Bigg Boss Telugu Day 64 Promo : బిగ్‌బాస్‌లో నామినేషన్స్ హీట్.. భరణిని నామినేట్ చేసిన ఇమ్మూ, తనూజకి ఇన్‌డైరెక్ట్ కౌంటర్!?
Bigg Boss Telugu Today Promo : బిగ్‌బాస్‌లో నామినేషన్స్ హీట్ మొదలైంది. పదవ వారానికి నామినేషన్స్‌లో బురద స్నానాలు చేయించేశాడు బిగ్‌బాస్. హైలెట్స్ చూసేద్దాం.

Bigg Boss 9 Nominations Promo : బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగులో 10వ వారానికి నామినేషన్స్ మొదలయ్యాయి. అయితే ఈసారి ఈ ప్రక్రియ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పాడు బిగ్‌బాస్. దానిలో భాగంగా కొన్ని ట్విస్ట్‌లు పెట్టాడు. అంతేకాకుండా భరణి, దివ్యల మధ్య కూడా నామినేషన్స్ జరిగేలా ప్లాన్ చేశాడు. మరి ఈ వారం నామినేషన్స్‌లో ఎవరు ఉన్నారో.. ఎవరి మధ్య ఎలాంటి గొడవలు అయ్యాయో ఇప్పుడు చూసేద్దాం.
బిగ్‌బాస్ నామినేషన్స్ డే 1 ప్రోమో..
బిగ్‌బాస్ ఈవారం నామినేషన్స్‌కి టైమ్ లిమిట్ పెట్టాడు. రోజంతా సాగదీయకుండా కేవలం 5 నిమిషాల్లో నామినేషన్స్ ప్రక్రియ పూర్తవ్వాలంటూ సూచించాడు. ఈ వారం నామినేషన్స్ మీ అంచనాలను తలకిందులు చేస్తుందంటూ చెప్పాడు. ఇది చేయడానికి కేవలం 5 నిమిషాల సమయం మాత్రమే ఉందంటూ ప్రోమో మొదలైంది. మీరు నామినేట్ చేయాలనుకుంటున్న ఒకరిని.. బలమైన మీ కారణాలతో అక్కడున్న షవర్ దగ్గర కూర్చోబెట్టాలని సూచించాడు బిగ్‌బాస్. దీంతో నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది.
ఇమ్మూ స్ట్రాటజిక్ మూవ్..
ముందుగా వచ్చిన కెప్టెన్ ఇమ్మాన్యుయేల్ భరణిని నామినేట్ చేశాడు. బిగ్‌బాస్ నా నామినేషన్ భరణి అన్న. మీరు ఎందుకో ఆలోచించి వెనకాడుతున్నారేమో అంటూ పాయింట్స్ చెప్పాడు. నామినేషన్స్ చేయకుండా.. ఇక నుంచి మీరు కొత్త భరణిని చూస్తారని చెప్పారు. మీరు మళ్లీ వచ్చాక కనిపించిన ఫైర్.. ఇప్పుడు తగ్గిపోయిందంటూ వివరించాడు. నాకంటే తనూజ బెటర్ అని నిర్ణయం తీసుకున్నానంటూ భరణి చెప్పగా.. నేనెందుకు అవ్వకూడదని మీరు అనుకోవట్లేదంటూ ఇమ్మూ అడిగాడు. మీకు స్టాండ్ తీసుకోవట్లేదు అంటే అదే చెప్తున్నానంటూ భరణి చెప్పాడు. అవతలి పర్సన్‌కి మీరు ఎంత చేశారో మీకు తెలుసు. అన్నాడు.
దివ్యని టార్గెట్ చేసిన రీతూ
రీతూ దివ్యని నామినేట్ చేసింది. ఇద్దరూ ముగ్గురిని పెట్టుకుని.. ఒక గ్యాంగ్ అప్ అయి ఆట ఆడుతున్నావంటూ నామినేట్ చేసింది. అంతేకాకుండా నువ్వు వాళ్లని కమాండ్ చేస్తున్నావు.. ట్రైన్ టాస్క్‌లు కూడా నువ్వు చెప్తున్నట్లు వాళ్లు గేమ్ ఆడుతున్నారంటూ.. నువ్వు చెప్పింది వాళ్లు చేయాలన్నట్టు ఉంటావు. నువ్వు చెప్పింది వాళ్లు చేయాల్సిందే అనే రీతిలో ఉంటావు అంటూ రీతూ చెప్పింది. వాళ్లు నా మాట వింటే నీకు వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి? వాళ్లేమైనా చిన్న పిల్లలా? అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చింది దివ్య.
తర్వాత వచ్చిన గౌరవ్ సంజనని నామినేట్ చేశాడు. సెల్ఫిష్‌గా ఉంటారు. మీ ఫుడ్ గురించే ఆలోచిస్తారు. సెల్ఫ్ డ్రామా చేస్తారంటూ నామినేట్ చేశాడు. కళ్యాణ్ నిఖిల్‌ని నామినేట్ చేశాడు. నువ్వు గేమ్‌లో ఇంకా స్ట్రాంగ్ అవ్వాలంటూ రీజన్స్ చెప్పాడు. మరి ఈ వారం ఎవరూ నామినేషన్స్‌లో ఉన్నారో.. ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ జరిగాయో పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.






















