అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Bigg Boss 8 Week 1 Nominations: చిచ్చు పెట్టిన వంట, రచ్చ రేపిన నామినేషన్స్! ఏకంగా కత్తి దింపుతున్న కంటెస్టెంట్స్

Bigg Boss Telugu Season 8 | బిగ్ బాస్ రెండో రోజు గేమ్ మరింత హాట్ హాట్ గా మారింది. ముగ్గురు చీఫ్ లను ప్రకటించిన అనంతరం నామినేషన్స్ మొదలుపెట్టారు బిగ్ బాస్. కత్తి దింపి మరి నామినేషన్ చేయాలన్నారు.

Bigg Boss Telugu Season 8: ఆట హాట్ గురూ అంటున్నారు.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్. లాంచింగ్ తర్వాత రెండో రోజు గేమ్ ను హాట్ హాట్ గా కంటిన్యూ చేశారు. వంట విషయంలో అభిప్రాయ భేదాలతో మొదలైన ఆట.. నానిమేషన్స్ తో పీక్స్ కు చేరింది. చీఫ్స్ గా ఎంపికైన ముగ్గురు.. నిఖిల్, నైనిక, యశ్మీ మినహా.. మిగతా కంటెస్టెంట్స్ అంతా నామినేషన్స్ వేశారు. రెండు రోజుల్లో తమకు నచ్చని విషయాలేంటో చెబుతూ.. అందుకు కారణమైన వారిని నామినేషన్స్ బోనులో నిలబెట్టారు. మధ్యలో.. చీఫ్స్ కు కీలక బాధ్యత అప్పజెప్పిన బిగ్ బాస్.. ఆటను మరింత రక్తి కట్టేలా చేశారు. ఆ బాధ్యత కారణంగా.. ముగ్గురు చీఫ్స్.. తమ అభిప్రాయాలు చెబుతూ మిగతా కంటెస్టెంట్లతో వాగ్వాదానికి దిగడం.. ప్రతిగా కంటెస్టెంట్లూ స్ట్రాంగ్ రిప్లై ఇవ్వడం.. ఇలా నామినేషన్స్ ప్రక్రియ కొనసాగింది.

ఎపిసోడ్ లో కనిపించిన ప్రకారంగా చూస్తే.. యశ్మీని మూడో చీఫ్ గా ఎంపిక చేయడాన్ని సోనియా మరోసారి తప్పుబడుతూ నిఖిల్ తో డీప్ డిస్కషన్ కు దిగింది. ఈ సీన్ తో ఎపిసోడ్ ప్రారంభమైంది. యశ్మీకి ఎవరు అండగా నిలిచారు.. ఆమెను మూడో చీఫ్ గా ఎన్నుకోవడానికి కారణం ఏంటి అని పదే పదే నిఖిల్ ను ప్రశ్నించింది. నైనిక కూడా మధ్యలో ఎంటరైంది. తాను చిన్న పిల్లలా బిహేవ్ చేయడం లేదని.. తనకు 23 ఏళ్ల వయసుందని చెబుతూ.. యశ్మీని ఎన్నుకోవడంలో తన నిర్ణయాన్ని నైనిక సమర్థించుకుంది. నిఖిల్ కూడా.. తనకు ఎలాంటి పక్షపాతం లేదని.. ఈ 2 రోజుల్లో తనకు కలిగిన అభిప్రాయాన్ని ఆధారంగా చేసుకునే తాను యశ్మీకి మద్దతుగా నిలిచానని సోనియాకు చెప్పుకొచ్చాడు.

