News
News
వీడియోలు ఆటలు
X

Bigg Boss OTT Telugu: తెలుగమ్మాయి లక్షణాలే లేవు - బిందు మాధవిపై మండిపడ్డ నటరాజ్ మాస్టర్ 

ప్రస్తుతం హౌస్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. టాప్ 5లో ఐదుగురు కంటెస్టెంట్స్ ఉండాలంటే.. ఈ వారంలో ముగ్గురు ఎలిమినేట్ కావాల్సి ఉంటుంది.

FOLLOW US: 
Share:

బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో సోమవారం నాటి నామినేషన్స్ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో హౌస్ మేట్స్ ఒకరినొకరు వ్యక్తిగతంగా దూషించుకున్నారు. నిజానికి ప్రతివారం ఒక్కో కంటెస్టెంట్.. ఇద్దరు హౌస్ మేట్స్ ని నామినేట్ చేసేవారు. అయితే ఈసారి ఒక్కొక్కరు ముగ్గురు చొప్పున నామినేట్ చేయాలని చెప్పారు బిగ్ బాస్. మరో రెండు వారాల్లో బిగ్ బాస్ షో పూర్తి కానుంది. 

ప్రస్తుతం హౌస్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. టాప్ 5లో ఐదుగురు కంటెస్టెంట్స్ ఉండాలంటే.. ఈ వారంలో ముగ్గురు ఎలిమినేట్ కావాల్సి ఉంటుంది. దీంతో బిగ్ బాస్ ఒక్కొక్కరిని.. ముగ్గురిని నామినేట్ చేయమని చెప్పారు. ఈరోజు విడుదలైన ప్రోమోలో బిందు మాధవి.. అఖిల్, నటరాజ్, మిత్రాశర్మల మధ్య గొడవ జరిగింది. ముందుగా బిందు మాధవి.. అఖిల్, నటరాజ్, మిత్రాలను నామినేట్ చేసింది. 

ఎవరూ లేరనే అబద్ధపు ఇమేజ్ ని ఫామ్ చేసి ఇంతవరకు వచ్చిందని మిత్రాను నామినేట్ చేసింది బిందు. 'నేను ఒకటి మాట్లాడితే తాను ఇంకొకటి అన్ సింక్‌లో మాట్లాడుతుందని' అఖిల్ అంటే.. నీకు బుర్రలేదు కదా.. ఉంటే నీకు నేను మాట్లాడేది అర్ధమౌతుందని ఘాటు కామెంట్స్ చేసింది బిందు మాధవి. నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేయడంతో అతడు బిందుపై మండిపడ్డాడు. 

'బిందు వాళ్ల ఫాదర్ కి చెబుతున్నా.. ఈమెకి జ్ఞానాన్ని నేర్పించండి ప్లీజ్' అని కామెంట్ చేశాడు నటరాజ్ మాస్టర్. 'నా తండ్రిని గురించి మాట్లాడొద్దు..' అని సీరియస్ గా చెప్పింది బిందు. దీంతో నటరాజ్ మాస్టర్ మరింత రెచ్చిపోయారు. 'నేను నీలాగా దొంగమాటలు మాట్లాడను.. నీ యాటిట్యూడ్ నువ్వు.. ఒక తెలుగమ్మాయికి ఉండాల్సిన లక్షణమే లేదు' అని పెర్సనల్ ఎటాక్ చేశారు. 

'నేను చాలా స్ట్రాంగ్‌ ఆడాను.. నీలా నేను బెడ్‌పై కూర్చుని కాళ్లు ఊపుతూ కూర్చోలేదు' అని బిందుపై ఫైర్ అవ్వగా.. ఆమె అతడి మీదకు వెళ్తూ 'గో..' అని అంది. దీంతో మాస్టర్ కూడా ఆమె మీదికి మీదికి వెళ్లడంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగిందనిపిస్తుంది. మిత్రాశర్మ, అరియనాల మధ్య కూడా మాటల యుద్ధం జరిగింది.  

