంగా ఉందని రవి ప్రకాష్ రెడ్డి తెలిపారు. త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటిస్తామని ఆయన చెప్పారు.
Also Read: విజయ్ 'ది గోట్'కి సీక్వెల్... పవన్ కల్యాణ్ టైటిల్ మీద కన్నేసిన దళపతి
సమీర్ దత్త, 'టేస్టీ తేజ', రవి ప్రకాష్ రెడ్డి, పల్లవి రాథోడ్, రమ్యకృష్ణ, సాహితి, అభిరాం, సంజయ్ ఆచార్య, 'జబర్దస్త్' చిట్టిబాబు, అవంతిక, సోహైల్ తదితరులు నటించిన ఈ సినిమాకు ఛాయాగ్రహణం: టి. సురేందర్ రెడ్డి, సంగీతం: ఎంఎన్ సింహ, పాటలు: రామారావు మాతుమూరు.