Bigg Boss Telugu Today Promo : దివ్వెల మాధురి vs కళ్యాణ్.. పొగరు చూపించింది, అరిచింది ఫైనల్‌గా ఏడ్చేసింది
Bigg Boss Telugu 9 Latest Promo : బిగ్‌బాస్‌ని మరింత ఇంట్రెస్టింగ్గా మార్చేందుకు బిగ్‌బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఇంట్లోకి పంపించాడు. రావడంతోనే దివ్వెల మాధురి గొడవ పెట్టేసుకుంది.

Bigg Boss Telugu 9 Day 36 Promo : బిగ్‌బాస్‌లో ఫ్లోరా షైనీ, శ్రీజ ఎలిమినేట్ అయిపోయారు. కొత్త కంటెస్టెంట్లు వచ్చేశారు. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు మరింత భయంకరంగా పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసేశారు. వారిలో దివ్వెల మాధురి ఒకరు. ఇలా వచ్చిందో లేదో అలా గొడవ స్టార్ట్ చేసేసింది. సోమవారం నామినేషన్స్ కోసం చూసే బిగ్‌బాస్ ఫ్యాన్స్‌కి కొత్త కంటెంట్ ఇచ్చింది. కెప్టెన్ కళ్యాణ్‌తో గొడవకు దిగింది. దానికి సంబంధించిన ప్రోమో విడుదల చేసింది స్టార్ మా.
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో.. దివ్వెల మాధురి vs కళ్యాణ్
Bigg Boss Telugu 9 Day 36కి సంబంధించి మొదటి ప్రోమో వచ్చేసింది. వంట చేస్తున్న మాధురి.. తింటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది. కళ్యాణ్ కుర్చీ వెనక్కి లాగి.. కూర్చోండి అంటాడు. దానికి మాధురి పర్లేదు చెప్పండి అంటుంది. కూర్చోండి పర్లేదు అని కళ్యాణ్ అనగా.. నేను మళ్లీ వెళ్లాలి అందుకే కూర్చోవట్లేదు అని చెప్తుంది. వెంటనే కూర్చోకపోతే ఊరుకోరా అంటూ అడుగుతుంది. దాంతో కళ్యాణ్ ఎందుకొచ్చిందిలే అని.. టైమ్ ఇంత అయింది. ఈరోజు ఇలా జరిగింది. రేపటి నుంచి షెడ్యూల్ ఇలా ఉండదు అని చెప్తాడు. దీంతో మాధురి.. నేను ఇక్కడికొచ్చి అరగంట కూర్చొన్నాను. అప్పుడేమి చేశారు మీరు. లేట్ అవుతుందని తెలియదా అంటూ అడిగింది. అందరూ షాక్ అవుతారు.
ఒక్క నిమిషం. మీరు ఇలా మాట్లాడితే నేను వేరుగా మాట్లాడాల్సి వస్తుందని అంటాడు కళ్యాణ్. అనగానే మాట్లాడండి.. నేను అక్కడికొచ్చి అరగంట కూర్చొన్నాను కదా అంటూ రిప్లై ఇస్తుంది. ఆ అరగంట ముందు నుంచి 2 గంటలు కూర్చొన్నాము అంటే.. గుడ్ మార్నింగ్ సాంగ్ తర్వాత నేను 15 నిమిషాల్లో రెడీ అయి వచ్చాను. అప్పుడు దివ్య కల్పించుకుని.. మీరు ఎవరూ లేరు ఇక్కడ.. కుకింగ్ టీమ్ లేదు అంటూ చెప్తుంది. ఇప్పుడు గొడవపడాలని చెప్పట్లేదు అంటుంది. కుకింగ్ టీమ్‌లో నేను ఒక్కదానినే లేను. మిగిలిన వాళ్లు ఉన్నారు అంటే.. మిమ్మల్నే మెయిన్ చెఫ్‌గా పెట్టుకున్నాం కదా.. మీరు వాళ్లకి చెప్తే వాళ్లు చేసేస్తారు అంటూ దివ్య రిప్లై ఇస్తుంది. దానికి మీరే రేషన్ మేనేజర్ కదా ముందు కావాల్సినవి అక్కడ పెట్టేస్తే చేసేస్తారు అంటూ వెళ్లిపోతుంది మాధురి.
మాధురి vs దివ్య
కిచెన్ దగ్గరికి వెళ్లి వేరేగా మాట్లాడాల్సి వస్తాది అంటే ఎలా మాట్లాడతారు అంటూ భరణితో చెప్తుంది. అక్కడి వచ్చిన కళ్యాణ్, దివ్య రియాక్ట్ అవుతారు. మీరు వచ్చి కూర్చోమని చెప్పిన దానికే కళ్యాణ్ అలా అన్నాడు అంటూ దివ్య స్టాండ్ తీసుకుంటుంది. ఆర్గ్యూమెంట్‌లో కళ్యాణ్ వెటకారమే అంటూ అరిచేసరికి.. మాధురి టోన్ మార్చి ఏయ్ ఏంటి అరుస్తున్నావు అంటూ సీరియస్ అవుతుంది. ఇదే సమయంలో దివ్య, మాధురి మధ్య కూడా సీరియస్‌గా ఆర్గ్యూమెంట్ జరిగింది. అంతా అయిపోయాక మళ్లీ ఏడ్చేసింది మాధురి. భరణి దివ్య, కళ్యాణ్‌కు సర్ది చెప్పేందుకు వెళ్తాడు. కానీ తప్పు మాది కాదంటూ వారు చెప్పడంతో ప్రోమో ముగిసింది. నామినేషన్స్ సంబంధించిన ప్రోమో రావాల్సి ఉంది.






















