Bigg Boss Telugu 8 Day 10 Task : బిగ్‌బాస్‌లో ఈ వారం రేషన్‌కి ప్లాట్ ట్విస్ట్.. చీఫ్స్కి న్యూ టాస్క్.. కంటెస్టెంట్లకు లెమన్ పిజ్జా.. గెలిచేదెవరో?
Bigg Boss Telugu 8 : బిగ్‌బాస్ హౌజ్‌లో ఏ లగ్జరీ కావాల్సిన కష్టపడాల్సిందేనంటూ నాగార్జున చెప్పారు. దానికి తగ్గట్లుగానే ఈవారం రేషన్‌కి కొత్త ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. టాస్క్ ఏంటంటే..
Bigg Boss Telugu 8 Task for Weekly Ration : నామినేషన్స్ పూర్తి అయిన తర్వాత బిగ్‌బాస్ మంగళవారం ఎపిసోడ్లో ఓ టాస్క్ ఇచ్చాడు. ఫుడ్ మొత్తాన్ని స్టోర్ రూమ్‌లో పెట్టాలని ఆదేశించాడు. నచ్చిన ఫుడ్ ఎంత కావాలంటే అంత తినేయమని చెప్పాడు. బజర్ మోగించి.. ఫుడ్‌ని అక్కడే ఉంచేయాలని చెప్పి.. దానిని ఎక్స్టెండ్ చేస్తూ.. బుధవారానికి టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. దానికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఈ ప్రోమో ఎలా సాగిందంటే..
గ్రూప్‌లుగా డివైడ్ చేసి
ఈ సీజన్లో కెప్టెన్సీ లేకుండా చీఫ్లుగా గ్రూప్స్‌ని డివైడ్ చేసిన బిగ్‌బాస్.. వారికి బెనిఫిట్స్ ఇస్తూ.. క్లాన్స్ని సిద్ధం చేసుకునేలా టాస్క్‌లు ఇస్తున్నాడు. ఈ బెనిఫిట్స్ కోసం క్లాన్స్, చీఫ్స్ కష్టపడుతున్నారు. అయితే ఈ ఎపిసోడ్లో మాత్రం చీఫ్స్కి ముందు టాస్క్ ఇచ్చి.. అనంతరం క్లాన్స్ టాస్క్‌తో దీనిని లింక్ చేశాడు. ఇలాంటి ట్విస్ట్ నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అనొచ్చు.
చీఫ్స్కి మాత్రమే..
యాక్షన్ ఏరియాలో ఉంచిన ఫుడ్‌ని.. అక్కడున్న బుట్టల్లో బజర్ మోగించక ముందు వేసుకోవాలని బిగ్‌బాస్ క్లాన్స్‌కి ఆర్డర్ ఇచ్చాడు. ఈ వారం రేషన్‌ని ఇలా దక్కించుకోవాలని చెప్పాడు. ఈ వారానికి సరిపడ ఆహారాన్ని తీసుకురావడం చీఫ్ బాధ్యత అంటూ తెలిపాడు. సైరన్ మోగడంతో యశ్మీ లోపలికి వెళ్లి ఫుడ్ సేకరించగా.. సెకండ్ సైరన్‌కి నైనిక, మూడో సైరన్‌కి నిఖిల్ వెళ్లి.. వారానికి కావాల్సిన ఫుడ్‌ని బజర్ మోగించే లోపు సేకరించారు. అయితే ఈ సేకరించిన ఫుడ్‌ని దక్కించుకునేందుకు క్లాన్స్‌కి కొన్ని ఛాలెంజ్‌లు ఇచ్చాడు.
క్లాన్స్‌కి లెమన్ పిజ్జా..
చీఫ్స్ సేకరించిన ఫుడ్ పొందాలంటే.. క్లాన్స్ సభ్యులు లెమన్ పిజ్జా ఆడి.. ఫుడ్‌ని పొందాలంటూ ట్విస్ట్ పెట్టాడు. లెమన్ పిజ్జా అంటూ న్యూ టాస్క్ పెట్టాడు. ఏ క్లాన్ సభ్యులైతే మూడు నిమ్మకాయలను మేజ్లోపలి నుంచి బయటకు తెస్తారో వారికి పాయింట్ వస్తుందని తెలిపాడు. అయితే ఈ మేజ్న గాల్లోనే తాడులతో హ్యాండిల్ చేయాలి. ఇలా ఏ క్లాన్ సభ్యులు ఎన్ని రౌండ్స్‌లో ఎన్ని నిమ్మకాయలు తెస్తారో.. వారు విజేతలుగా నిలిచి.. వారు సేకరించిన ఫుడ్‌ని పొందుతారంటూ బిగ్‌బాస్ తెలిపాడు.
యశ్మీ టీమ్ నుంచి అభయ్ నవీన్, పృథ్వీ ఈ ఛాలెంజ్ ఫేస్ చేశారు. నిఖిల్ టీమ్ నుంచి నిఖిల్, మణికంఠ ఈ టాస్క్ ఆడగా.. నైనిక టీమ్ నుంచి నబిల్, సీత ఈ ఛాలెంజ్‌ని ఫేస్ చేశారు. శేఖర్ బాష ఈ టాస్క్‌కి సంచాలకుడిగా వ్యవహరించాడు. మిగిలిన సభ్యులు తమ క్లాన్స్ని సపోర్ట్ చేస్తూ కనిపించారు. దీంతో ప్రోమో ముగిసింది. మరి ఈ టాస్క్‌లో ఎవరు గెలిచారు. రేషన్ ఎవరిని వరించిందో తెలుసుకోవాలంటే ఎపిసోడ్ విడుదలయ్యేవరకు ఆగాల్సిందే.