అన్వేషించండి

Bigg Boss Season 7 Latest Promo: ఓరి వీరి వేషాలో, చూస్తుంటునే డోకు వస్తోందిగా - వింత అవతారాల్లో ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్లు, దెయ్యం పిల్లగా ప్రియాంక!

బిగ్ బాస్ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి కంటెస్టెంట్స్ ఏదైనా వెనకాడకుండా చేయాలి. అలాగే తాజాగా చిత్రవిచిత్రమైన గెటప్స్ వేసి గాలా ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు.

బిగ్ బాస్ సీజన్ 7 అప్‌కమింగ్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. ఈ ప్రోమోలో చూపించిన విధంగా బిగ్ బాస్ హౌజ్‌లో ఒక గాలా ఈవెంట్ జరగనుంది. గాలా ఈవెంట్ అంటే కంటెస్టెంట్స్ అంతా డిఫరెంట్‌గా గెటప్స్ వేసుకొని ర్యాంప్ వాక్ చేయాలి. ఏ కంటెస్టెంట్ అయితే అందరికంటే ఎక్కువ డిఫరెంట్‌గా గెటప్ వేసుకుంటారో.. వారే నాలుగో పవర్ అస్త్రా కోసం పోటీపడే మూడో కంటెండర్ అవుతారని బిగ్ బాస్ స్పష్టం చేశారు. దీంతో కంటెస్టెంట్స్ అంతా చిత్రవిచిత్రమైన గెటప్స్‌లో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడానికి మాత్రమే కాదు.. భయపెట్టడానికి కూడా రెడీ అయ్యారు. ఈ టాస్క్ కోసం వారిలోనే క్రియేటివిటీని బయటికి తీశారు.

విచిత్రమైన గెటప్స్..
గాలా ఈవెంట్‌లో సందీప్, శోభా శెట్టి సంచాలకులుగా, హోస్టులుగా వ్యవహరించనున్నారు. ఇక కంటెస్టెంట్స్ వేసుకున్న గెటప్స్ విషయానికొస్తే.. ముందుగా టేస్టీ తేజ కిచెన్‌లోని కూరగాయలు, ఆకుకూరలు అన్నీ కలిపి ఒక డ్రెస్‌లాగా తయారు చేసుకున్నాడు. కంటెస్టెంట్స్‌తో పాటు ఆడియన్స్‌ను కూడా సరదాగా భయపెట్టాలనుకున్న ప్రియాంక.. కాస్త విచిత్రంగా, ఒక దెయ్యంలాగా రెడీ అయ్యింది. అమర్‌దీప్ అయితే సగం అమ్మాయిలాగా, సగం అబ్బాయిలాగా డ్రెస్ చేసుకోవడం మాత్రమే కాకుండా దానికి తగిన మేకప్‌ను కూడా వేసుకొని పర్ఫెక్ట్‌ అనిపించేలా ఉన్నాడు. కంటెస్టెంట్స్ అంతా ఈ చిత్రవిచిత్రమైన గెటప్స్ వేసుకోవడానికి చాలా కష్టపడినట్టు ప్రోమోలో చూపించారు.

బీబీ హౌజ్ దెయ్యం..
పల్లవి ప్రశాంత్ అయితే రెండు ప్లేట్స్ కట్టుకొని.. దానినే డ్రెస్‌లాగా మార్చుకున్నాడు. రతిక.. సర్దార్‌జీలాగా కనిపించడానికి కష్టపడింది. ప్రిన్స్ యావర్ మాత్రం సింపుల్‌గా ఒక ముసలివాడి గెటప్ వేసుకొని వచ్చేశాడు. అందరితో పోలిస్తే యావర్ గెటప్ మాత్రమే చాలా సింపుల్‌గా ఉన్నట్టు అనిపించింది. టేస్టీ తేజ అంటే టేస్టీ ఫుడ్ కాబట్టి సింబాలిక్‌గా చెప్పడానికి అలా రెడీ అయ్యానని చెప్పాడు తేజ. ఇక దెయ్యంలాగా రెడీ అయిన ప్రియాంక.. ‘‘మీరు చెప్తే రావడానికి, మీరు చెప్తే పోవడానికి ఎవరు అనుకుంటున్నారు. బీబీ హారర్ దెయ్యం’’ అంటూ డైలాగులు కొట్టింది. శుభశ్రీ అయితే తన దగ్గర ఉన్న బట్టలు మాత్రమే కాకుండా ఇతర కంటెస్టెంట్స్ దగ్గర ఉన్న బట్టలు అన్నీ కలిపి డ్రెస్సును తయారు చేసి కుట్టించినట్టుగా రెడీ అయ్యింది. ఇలా గాలా ఈవెంట్‌లో డిఫరెంట్‌గా కనిపించడం కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేశారు.

కాసేపు నవ్వుకోవడానికి..
నాలుగో పవర్ అస్త్రా కోసం ముందుగా బిగ్ బాస్ హౌజ్‌ను ఒక బ్యాంకుగా మార్చారు. కాయిన్స్ కలెక్ట్ చేయడం, ఆ తర్వాత టాస్కులు ఆడి.. వేరే కంటెస్టెంట్స్ దగ్గర నుండి ఆ కాయిన్స్ కొట్టేయడం.. ఇదే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్. ఈ టాస్కులో కంటెస్టెంట్స్ అంతా తమ వందశాతం కష్టపడ్డారు. ఇక ఆ ఫిజికల్ టాస్క్ చాలు అనుకున్న బిగ్ బాస్.. గాలా ఈవెంట్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధపడినట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ బ్యాంకు టాస్కులో దెబ్బలు తగిలించుకొని మరీ కష్టపడిన కంటెస్టెంట్స్.. గాలా ఈవెంట్‌తో కాస్త రిలాక్స్ అవ్వనున్నారు. మరి ఇంత విచిత్రమైన గెటప్స్ వేసిన కంటెస్టెంట్స్‌లో ఏ కంటెస్టెంట్ గెటప్.. ఎక్కువగా సంచాలకులను మెప్పిస్తుందో చూడాలి.

Also Read: ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఫుడ్ లొల్లి - శివాజీ దుమ్ముదులిపిన శోభా శెట్టి, యావర్ హర్ట్!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Embed widget