ఉదయం 9 గంటల 30 నిముషాలకు.. ఏ బిడ్డా.. ఇది నా అడ్డా.. సాంగ్ తో రెండో రోజు ఆట ప్రారంభమైంది. తర్వాత.. మధ్యాహ్నం 12 గంటల సమయంలో మణికంఠ కాస్త నిద్రపోవడంతో.. బిగ్ బాస్ లో కుక్క అరుపులు వినిపించాయి. తాను అలా కన్ను మూశాను మాత్రమే అని.. నిద్రపోలేదని, అంతలోనే కుక్క అరిచిందని మణి కాస్త నర్వస్ అయ్యాడు. మిగిలిన కంటెస్టెంట్స్ ఇదే అదనుగా.. మణికంఠను కార్నర్ చేస్తూ.. ఎందుకలా ఒంటరిగా ఉంటాడో అర్థం కావడం లేదని.. బిగ్ బాస్ హౌస్ లో అలా ఉండడం సరికాదని కామెంట్ చేసుకున్నారు. కాసేపటికి.. బేబక్క వంట చేస్తున్న తీరుపై కొందరు సమర్థిస్తే.. మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. వంట ఒకేసారి జరుగుతుందని.. మధ్యలో హౌస్ మేట్స్ వంట చేసుకుంటామని అంటే కుదరదని.. బేబక్క, నిఖిల్.. నబిల్ కు చెప్పారు. మిగతా వాళ్లు వచ్చి అడిగినా కూడా.. ఎలాంటి ఎక్జెంప్షన్ లేదని, రూల్ ఈస్ రూల్.. రూల్ ఫర్ ఆల్ అని తేల్చి చెప్పారు.

అసలు ఆట.. సాయంత్రం 4 గంటలకు మొదలైంది. అడవిని తలపించే థీమ్ తో ప్రత్యేకంగా రూపొందించిన సెట్ లో.. ఈ సీజన్ మొట్టమొదటి నామినేషన్ల ప్రక్రియను బిగ్ బాస్ ప్రారంభించారు. చీఫ్స్ గా ఉన్న నిఖిల్, నైనిక, యశ్మీ.. ఎవరిపైనా నేరుగా నామినేషన్ వేయకుండా.. మరో బాధ్యతను అప్పగించారు. ఈ ముగ్గురూ తప్ప.. మిగిలిన 11 మందికి నానిమేషన్లు వేసే అవకాశం ఇచ్చారు. ప్రతి హౌస్ మేట్.. ఇద్దరిపై నామినేషన్ వేయవచ్చని, అక్కడ ఏర్పాటు చేసిన బండపై ఆ ఇద్దరి ఫొటోలు పెట్టి.. నామినేషన్లకు గల కారణాలు వివరించాలని ఆర్డర్ చేశారు. చీఫ్స్ మాత్రం.. ఆ ఆర్గ్యుమెంట్స్ వినాలని.. చివరికి ముగ్గురిలో.. ఎవరైనా ఒకరు ముందుగా వెళ్లి.. అక్కడ ఏర్పాటు చేసిన కత్తిని అందుకోవాలని చెప్పారు. నామినేషన్లో ఉన్న ఇద్దరినుంచి ఒకరిని మినహాయించి.. మిగతా హౌజ్ మేట్ ఫొటోపై కత్తిని గుచ్చి.. నామినేషన్ లిస్ట్ లో ఖరారు చేయాలని చెప్పారు.


Also Read: Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్‌కి కలిసోచ్చిన లావ్‌ ట్రాక్స్‌ - ఈ ఏడు సీజన్స్‌లో హాట్‌టాపికైన ప్రేమ జంటలు ఇవే, ఈసారి...

అలా.. సోనియా వేసిన నామినేషన్లతో మొదలైన ప్రక్రియ.. ఎపిసోడ్ ముగిసేసరికి బేబక్క వేసిన నామినేషన్ల వరకు చేరుకుంది. మిగిలిన కంటెస్టెంట్ల నామినేషన్లు.. రేపటి ఎపిసోడ్ లో కంటిన్యూ కానున్నాయి. ఓవరాల్ గా చూస్తే.. వంట విషయంలో మొదలైన చిచ్చు.. నామినేషన్లతో రచ్చ రచ్చ జరిగేవరకూ వెళ్లింది. ఈ హీట్.. రేపటి ఎపిసోడ్ పై అంచనాలు పెంచింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget