అన్వేషించండి
Bigg Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్ సేఫ్, బ్లాక్ రోజెస్ అన్నీ మిత్రాకే
నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ముందుగా అరియానాను సేవ్ చేశారు. ఆ తరువాత హౌస్ మేట్స్ తో ఓ గేమ్ ఆడించారు.
![Bigg Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్ సేఫ్, బ్లాక్ రోజెస్ అన్నీ మిత్రాకే Bigg Boss OTT Telugu Nataraj Master safe Bigg Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్ సేఫ్, బ్లాక్ రోజెస్ అన్నీ మిత్రాకే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/06/bb51419679b62419b861f345c74ce3aa_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నటరాజ్ మాస్టర్ సేఫ్
బిగ్ బాస్ ఓటీటీ తెలుగు ఆదివారం ఎపిసోడ్ లో నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు. ఆ తరువాత మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ తో మాట్లాడారు. ఒక్కొక్కరి గురించి చాలా డీటైల్డ్ గా మాట్లాడారు నాగార్జున. బిందు మాధవి చాలా బాగా గేమ్ ఆడిందని పొగిడారు నాగార్జున. యాంకర్ శివపై పంచ్ లు వేశారు నాగ్. దాదాపు అందరి కంటెస్టెంట్స్ గేమ్ తీరుని కొనియాడారు నాగ్. ఆర్జే చైతుని గేమ్ కరెక్ట్ గా ఆడాలని సజెషన్ ఇచ్చారు.
అనంతరం నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ముందుగా అరియానాను సేవ్ చేశారు. ఆ తరువాత హౌస్ మేట్స్ తో ఓ గేమ్ ఆడించారు. కాసేపటికి నామినేషన్ లో ఉన్న మిగిలిన కంటెస్టెంట్స్ చేతులో కొన్ని బాక్స్ లను పెట్టారు. అందులో సేఫ్, అన్ సేఫ్ అనేది ఉంటుందని చెప్పారు. ఈ టాస్క్ లో నటరాజ్ మాస్టర్ సేఫ్ అయ్యారు.
రెడ్ రోజెస్ - బ్లాక్ రోజెస్: హౌస్ మేట్స్ తో రెడ్ రోజెస్ - బ్లాక్ రోజెస్ అనే గేమ్ ఆడించారు. ఇందులో హౌస్ మేట్స్ తమకు నచ్చిన వారికి రెడ్ రోజ్ ఇవ్వాలని, నచ్చనివారికి బ్లాక్ రోజ్ ఇవ్వాలని చెప్పారు. ముందుగా స్రవంతి.. అఖిల్ కి రెడ్ రోజ్, సరయుకి బ్లాక్ రోజ్ ఇచ్చింది. మిత్రా.. స్రవంతికి రెడ్ రోజ్, నటరాజ్ మాస్టర్ కి బ్లాక్ రోజ్ ఇచ్చింది. యాంకర్ శివ.. శ్రీరాపాకకి బ్లాక్ రోజ్, బిందు మాధవికి రెడ్ రోజ్ ఇచ్చాడు. ముమైత్.. చైతుకి బ్లాక్ రోజ్, అజయ్ కి రెడ్ రోజ్ ఇచ్చింది. ఈ క్రమంలో ముమైత్ మరోసారి చైతుతో తన గొడవపై క్లారిటీ ఇచ్చింది.
బిందు మాధవి.. అజయ్ కి బ్లాక్ రోజ్, చైతుకి రెడ్ రోజ్ ఇచ్చింది. హమీద.. మిత్రకు బ్లాక్ రోజ్, తేజస్వికి రెడ్ రోజ్ ఇచ్చింది. సరయు.. చైతుకి రెడ్ రోజ్, స్రవంతికి బ్లాక్ రోజ్ ఇచ్చింది. అషురెడ్డి.. తేజస్వికి రెడ్ రోజ్, శివకి బ్లాక్ రోజ్ ఇచ్చింది. నటరాజ్ మాస్టర్.. అనిల్ కి రెడ్ రోజ్, మిత్రకి బ్లాక్ రోజ్ ఇచ్చాడు. అఖిల్.. అజయ్ కి రెడ్ రోజ్, మిత్రకి బ్లాక్ రోజ్ ఇచ్చాడు. మహేష్.. అరియానాకు రెడ్ రోజ్, ముమైత్ కి బ్లాక్ రోజ్ ఇచ్చాడు. అరియానా.. రెడ్ రోజ్ తేజస్వికి, బ్లాక్ రోజ్ శ్రీరాపాకకి ఇచ్చింది. శ్రీరాపాక.. అషురెడ్డికి రెడ్ రోజ్, మిత్రాకు బ్లాక్ రోజ్ ఇచ్చింది. అనిల్.. అషురెడ్డికి రెడ్ రోజ్, సరయుకి బ్లాక్ రోజ్ ఇచ్చాడు. తేజస్వి.. నటరాజ్ మాస్టర్ కి రెడ్ రోజ్, సరయుకి బ్లాక్ రోజ్ ఇచ్చింది. ఆర్జే చైతు.. హమీదకి రెడ్ రోజ్, మిత్రాకు బ్లాక్ రోజ్ ఇచ్చాడు. అజయ్.. అఖిల్ కి రెడ్ రోజ్, సరయుకి బ్లాక్ రోజ్ ఇచ్చాడు. అందరికంటే ఎక్కువ రెడ్ రోజెస్ తేజస్వికి, బ్లాక్ రోజెస్ మిత్రాకు వచ్చాయి.
#NatarajMaster - SAFE! #BiggBoss #BiggBossTelugu #BiggBossNonStop @DisneyPlusHS @EndemolShineIND @iamnagarjuna
— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) March 6, 2022
Which contestant will you give red rose?♥️
— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) March 6, 2022
Which contestant will you give black rose?🖤
Endhuku isthaaru ani kooda Comment cheyyandi! #BiggBoss #BiggBossTelugu #BiggBossNonStop @DisneyPlusHS@EndemolShineIND@iamnagarjuna
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
బిజినెస్
ఆంధ్రప్రదేశ్
సినిమా
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion