Bigg Boss 9 Telugu Today Episode - Day 3: బిగ్ బాస్ 9లో మూడో రోజు... వెక్కి వెక్కి ఏడ్చిన తనూజ... గుడ్డుతో గొడవలు, తగువు పెట్టి తమాషా చూసిన సంజన
Bigg Boss Telugu 9 Day 3: బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు డే 3 ఎపిసోడ్‌లో సంజన చేసిన రచ్చ.. హౌస్ అట్టుడుకిపోయేలా చేసింది. ఇంతకీ సంజన ఏం చేసింది? ఆమె వల్ల ఎవరెవరు ఎఫెక్ట్ అయ్యారంటే..

Bigg Boss Telugu 9 - Day 3 Episode 4 Review: బిగ్ బాస్ ఇంట్లో మొదటి వారం నామినేషన్ ప్రక్రియ కంటే సంజన పెట్టిన మంటలు కార్చిచ్చులా మారిపోతోంది. మూడో రోజు సంజన గుడ్డు లేపేయడం, తినేయడంతో పెద్ద గొడవే జరిగింది. నామినేషన్ కంటే సంజన చేస్తున్న చేష్టలు, పెడుతున్న చిచ్చులే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఇక సంజనను ఇంట్లోకి రావడాన్ని బహిష్కరించారు ఓనర్స్. సంజన గుడ్డు తినేయడంతో భరణి, హరిష్ మధ్య గొడవ.. తనూజ, రీతూ, భరణి ఇలా అందరి మధ్య గొడవలు జరిగాయి. అసలు బుధవారం నాటి ఎపిసోడ్ ఎలా సాగిందో ఓ సారి చూద్దాం.
మొదటి వారం నామినేషన్ ప్రక్రియను కంటిన్యూ చేస్తూ భరణి, ఇమాన్యుయేల్ పోటీ పడ్డారు. అందులో భరణి గెలిచాడు. ఆ తరువాత సంజనని నామినేట్ చేస్తున్నట్టుగా చెప్పి సుత్తిని శ్రీజకు ఇచ్చాడు. కానీ శ్రీజ మాత్రం సంజనను కాకుండా తనూజని టార్గెట్ చేసింది. వంట సరిగ్గా చేయడం లేదు.. చిరాకు మొహంతో వంట చేస్తోంది, అడిగింది చేసి పెట్టడం లేదు.. రీతూ విషయంలోనూ తప్పు చేసింది అంటూ ఇలా కారణాలు చెప్పి నామినేట్ చేసింది.
Also Read: బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ల రెమ్యూనిరేషన్ లిస్ట్... భరణి టాప్, కామనర్స్‌కి ఎంత ఇస్తున్నారో తెలుసా?
శ్రీజ, హరీష్, ప్రియ, పవన్ ఇలా అందరూ తనూజను టార్గెట్ చేశారు. అయినా తనూజ మాత్రం ఎక్కడా తగ్గలేదు. అయితే రీతూ మ్యాటర్‌లో మాత్రం తనూజ మరింతగా బాధపడినట్టుగా ఉంది. తనూజ మ్యాటర్‌లో రీతూ రివర్స్ అయింది. ఇక హరీష్ అయితే వంట వండేవాళ్లు అన్నపూర్ణమ్మలా, ప్రేమగా వడ్డించాలి.. తనూజ అలా చేయడం లేదు.. ఆమె బాడీ లాంగ్వేజ్ బాగా లేదంటూ విమర్శలు చేశాడు. ఆ కామెంట్లకు తనూజ అయితే వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఆమెను ఇమ్ము, సంజు, సుమన్ శెట్టి చాలానే ఓదార్చే ప్రయత్నం చేశారు.
