అన్వేషించండి

Bigg Boss Season 7 Day 64 Promo : బిగ్​బాస్​ సామ్రాజ్యంలో నామినేషన్స్​.. ఆగని అమర్​-భోళే, గౌతమ్​-శివాజీ గొడవలు

బిగ్​బాస్​ సీజన్ 7లో ఆసక్తిగా ఎదురు చూసే నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభమైంది. గౌతమ్​కి నాగ్​ అంత క్లారిటీ ఇచ్చినా.. శివాజీపై తన కోపాన్ని వెళ్లడిస్తూనే ఉన్నాడు.

Bigg Boss Season 7 Day 64 Promo : బిగ్​బాస్ సీజన్ 7 ఇంట్రెస్టింగ్​గా సాగుతోంది. బిగ్​బాస్​ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే నామినేషన్స్​ రానేవచ్చాయి. అయితే ఆదివారం జరిగిన ఎపిసోడ్​లో నాగార్జున హౌజ్​మేట్స్​తో పలు ఆటలు ఆడించారు. జిగర్​ తండ మూవీ ప్రమోషన్స్​లో భాగంగా వచ్చిన రాఘవ లారెన్స్, ఎస్​జే సూర్య కూడా బాగా కంటెస్టెంట్స్​తో కలిసి బాగా ఎంటర్​టైన్​మెంట్ ఇచ్చారు. ఎలిమినేషన్​లో భాగంగా రతికా, తేజ ఇద్దరు మిగిలారు. నన్ను పంపించకండి అంటూ రతికా ఏడ్చింది. కానీ చివరకు ఎంటర్​టైనర్​గా పేరు తెచ్చుకున్న టేస్టీ తేజనే ఎలిమినేట్​ అయ్యాడు. 

బిగ్​బాస్​ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నామినేషన్స్​ ప్రోమో రానే వచ్చింది. బిగ్​బాస్ సీజన్-7 64వ రోజుకు సంబంధించిన రాయల్ నామినేషన్స్ మొదటి ప్రోమోను స్టార్​ మా విడుదల చేసింది. మగధీర సాంగ్​తో ఈ ప్రోమోను ప్రారంభించి.. ఈ వారం నామినేషన్స్​ బిగ్​బాస్​ సామ్రాజ్యంలో జరుగుతాయంటూ.. బిగ్​బాస్​ తెలిపారు. దీనిలో భాగంగా.. శోభ, రతిక, ప్రియాంక, అశ్వినీ.. అంటే హౌజ్​లోని నలుగురు ఉమెన్ కంటెస్టెంట్​లు రాజమాతలుగా వ్యవహరించాలని సూచించారు. నామినేషన్లలో వారి నిర్ణయమే తుది నిర్ణయమని తెలిపారు.

నామినేషన్ ప్రక్రియను అమర్ ప్రారంభించాడు. తన మొదటి నామినేషన్​ భోళేకు వేస్తున్నట్లు ఆయన తెలిపాడు. వీక్ కంటెస్టెంట్​ అనే పదానికి మీరు రావడమనేది నాకు నచ్చలేదని.. ఈ పాయింట్​ మీద నామినేషన్ వేస్తున్నట్లు తెలిపాడు. దానికి బదులుగా కొన్ని రాజకీయాల వల్ల తనకు అన్యాయం జరిగిందని భోళే తెలిపాడు. అక్కడ ఎన్ని రాజకీయాలు జరిగినా.. కుట్రలు జరిగినా.. మీరు డిఫెండ్ చేసుకోవాలి. ఇంత డిఫెండ్ చేయాలనే క్లారిటీ ఉన్నప్పుడు.. డిఫెండ్ చేయాలి.. ఆర్గ్యూ చేయాలని చెప్పడానికి నువ్వెవరు అయ్యా అంటూ భోళే ప్రశ్నించాడు. 

