Bigg Boss Telugu Day 64 Promo : తనూజ, దివ్య నామినేషన్స్.. ఇద్దరు ఒక్కటే పాయింట్‌తో గౌరవ్‌ని టార్గెట్ చేశారుగా
Bigg Boss Telugu Today Promo : బిగ్‌బాస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వచ్చినవారిని ఇంట్లోనుంచి పంపించేయాలని టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. ఈవారం నామినేషన్స్ అలాగే ఉన్నాయి మరి.

Bigg Boss 9 Nominations Promo : బిగ్‌బాస్‌లో నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. దానిలో భాగంగా పదవ వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. అయితే తెలుసో.. తెలియకుండానో దివ్య, తనూజ ఇద్దరూ కలిసి గౌరవ్‌ని ఒక్కటే పాయింట్‌పై టార్గెట్ చేశారు. సుమన్ శెట్టి కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిన నిఖిల్‌తో ముందు నుంచి దెబ్బలు తగిలించుకున్నాము మీరు మధ్యలో వచ్చేస్తే ఎలా అంటూ ప్రశ్నించాడు. ఇంతకీ ప్రోమోలో ఏముంది? హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
బిగ్‌బాస్ నామినేషన్స్ ప్రోమో..
బిగ్‌బాస్ నామినేషన్స్‌లో కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్‌గా వచ్చిన వాళ్లను టార్గెట్‌గా చేసుకున్నట్లు కనిపిస్తుంది. అయితే దివ్య, తనూజ మధ్య జరిగిన గొడవతో వారిద్దరూ ఒకరినొకరు నామినేట్ చేసుకుంటారు.. పెద్ద గొడవ జరుగుతుందని భావించిన బిగ్‌బాస్ ప్రేక్షకులకు డిజప్పాయింట్మెంట్ మిగిలింది. దివ్య, తనూజ ఒకరినొకరు నామినేట్ చేసుకోకపోగా.. ఇద్దరూ కలిసి ఒకే పాయింట్‌పై ఒకరినే నామినేట్ చేసినట్లు ప్రోమోలో చూపించారు. గౌరవ్‌ని ఒక్కటే పాయింట్‌పై టార్గెట్ చేశారు.
దివ్యతో గౌరవ్ గొడవ
ముందుగా వచ్చిన దివ్య.. గౌరవ్ మొన్న కెప్టెన్సీ టాస్క్‌లో నువ్వు ఒకరికి సపోర్ట్ చేశావు. ఆ పర్సన్ మొదటిరౌండ్లో అవుట్ అయిపోతే.. ఇక నా పని అయిపోయిందని వెళ్లిపోయి పక్కన కూర్చొన్నావు. ఐ డోంట్ లైక్ దట్ అంటూ చెప్పింది. ఫుడ్‌లో నీ పోర్షన్ అడగడంలో నువ్వు ఎలా అయితే ముందు ఉంటావో.. గేమ్స్‌లో కూడా నువ్వు అలాగే ముందు ఉండాలి. కానీ నువ్వు ఉండవు అంటూ చెప్పింది. గేమ్ స్టార్ట్ అయ్యే ముందు మీరు ఏమి చెప్పారు. ఈ టైమ్‌లో మీరు సపోర్ట్ చేయి.. నా టైమ్‌లో నేను కూడా సపోర్ట్ చేస్తాను అని కదా చెప్పారంటూ గౌరవ్ అడగ్గా.. అవును అన్నాను అని చెప్తోంది దివ్య. మీరు తనూజని గేమ్ నుంచి తీసేయాలి అనుకున్నారు.
తనూజ పాయింట్ కూడా అదే..
తనూజ కూడా సేప్ పాయింట్ చెప్పింది. గౌరవ్‌ని ఉద్దేశిస్తూ.. నువ్వేం చేస్తున్నావు నీకే అర్థం కాలేదు. ఒకరిని సపోర్ట్ చేయడానికి వచ్చావు. వాళ్లు గేమ్ నుంచి అవుట్ అవ్వగానే.. నేను ఇంక ఎవరికి సపోర్ట్ చేయను అన్నట్లు, సంబంధమే లేనట్లు తిరుగుతున్నావు. నీకు అవసరం ఉన్నప్పుడు నువ్వు సూపర్ ఫ్రీ ఉంటావు. అవసరం తీరాక.. ఏంటి? ఏంది అనుకుంటూ తిరుగుతావు అన్నది. బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారిపోతుంది. నా ఫస్ట్ ఆప్షన్ భరణి సార్.. కానీ మీరు వచ్చి వావ్ అంటూ క్లాప్స్ కొట్టారు. మీరెందుకు నా సపోర్ట్ కావాలనుకున్నారు అంటూ గౌరవ్ అడిగాడు.
తర్వాత వచ్చిన ఇమ్మాన్యుయేల్ నిఖిల్ గేమ్ ఆడట్లేదంటూ నామినేట్ చేశాడు. నేను కాదు.. మీరే గేమ్ ఆడట్లేదు అంటే.. ముందు నుంచి మేము గేమ్ ఆడి దెబ్బలు తిన్నాము. మీరు ఇప్పుడొచ్చారంటూ రిప్లై ఇవ్వడంతో ప్రోమో ముగిసింది.






















