Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ గౌతమ్ మెడపై గాయాలు - తేజను తిట్టిపోస్తున్న ప్రేక్షకులు
బిగ్ బాస్ రియాలిటీ షోలో టాస్కులు ఆడుతున్న సమయంలో కంటెస్టెంట్స్‌కు గాయాలు అవ్వడం సహజం. కానీ ఆ గాయాలు ఏ రేంజ్‌లో ఉంటాయి అన్నది తాజాగా గౌతమ్, తేజ మధ్య జరిగిన పోరు చూస్తే తెలుస్తోంది.
బిగ్ బాస్ అనే రియాలిటీ షోలో టాస్కుల సమయంలో కంటెస్టెంట్స్‌కు గాయాలు అవ్వడం సహజం. ఎక్కువశాతం ఆ గాయాలు.. ఇతర కంటెస్టెంట్స్ వల్లే అవుతాయి. అవి ఉద్దేశపూర్వకంగా జరగకపోయినా.. చాలావరకు దానివల్ల కంటెస్టెంట్స్‌కు చాలారోజులపాటు ఆ నొప్ప ఉండిపోతుంది. తాజాగా టేస్టీ తేజ వల్ల గౌతమ్‌కు కూడా అలాంటి గాయమే జరిగింది. టాస్కులో గౌతమ్‌కు అడ్డుకోవాలనుకున్న తేజ.. తనను బెల్ట్‌తో కొట్టాడు. అది గౌతమ్‌కు గట్టిగానే తగిలినా.. టాస్క్ సమయంలో డైవర్ట్ అవ్వకుండా దానిమీదనే ఫోకస్ పెట్టాడు. కానీ తేజ చేసిన ఈ పనికి ఆడియన్స్ మాత్రమే కాదు.. కంటెస్టెంట్స్‌కు కూడా కోపం వచ్చింది.
బిగ్ బాస్ సీజన్ 7లో నాలుగో పవర్ అస్త్రా కోసం కంటెస్టెంట్స్ పోటీపడడం మొదలుపెట్టారు. అదే క్రమంలో ముందుగా బిగ్ బాస్.. కంటెస్టెంట్స్‌కు ఒక టాస్క్ ఇచ్చారు. ఇప్పటివరకు పవర్ అస్త్రా సాధించుకున్న సందీప్, శివాజీ, శోభా శెట్టి బ్యాంకర్లుగా వ్యవహరించగా.. వారి దగ్గర ఉన్న కాయిన్స్‌ను మిగతా కంటెస్టెంట్స్ లోన్ తీసుకోవాలి. అలా ఏ కంటెస్టెంట్ దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉంటాయి అనేది కూడా బిగ్ బాస్ కౌంట్ చేసుకుంటారు. ఆ తర్వాత బిగ్ బాస్ కాయిన్స్ శబ్దం చేయగానే.. అక్కడ ఏర్పాటు చేసిన బిగ్ బాస్ ఏటీఎమ్ బజర్‌ను నొక్కడానికి కంటెస్టెంట్స్ అంతా పోటీపడాలి. ఎవరు ముందుగా బజర్ నొక్కితే.. వారికి టాస్క్ ఆడే అవకాశం ఉంటుంది. అలా బజర్ నొక్కిన కంటెస్టెంట్.. వారితో పాటు ఇంకొక కంటెస్టెంట్ కూడా ఆడే అవకాశం ఇవ్వచ్చు. ఆ ఇద్దరు కలిసి టీమ్‌గా ఆడవచ్చు. అలా ముందుగా బజర్ నొక్కిన అమర్‌దీప్.. తన టీమ్‌గా గౌతమ్‌ను ఎంచుకున్నాడు.
ఎలాగైనా ఆపాలి అనుకొని..
అమర్‌దీప్, గౌతమ్ కలిసి వారి ప్రత్యర్థులుగా రతిక, టేస్టీ తేజను ఎంపిక చేసుకున్నారు. ఈ రెండు టీమ్స్.. ఒకనొకరు కెమెరా ముందుకు వెళ్లి ఫోటోలు తీసుకోకుండా ఆపాలి. ముందుగా రతిక, తేజ.. ఫోటోలు తీసుకోవడానికి ప్రయత్నించగా.. అమర్‌దీప్, గౌతమ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అమర్, గౌతమ్‌కు ఫోటోలు తీసుకునే టర్న్ వచ్చింది. రతిక, తేజ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. రతిక.. అమర్‌దీప్‌ను అడ్డుకునే ప్రయత్నం చేసింది. అందులో తను చాలావరకు సక్సెస్ అయ్యింది కూడా. గౌతమ్‌ను అడ్డుకోవడానికి తేజ ప్రయత్నం చేశాడు. అదే క్రమంలో గౌతమ్ నడుముకు ఉన్న బెల్ట్ ఊడిపోయి తేజ చేతికి వచ్చింది. దీంతో గౌతమ్‌ను ఎలా అయినా ఆపాలి అని ఆ బెల్ట్‌తో తన మెడ పట్టుకొని ఆపబోయాడు. దాని వల్ల గౌతమ్ మెడకు పెద్ద గాయమే తగిలింది.
Em Luchaa Game ra needhii #Shivaji thu 💦 @StarMaa Pls Vadni bayataki pampichandi #Goutham Ur Really Great brother @iamnagarjuna sir Shivaji & Teja vodhaladhu sir sat plss pls #BiggBoss7Telugu pic.twitter.com/AW9yWWI2ed
— సైనికుడు (@sainikudu_cult) September 28, 2023
శుభశ్రీ ఎమోషనల్..
అంత గాయం తగిలినా కూడా గౌతమ్.. స్మైల్‌తో ఫోటోలు తీసుకున్నాడు. అదంతా చూసి కంటెస్టెంట్స్.. గౌతమ్‌ను ప్రోత్సహించారు. తన మెడకు జరిగిన గాయాన్ని చూసి శుభశ్రీ ఎమోషనల్ కూడా అయ్యింది. ఆ గాయం చూసిన తర్వాత తేజ.. ఇంకా గౌతమ్‌ను ఆపడానికి ప్రయత్నించలేదు. ఫోటోలు తీసుకుంటుంటే ఆపలేదు. అయినా కూడా కంటెస్టెంట్స్ అంతా తేజను తిట్టారు. అలా ఎలా చేశాంటూ సీరియస్ అయ్యారు. కంటెస్టెంట్స్ మాత్రమే కాదు.. ప్రేక్షకులకు కూడా తేజ చేసిన ఈ పని నచ్చలేదు. తేజను గౌతమ్ ఆపడానికి ప్రయత్నించినప్పుడు కూడా బెల్ట్ తెగిపోయింది. అయినా కూడా గౌతమ్.. తేజకు ఏ గాయం తగలకుండా ఆపడానికి ప్రయత్నించాడని గుర్తుచేసుకున్నారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial