Bigg Boss Telugu Day 65 Promo : బిగ్‌బాస్ రాజ్యంలో ఓ రాజా ఇద్దరు రాణులు.. ఇమ్మూ ఈజ్ బ్యాక్, కామెడీతో మ్యాజిక్ చేస్తున్నాడుగా
Bigg Boss Telugu Today Promo : బిగ్‌బాస్‌లో నామినేషన్స్ పర్వం నిన్నటితో ముగిసింది. అయితే ఈరోజు ఓ టాస్క్ ఇచ్చి నామినేషన్స్ నుంచి ఎస్కేప్ అవ్వచ్చని చెప్పాడు బిగ్‌బాస్.

Bigg Boss 9 Nominations Escape Promo : బిగ్‌బాస్‌లో పదవ వారానికి నామినేషన్స్ జరిగిపోయాయి. అయితే వీటినుంచి బయట పడేందుకు కంటెస్టెంట్లకు ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇదే టాస్క్ ఓ రెండు, మూడ్రోజులు కొనసాగి.. ఇమ్యూనిటీతో పాటు కెప్టెన్సీకి కూడా హెల్ప్ అయ్యేట్టు ప్లాన్ చేశారు. దానిలో భాగంగా బిగ్‌బాస్ రాజ్యంలో ఓ రాజు, ఇద్దరు రాణులను చేశాడు. ఇంతకీ టాస్క్ ఏంటి? ప్రోమోలో ఇచ్చిన హైలెట్స్ ఏంటో ఓ సారి చూసేద్దాం.
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో హైలెట్స్..
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో ఫన్నీగా సాగింది. నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యేందుకు మీ అందరికీ ఓ అవకాశం ఇస్తున్నానని బిగ్‌బాస్ చెప్పడంతో ప్రోమో మొదలైంది. నేను ఎంపిక చేసిన రీతూ, కళ్యాణ్, దివ్య ఈ బీబీ రాజ్యానికి రాజు, రాణులు. వీళ్లకి ఇంట్లో ప్రత్యేకమైన విలాసాలు లభిస్తాయని చెప్పాడు బిగ్‌బాస్. స్టోర్ రూమ్‌లో వారికి తగ్గ డ్రెస్‌లు పంపాడు. అలాగే ఇంటి సభ్యులను నలుగురు కమాండోలుగా, నలుగురు గ్రామస్థులుగా చేయాలని సూచించాడు బిగ్‌బాస్.
ఆద్యంతం ఫన్..
డ్రెస్ వేసుకుని వచ్చిన రీతూ, దివ్యలను ఉద్దేశించి.. ఈ రాజ్యంలో ఇంత అందమైన రాణులు ఉన్నారని తెలియని ఇమ్మూ అనగా అందరూ నవ్వుతారు. అలాగే నిఖిల్ జోక్ వేస్తే.. రీతూ రాజుపై జోక్ వేస్తే మూతి కుట్టిస్తే అంటూ ఫన్ చేసింది. అనంతరం కమాండోలుగా, గ్రామస్థులుగా విడదీసేందుకు ముందుగా ఇమ్మూని పిలిచారు. మిమ్మల్ని మా రాజ్యానికి కమాండోగా నియమిస్తే మీరు ఏమి చేస్తారు అంటూ కళ్యాణ్ అడగ్గా.. దానికి ఇమ్మూ రాజ్యాన్ని కాపాడడంలో కొద్దో, గొప్పో నైపుణ్యం ఉందని చెప్తాడు. దానికి దివ్య కౌంటర్ వేస్తూ అవును అందుకే పది వారాలుగా నామినేషన్స్‌లో లేరనే సరికి నవ్వేస్తారు. ఇంతలో డిమోన్ వచ్చి ఇద్దరు రాణిలకు ఏమి కావాలో అవి దగ్గరుండి చేస్తాను అని రీతూకి దగ్గరగా వెళ్తే.. అందరికి వెళ్లనవసరం లేదని దివ్య కౌంటర్ వేస్తుంది.
అన్న సుమన్ శెట్టి.. బాబాయ్ భరణి
సుమన్ శెట్టి, ఇమ్మూ, భరణి, గౌరవ్ విలేజర్స్ గెటప్స్‌లో కనిపించగా.. డిమోన్ పవన్, సంజన, తనూజ, నిఖిల్ కమాండోలుగా మారారు. బయట ఉన్న సుమన్, ఇమ్మూని మీరిద్దరూ ఏమవుతారంటే ఇమ్మూ మా అన్న అని సుమన్‌ని చూపిస్తాడు. దానికి దివ్య మీ కన్నా చిన్నగా ఉన్నాడేంటి అంటే నవ్వేస్తారు. మీతోపాటు ఇద్దరు విలేజర్స్ ఉండాలని రీతూ అడగ్గా.. కమాండోలను అడగండి వాళ్లు ఇంకా రాలేదంటూ సుమన్ నవ్విస్తాడు. ఇంతలో భరణి వస్తే ఆయనేంటి కనీసం వంగడం లేదంటే.. ఆయన నాలుగు సార్లు వంగినందుకే బయటకు వెళ్లివచ్చాడంటూ జోక్స్ చేస్తారు. ఇలా ప్రోమో ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగింది.






















