Bigg Boss Telugu: మొదటి చీఫ్‌గా నిఖిల్- బిగ్‌బాస్ హౌస్‌లో రెండో రోజే ఆట వేడెక్కింది- హీట్ మొదలైంది..!
Bigg Boss Season: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మొదటి రోజే గలాటా మొదలైంది. మణికంఠతో మొదలైన వివాదం ఎపిసోడ్ చివరి వరకు హాట్ హాట్‌గా సాగింది. ముగ్గురు చీఫ్‌ల కోసం టాస్క్ పెట్టాడు.
Bigg Boss Season 8 Telugu: అనుకున్నట్టే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8... వేడెక్కింది. ఆట మొదలైన రెండో రోజే.. కంటెస్టెంట్స్ మధ్య పైట్ మొదలైంది. నాగ మణికంఠ సెంట్రిక్ గా.. బిగ్ బాస్ ఇవాళ్టి ఎపిసోడ్ మొదలైంది. లాంచింగ్ రోజు అనిల్ రావిపూడి చేసిన ప్రాంక్ టాస్క్ లో.. మిగతా హౌస్ మేట్స్ చాలామంది తనను.. హౌస్ నుంచి బయటికి పంపేందుకు నామినేట్ చేయడాన్ని మణికంఠ తీవ్రంగా తప్పుబట్టాడు. ఆ తర్వాత.. మణికంఠ ఒక సందర్భం లో.. ఆదిత్య ఓం తో అమర్యాద గా మాట్లాడాడు అని.. నిఖిల్ పాయింట్ లేవనెత్తాడు. కానీ తను ఎవరినీ డిస్ రెస్పెక్ట్ చేయలేదనీ.. తన పాయింట్ మాత్రమే మాట్లాడానని మణికంఠ సమర్ధించుకున్నాడు.
Also Read: బిగ్ బాస్ సీజన్ 8లో 14 మంది కంటెస్టెంట్లు వీళ్లే - ఫోటోలతో పాటు పేర్లూ చూసేయండి
ఆ తర్వాత కూడా మణికంఠ కేంద్రంగానే ఎపిసోడ్ కంటిన్యూ అయ్యింది. తనలోని సున్నితత్వాన్ని.. ఫెమినిస్ట్ అని విష్ణుప్రియ కామెంట్ చేసిందంటూ మణి ఫీల్ అయ్యాడు. అలా ఎలా మాట్లాడుతుందని.. బాధ పడ్డాడు. కిర్రాక్ సీతతో తన ఆవేదన పంచుకున్నాడు.. మణి. ఆ తర్వాత 9.15 కి బిగ్ బాస్ ప్లే చేసిన మెగాస్టార్ చిరంజీవి తార్ మార్ తక్కర్ మార్ పాటకు.. హౌస్ మెట్స్ గుడ్ మార్నింగ్ డ్యాన్స్ అదరగొట్టారు. లాంచింగ్ రోజు.. నో రేషన్ అని బాద్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్.. ఇవాళ రేషన్ పంపించి అందరికీ రిలాక్సేషన్ ఇచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు నాన్ వెజ్ కూడా పంపించి అందరినీ ఖుషీ చేశారు.
అలా సాయంత్రం 4.45 వరకు రోజును కానిచేసిన ఇంటి సభ్యులంతా.. సడెన్ గా బిగ్ బిస్ వాయిస్ తో అలెర్ట్ అయ్యారు. లాంచింగ్ రోజు సెలబ్రిటీ టాస్కుల్లో గెలిచిన 3 జంటలకు కంగ్రాట్స్ చెప్పిన బిగ్ బాస్.. అసలైన ఆటను అప్పుడు మొదలుపెట్టారు. గెలిచిన 3 జంటలలో ఉన్న.. నిఖిల్, యష్మి, బేబక్క, శేఖర్, నబీల్, నైనిక లకు హౌస్ చీఫ్ టాస్క్ పెట్టారు. అతుక్కుని ఉండండి.. వదలకండి.. అంటూ జరిగిన మొదటి టాస్క్ లో గెలిచి .. మొదటి హౌస్ చీఫ్ అయ్యాడు నిఖిల్. తర్వాత.. మిగిలిన ఐదుగురు కోన్ టాస్క్ లో పోటీ పడగా.. సైనిక గెలిచింది. చివర్లో.. మిగిలిన నలుగురికీ మరో టాస్క్ పెట్టకుండా బిగ్ బాస్ మెలిక పెట్టారు.
Also Read: నాగ మణికంఠను స్టెప్ ఫాదర్ ఇంటి నుంచి గెంటేశారా? వచ్చేశాడా? అసలు నిజం చెప్పిన చెల్లెలు
మిగిలిన నలుగురి లో నుంచి ఒకరిని మాత్రమే మూడో చీఫ్ గా ఎన్నుకోవాలని చెబుతూ.. ఆ బాధ్యతను నిఖిల్, సైనిక కు అప్పగించారు బిగ్ బాస్. రకరకాల కారణాలతో.. యశ్మీ నీ మూడో చీఫ్ గా ఎన్నుకున్నారు.. నిఖిల్, సైనిక. ఈ నిర్ణయాన్ని నబిల్ తప్పుబట్టగా.. అతనికి సోనియా సపోర్ట్ గా నిలిచింది. తమ నిర్ణయాన్ని.. నిఖిల్, సైనిక సమర్థించుకున్నారు. కానీ.. యష్మీ, నిఖిల్ ఫ్రెండ్స్ అనీ... అందుకే ఆమెను సెలెక్ట్ చేశారని.. సోనియా గట్టిగానే వాదించింది. ఈ హీట్ తో ముదిరిన గొడవ మధ్యే.. ఎపిసోడ్ ముగిసింది.
ఓవరాల్ గా చూస్తే.. సోషల్ మీడియా లో బజ్ క్రియేట్ అయినట్టుగానే.. మణికంఠ చుట్టూ డిస్కషన్ అవుతోంది. అలాగే.. ఇంటి సభ్యులు కూడా గ్రూపులు కడుతున్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. తర్వాతి రోజు ఆటలో నామినేషన్లు జరగనున్నాయి. కాబట్టి.. హౌస్ చీఫ్ టాస్క్ లో జరిగిన గొడవలు అన్నీ.. అక్కడ ఇంపాక్ట్ చూపించి.. గేమ్ ను మరింతగా రక్తి కట్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: వైరల్ అవుతున్న విష్ణుప్రియ పాత వీడియో, ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్న నెటిజన్లు