Bigg Boss Telugu Today Promo : కింగ్ సినిమా రేంజ్లో బొమ్మ గీసిన సుమన్ శెట్టి.. పర్ఫెక్ట్గా గీసావంటూ కామెడీ చేసిన బిగ్‌బాస్
Bigg Boss Telugu 9 Day 31 Latest Promo : బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. కంటెస్టెంట్లు బొమ్మ గీస్తే.. చూసేవాళ్లకి మతిపోవాల్సిందే. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు.

Bigg Boss Telugu 9 Day 31 Promo : బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగులో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వస్తున్నాయంటూ లోపలున్న కంటెస్టెంట్లకు డేంజర్ ఉందంటూ బిగ్‌బాస్ టాస్క్‌లు పెడుతున్నారు. ఇమ్యూనిటీలో ఇమ్మాన్యుయేల్, కెప్టెన్ రాము తప్పా అందరూ డేంజర్ జోన్లో ఉన్నారంటూ చెప్పారు. అంతేకాకుండా ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రావడంతో పాటు.. డబుల్ ఎలిమినేషన్ జరగనుందనే టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ టాస్క్‌ల్లో ఎవరైతే మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తారో.. వారే నెక్ట్స్ వారానికి సేఫ్ అవుతారని.. టాస్కుల్లో అందరూ బాగా పాల్గొంటున్నారు. నిన్న చేసిన మిస్టేక్ రిపీట్ కాకుండా చూసుకుంటున్నారు.
బిగ్‌బాస్ తాజా ప్రోమో ఇదే..
ఉదయం బిగ్‌బాస్ బ్యాలెన్స్ టాస్క్ పెట్టగా.. సెకండ్ టాస్క్‌గా డ్రాయింగ్ రిలేటడ్ టాస్క్ పెట్టాడు. మునుపెన్నడు లేని కొత్త కొత్త టాస్కులను ఈ సీజన్లో ట్రై చేస్తున్నాడు బిగ్‌బాస్. అయితే ప్రోమో ఎలా మొదలైందంటే.. నేను మీకు ఇస్తున్న టాస్క్ ఏమిటంటే మ్యాచ్ ఇట్ విన్ ఇట్ అంటూ బిగ్‌బాస్ అనౌన్స్ చేశాడు. దీనిలో భాగంగా పోటీదారులు చేయాల్సింది ఏంటంటే.. పోటీదారుల్లో ఒకరు యాక్టివిటీ ఏరియాలో ఉన్న ఆర్ట్ గ్యాలరీకి వెళ్లాలి. అక్క రెడ్ క్లాత్ మీద ఉన్న బొమ్మలను బాగా చూడాలి. వాటిని బయటకొచ్చి.. బొమ్మ గీసి చూపించాలి.
బయట బొమ్మను చూసి.. లోపల ఉన్న బొమ్మలతో మ్యాచ్ అయ్యే వాటిని పోటీదారుల గేమ్ పార్టనర్స్ పట్టుకురావాలి అన్నాడు. రెడ్ క్లాత్ మీద ఏది అయితే ఉందో.. మేము దానినే గీశాము. అయితే లోపల అలాంటివే చాలా ఉంటాయి కాబట్టి.. వాళ్లు ఎలా గుర్తిస్తారో చూడాల్సి ఉంది. బొమ్మ గీసిన సంజన.. ఫ్లోరా రా వచ్చి చూడు అని చెప్తే.. మీరు నేను గీసింది ఎలా చూపిస్తారంటూ సీరియస్ అయింది తనూజ. సంచాలక్ అలా అయితే ఇది ఫౌలే కదా అంటే.. అదే వాళ్ల స్ట్రాటజీ అమ్మ అంటూ ఇమ్మూ రిప్లై ఇచ్చాడు.
సుమన్ శెట్టి కామెడీ
దీనిలో భాగంగా సుమన్ శెట్టి ఓ డ్రాయింగ్ గీశాడు. చూసిన శ్రీజ లోపలికి వెళ్లి ఒకటి తెచ్చింది. బిగ్‌బాస్ మీరు చూసిన వాటిలో ఎవరు తెచ్చింది కరెక్ట్ అని అడిగితే అందరూ శ్రీజ తెచ్చింది కరెక్ట్ అని చెప్తారు. శ్రీజ సంతోషిస్తుంది. ఈ సమయంలో బిగ్‌బాస్ సుమన్ శెట్టి గీసిన బొమ్మని ఉద్దేశిస్తూ.. సేమ్ మీరు గీసినట్లే ఉందని కామెడీ చేస్తాడు. దీంతో అందరూ నవ్వేస్తారు. తర్వాత ఇమ్మూ కూడా సుమన్ డ్రాయింగ్‌పై కామెడీ చేస్తాడు. సుమన్ ప్రభంజనం అంటూ బేస్ వాయిస్‌లో చెప్తాడు. దీంతో ప్రోమో ముగిసింది. అయితే లైవ్ ప్రకారం ఈ టాస్క్‌లో ధరణి, దివ్య గెలిచారు. పూర్తి ఎపిసోడ్ కోసం రాత్రి వరకు వేచి చూడాల్సిందే.






















