Bigg Boss OTT Telugu: అడ్డంగా బుక్కైన శివ, ఇంటి నుంచి పొమ్మన్న నాగ్
ఆర్జే చైతుకి క్లాస్ పీకారు నాగార్జున. ఫుడ్ ని చెత్తబుట్టలో వేయడంతో అతడికి శిక్ష విధించారు. వారం రోజుల పాటు చైతుకి మధ్యాహ్నం ఫుడ్ పెట్టరు.
బిగ్ బాస్ ఓటీటీ తెలుగు వెర్షన్ మొదలై రెండు వారాలవుతోంది. మొదటి వారంలో ముమైత్ ఖాన్ ఎలిమినేట్ కాగా.. ఈ వారం ఎలిమినేట్ అవ్వడానికి మొత్తం పదకొండు మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ కానున్నారో కాసేపట్లో తెలియనుంది. ఆదివారం నాడు ఎప్పటిలానే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు నాగార్జున.
ముందుగా ఆర్జే చైతుకి క్లాస్ పీకారు నాగార్జున. ఫుడ్ ని చెత్తబుట్టలో వేయడంతో అతడికి శిక్ష విధించారు. వారం రోజుల పాటు చైతుకి మధ్యాహ్నం ఫుడ్ పెట్టొద్దని చెప్పారు. బిందుని కూడా ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పారు నాగార్జున. ఆ తరువాత శివతో మాట్లాడారు నాగార్జున. నామినేషన్ సమయంలో సరయుతో శివ గొడవ పడిన విషయాన్ని ప్రస్తావించారు. సరయుతో డబుల్ మీనింగ్ డైలాగ్ మాట్లాడిన వీడియో ప్లే చేసి చూపించారు నాగార్జున.
అందులో క్లియర్ గా శివ.. సరయుతో డబుల్ మీనింగ్ తో మాట్లాడినట్లు కనిపించింది. దీంతో హౌస్ మేట్స్ ని ఒపీనియన్ అడిగారు నాగార్జున. అందరూ తప్పని చెప్పడంతో నాగార్జున బిగ్ బాస్ హౌస్ గేట్లు ఓపెన్ చేయమని చెప్పారు. దీంతో శివ షాక్ అయ్యాడు. అయితే తేజస్వి, సరయు మరో అవకాశం ఇద్దామని చెప్పడంతో నాగార్జున ఓకే చెప్పారు. సరయుకి శివ క్షమాపణలు చెప్పాడు.
ఆ తరువాత మిత్రా టాస్క్ లో సరిగ్గా ఆడకపోవడంతో నాగార్జున ప్రశ్నించారు. తన టీమ్ తనను పట్టించుకోవడం లేదని మిత్రా.. నాగార్జునకి చెప్పింది. దీంతో నాగ్.. 'నిన్ను నువ్ డిఫెండ్ చేసుకోకపోతే ఇంకెవరు నిన్ను డిఫెండ్ చేయరు' అని చెప్పారు. ఎవరు సపోర్ట్ చేయకపోయినా.. సోలోగా గేమ్ ఆడాలని చెప్పారు.
View this post on Instagram