తర్వాత గౌతమ్ తన నామినేషన్స్ ప్రారంభించాడు. అర్జున్, యావర్​ను గేమ్​లో ఉంచి.. గౌతమ్​ ఎందుకు వెళ్లిపోవాలని శివాజీని అడిగాడు. నువ్వు యాక్టివ్​ కెప్టెన్ కాబట్టి.. తీశారని తెలిపాడు. యాక్టివ్ కెప్టెన్ అయితే తీసేస్తారా అంటూ గౌతమ్​ అడుగగా.. నిన్ను కాదు.. నిన్ను వద్దు అనుకుంటే.. కెప్టెన్సీ టాస్క్ సమయంలో నీకు దండ వేసే వాడిని.. సందీప్​కి ఎందుకు వేస్తాను అని రివర్స్​ క్వశ్ఛన్ చేశాడు. ఈ టాపిక్​లో అశ్విని గౌతమ్ ఇన్వాల్వ్ చేయగా.. అన్న గురించి నేను ఏమి చెడుగా చెప్పలేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. గౌతమ్​ని కెప్టెన్సీ టాస్క్​లో తొలగించడంపై నా ఇన్వాల్వ్​మెంట్​ పీసంత కూడా లేదని శివాజీ తెలిపాడు. 

అనంతరం ప్రశాంత్​ వచ్చాడు. తను గౌతమ్​ని నామినేట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కెప్టెన్​ అయి ఉండి.. నువ్వు ఎవరో చెప్పిన మాటలు విన్నావు అన్నాడు. గౌతమ్.. ప్రశాంత్​ని ఉద్దేశిస్తూ.. వాడిని కెప్టెన్ చేయలేదని.. ఎన్నోసార్లు వాడు నిన్ను నామినేట్ చేశాడంటూ.. అమర్​ని ప్రశ్నించాడు. ఇదే రీజన్​పై ఇప్పుడు నన్ను నామినేట్​ చేస్తున్నాడంటూ డిఫెండ్ చేసుకున్నాడు. యావర్​ కూడా గౌతమ్​ని నామినేట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ విషయంలో ప్రియాంక నిర్ణయం చెప్పేందుకు ట్రై చేసింది. నిన్న మిస్​ అండర్​స్టాండిగే కాకుండా.. ఇన్​ఫ్లూయెన్స్​ అయ్యావనే పదం నాగ్​సార్​ నుంచి వచ్చింది కాబట్టే అందరూ నిన్ను రీజన్​గా చూపిస్తున్నారు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయమని తెలిపింది. 

యావర్​.. అమర్​ను నామినేట్​ చేస్తున్నట్లు ప్రోమోలో చూపించారు. ఇద్దరి మధ్య ఓ రేంజ్​లో ఆర్గ్యూమెంట్ అవుతుంది. ఎక్కడో రీజన్స్​ తీసుకొచ్చి నన్ను నామినేట్ చేస్తున్నావంటూ.. అమర్​ తెలిపాడు. పంచభూతాల సాక్షిగా అంటూ శివాజీ చెప్తుండగా.. ప్రోమోకు ఎండ్​కార్డ్ పడింది. ఇంతకీ నామినేషన్స్​లో ఎవరున్నారో.. ఎలాంటి కారణాలతో నామినేట్ చేశారో తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే. డిస్నీ ప్లస్​ హాట్​ స్టార్​లో లైవ్​ స్ట్రీమ్​ కూడా చూడొచ్చు. 

">

Also Read : తేజా ఔట్.. రతిక, శోభా సేఫ్ - కన్నీళ్లు పెట్టుకున్న హౌస్‌మేట్స్, నాగ్ ఎమోషనల్

టాప్ హెడ్ లైన్స్

Kadali Satyanarayana: బిగ్ బాస్ 10 తెలుగులోకి రచయిత్రి.. కడలి సత్యనారాయణ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు!
బిగ్ బాస్ 10 తెలుగులోకి రచయిత్రి.. కడలి సత్యనారాయణ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Rocking Rakesh: మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
Patas Hari: పంచ్ పంచ్‌లో కామెడీ.. పటాస్ హరి రియల్ లైఫ్ విషయాలు.. బిగ్ బాస్ ఎంట్రీపై ఊహాగానాలు!
పంచ్ పంచ్‌లో కామెడీ.. పటాస్ హరి రియల్ లైఫ్ విషయాలు.. బిగ్ బాస్ ఎంట్రీపై ఊహాగానాలు!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Embed widget