సుమన్ శెట్టి టాస్కులో విన్ అయిస సంజనను నామినేట్ చేయాలని అనుకున్నాడు. సుత్తిని ప్రియకు అందించాడు సుమన్ శెట్టి. కానీ ప్రియ మాత్రం రాముని నామినేట్ చేసింది. ఫుడ్ తినొద్దు.. రూల్స్ బ్రేక్ అన్న దానికే రాముని నామినేట్ చేసిన ప్రియ తన అసలు రూపాన్ని బయటపెట్టుకుంది. అసలు ఆ రీజన్‌కు రాముని నామినేట్ చేయాల్సిన పని కూడా లేదు. ఇక భరణి ఒక్కడే నామినేట్ కాకపోవడంతో బిగ్ బాస్ ఆఫర్ ఇచ్చాడు. సుత్తి అందుకోకుండా డేంజర్ జోన్లోకి మనీష్, పవన్ వచ్చారని ఆ ఇద్దరిలోంచి ఒకరిని నామినేట్ చేయమని చెప్పాడు. దీంతో పవన్ బిహేవియర్, నిర్లక్ష్యపు ధోరణి నచ్చడం లేదని నామినేట్ చేశాడు.
అలా ఈ మొదటి వారంలో సంజన, రీతూ, శ్రష్టి, సుమన్, ఇమ్ము, తనూజ, ఫ్లోరా, రాము, పవన్ ఇలా అందరూ నామినేషన్‌లోకి వచ్చారు. ఇక ఈ నామినేషన్ తంతు ముగిసిన తరువాత సంజన గుడ్డు గొడవ మొదలైంది. గుడ్డు చెప్పకుండా తినడంతో ఓనర్స్ అంతా కూడా ఫైర్ అయ్యారు. టెనెంట్స్‌ని ఇంట్లోకి రానివ్వము అని ఆర్డర్ వేశారు. దీంతో సంజన గుడ్డు తినేసిందని రాము ఆ తరువాత చెప్పేశాడు. అప్పటికే గొడవ పెద్దగా మారిపోయింది. సందులో సందు అన్నట్టుగా హరీష్, భరణి మధ్య పెద్ద వాగ్వాదమే జరిగింది.
Guddu Poyindhi!🥚😬Tenants are banned from the House🚫🏠
— Starmaa (@StarMaa) September 10, 2025
Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar#BiggBossTelugu9 #StreamingNow #StarMaaPromo pic.twitter.com/RrkDAC7srg
చివరకు ఆ గుడ్డు తిన్న విషయం భరణి, తనూజ, రాములకు తెలుసు అంటూ సంజన బాంబ్ పేల్చింది. దీంతో అంతా అవాక్కయ్యారు. హెల్త్ సమస్యలు ఉన్నాయి.. అందుకే గుడ్డు తింటున్నాను అని చెబితే తనూజ కూడా సరే అని వదిలేసిందట. ఆ విషయం తరువాత భరణికి చెప్పిందట. అలా మొత్తానికి తనూజ, భరణి, రాముల్ని కూడా తనతో పాటు ఇరికించేసింది సంజన. ఇలా సంజన మ్యాటర్ జరుగుతూ ఉంటే మధ్యలో రీతూ వచ్చి భరణి, తనూజతో గొడవ పెట్టుకుంది. ఇక ఫ్యామిలీ మ్యాటర్ మధ్యలోకి వస్తే.. తన ఫ్యామిలీ గురించి మాట్లాడొద్దు అంటూ సంజన ఏడ్చేసింది. ఫ్యామిలీ గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసా? ఇలానే ఉంటుంది? అంటూ మధ్యలో ఫ్లోరా షైనీ కూడా దూరింది.
అలా ఓ గుడ్డుతో మొదలైన ఈ గొడవ చివరకు అందరినీ కదిలించింది. తనూజ రీతూ మధ్య మళ్లీ గొడవ.. రీతూ మీద భరణి ఫైర్ అవ్వడం.. హరీష్ భరణి మధ్య గొడవలు జరగడం ఇలా అన్నీ హైలెట్ అయ్యాయి. ఒక్క సంజన వల్ల ఈ రోజు బిగ్ బాస్ ఇల్లు అంతా కూడా అట్టుడికిపోయింది. ఇలాంటి ఓ డిఫరెంట్ క్యారెక్టర్, తగువులు పెట్టి తమాషా చూసే క్యాండిడేట్‌ను జనాలు ఏం చేస్తారో చూడాలి.
Also Read: బిగ్ బాస్ సీజన్ 9లో సామాన్యలకు వేలల్లో... సెలెబ్రిటీలకు లక్షల్లో... ఎవరి రెమ్యూనరేషన్ ఎంతంటే?





















