Bigg Boss Telugu Today Promo : బిగ్‌బాస్ 6వ వారం నామినేషన్స్.. వైల్డ్ కార్డ్స్ సహాయంతో రాముని, భరణిని నామినేట్ చేసిన రీతూ
Bigg Boss Telugu 9 Latest Promo : బిగ్‌బాస్‌లో 6వారానికి గానూ నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఈ వారం ఎలా జరుగుతుందో వైల్డ్ కార్డ్స్ ఏమి చేస్తున్నారో చూసేద్దాం.

Bigg Boss Telugu 9 Day 37 Nominations Promo : బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగులో 6వ వారం నామినేషన్స్ జరుగుతున్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీల సహాయంతో ఈ ప్రక్రియ జరుగుతుంది. వైల్డ్ కార్డ్‌లో వచ్చిన వారు టాస్క్ ఆడి.. అంటే పై నుంచి వచ్చే బాల్ పట్టుకుని.. వారిలో తమకు నచ్చిన కంటెస్టెంట్‌కు బాల్ ఇచ్చి.. వారిని నామినేట్ చేయమని చెప్పాలి. వారు ఇద్దరిని నామినేట్ చేస్తే.. వారిలో ఒకరిని వైల్డ్ కార్డ్ మెంబర్ నామినేట్ చేస్తారు. నిన్న ప్రారంభంమైన ఈ నామినేషన్స్ ప్రక్రియ ఈరోజు కూడా కొనసాగుతుంది. దానికి సబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది.
బిగ్‌బాస్ నామినేషన్స్ ప్రోమో
బిగ్‌బాస్‌లో నామినేషన్స్ ప్రక్రియ రెండో రోజూ కూడా కొనసాగనుంది. దానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. దానిలో రీతూ, రాము ఆర్గ్యూమెంట్ జరుగుతుంది. ఇమ్మాన్యూయేల్ అన్న నీకు రూల్స్ చెప్పారు అని రాము చెప్పగా.. ఇద్దరు సంచాలకులు ఉన్నప్పుడు డిసైడ్ చేసుకుని ఒక పాయింట్ చెప్పాలిగా అంటూ రీతూ చెప్పింది. సంచాలకుడివి నువ్వు కదా నువ్వు అయినా చెప్పాలిగా అని అడుగుతుంది. నువ్వు సంచాలక్ అంటావు. మధ్యలో వచ్చి అలా ఆడకూడదు అంటావు. సంచాలక్వి నువ్వు కదా నువ్వు చెప్పాలిగా అంటూ సీరియస్ అవుతుంది. నేను రూల్స్ పెట్టలేదు. ఉన్నవే చెప్పాను అంటాడు రాము.
హోజ్‌లోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాము. మీకు దివ్య తప్పా మరో ప్రపంచం కనిపించట్లేదని మాధురి.. భరణితో చెప్తుంది. బజర్ మోగడంతో కిచెన్‌లో ఉన్న తనూజ.. హే బాల్ అంటూ అరుస్తుంది. ఈ సమయంలో వైల్డ్ కార్డ్స్ అక్కడికి వెళ్లి బాలు పట్టుకునేందుకు చూస్తారు. చివరికి వారి నుంచి మాధురి బాల్ పట్టుకుని.. రీతూకి ఇచ్చింది. రీతూ భరణిని నామినేట్ చేస్తుంది. ఈ మనిషి మాట ఇచ్చాడా.. ఈ మనిషి మాట ఇస్తే అది జరుగుతుంది అనే నమ్మకం మీ దగ్గర నుంచి నేను కోల్పోయానని చెప్తోంది రీతూ. నేను మాట ఇచ్చిన తర్వాత నువ్వు ఎన్ని టాస్క్‌లు ఆడావు అంటూ అడుగుతాడు.
కెప్టెన్సీ టాస్క్ దగ్గర.. మీ అవసరం నాకు ఉంది అనుకున్నప్పుడు మీరు బ్యాక్ స్టెప్ వేశారు అంటుంది రీతూ. రాము, నువ్వు ఉన్నప్పుడు నేను కచ్చితంగా రాముకే సపోర్ట్ చేస్తానంటూ భరణి చెప్తాడు. తర్వాత వచ్చిన సంజన రాముని నామినేట్ చేస్తుంది. అందరి ముందు నేను కళ్లు తిరిగి పడిపోతే.. నేనేమైనా చచ్చిపోతున్నానా? లేదా అక్కడ పడుకుంటే ఓ కేజీ గోల్డ్ దొరుకుతుందా? ఇదేనా నీ హ్యూమానిటీ అంటూ చెప్తుంది. మా చెల్లి, మా అక్క ఉన్నా నేను ఇదే చేసేవాడిని గేమ్ ఈజ్ గేమ్ అంటూ రాము రిప్లై ఇస్తాడు. అలాగే రీతూ దివ్య నిఖితని కూడా నామినేట్ చేస్తుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ ఆసక్తిగా సాగనుంది.






