Also Read: విజయ్ దేవరకొండ కెరీర్‌లో చేసిన సినిమాలు ఎన్ని? విజయాలు ఎన్ని?

Also Read: ఎస్పీ బాలును గుర్తు చేసిన తనయుడు చరణ్ - 'సీతా రామం'లో తొలి పాట విన్నారా?

View this post on Instagram
 
A post shared by Bindu Madhavi🦋 (@bindu_madhavii)

Published at : 09 May 2022 02:33 PM (IST) Tags: Akhil Bigg Boss OTT Nataraj master Bigg Boss OTT Telugu Bindu Madhavi

సంబంధిత కథనాలు

Karate Kalyani: కరాటే కళ్యాణి 'మా' మెంబర్షిప్ క్యాన్సిల్ - కావాలనే చేశారంటూ నటి ఆగ్రహం

Karate Kalyani: కరాటే కళ్యాణి 'మా' మెంబర్షిప్ క్యాన్సిల్ - కావాలనే చేశారంటూ నటి ఆగ్రహం

Shanmukh Jaswanth New Web Series : 'శివ'గా షణ్ముఖ్ జస్వంత్ - కొత్త సిరీస్ 'స్టూడెంట్' షురూ, లుక్ చూశారా?

Shanmukh Jaswanth New Web Series : 'శివ'గా షణ్ముఖ్ జస్వంత్ - కొత్త సిరీస్ 'స్టూడెంట్' షురూ, లుక్ చూశారా?

ఛీ, యాక్ - నమిలేసిన చూయింగ్ గమ్స్‌తో డ్రెస్, ఫ్యాషన్ ఉసురు తీస్తున్న ఉర్ఫీ!

ఛీ, యాక్ - నమిలేసిన చూయింగ్ గమ్స్‌తో డ్రెస్, ఫ్యాషన్ ఉసురు తీస్తున్న ఉర్ఫీ!

Uorfi Javed: రెస్టారెంట్ లోకి అనుమతించని సిబ్బంది, నేనెవరో తెలుసా అంటూ ఉర్ఫీ జావేద్ రచ్చ

Uorfi Javed: రెస్టారెంట్ లోకి అనుమతించని సిబ్బంది,  నేనెవరో తెలుసా అంటూ ఉర్ఫీ జావేద్ రచ్చ

రణ్‌బీర్ ‘గో టు హెల్’ - ‘బ్యాడ్ టేస్ట్’ కామెంట్స్‌పై ఉర్ఫీ ఫైర్

రణ్‌బీర్ ‘గో టు హెల్’ - ‘బ్యాడ్ టేస్ట్’ కామెంట్స్‌పై ఉర్ఫీ ఫైర్

టాప్ స్టోరీస్

YS Jagan In Delhi: నీతి ఆయోగ్‌ 8వ పాలకమండలి సమావేశంలొ సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలివే

YS Jagan In Delhi: నీతి ఆయోగ్‌ 8వ పాలకమండలి సమావేశంలొ సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలివే

Chandrababu: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నిక, వెంటనే ప్రమాణ స్వీకారం

Chandrababu: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నిక, వెంటనే ప్రమాణ స్వీకారం

Sengol To PM Modi: మఠాధిపతుల నుంచి రాజదండం సెంగోల్ అందుకున్న ప్రధాని మోదీ

Sengol To PM Modi: మఠాధిపతుల నుంచి రాజదండం సెంగోల్ అందుకున్న ప్రధాని మోదీ

ఆఖరి రోజు ఏడిపించేసిన ఎన్టీఆర్ - ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రయూనిట్ భావోద్వేగపు వీడ్కోలు

ఆఖరి రోజు ఏడిపించేసిన ఎన్టీఆర్ - ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రయూనిట్ భావోద్వేగపు వీడ్కోలు